సైబర్ నేరగాళ్లు (Cyber criminals) రోజురోజుకూ కొత్త పద్ధతులతో ప్రజలను మోసగిస్తున్నారు. తాజాగా, కర్ణాటకలో డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఓ యాప్ ద్వారా భారీ మోసం జరిగింది. ఈ యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాట్లాడుతున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలను సృష్టించారు.ఈ మోసంలో దాదాపు 150 మంది పెట్టుబడులు పెట్టారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ప్రారంభంలో లాభాలు చూపించి, మరింత పెట్టుబడులు వసూలు చేశారు. చివరికి, రూ. కోటికి పైగా వసూలు చేసి, (Collected over a crore) ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో, సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ మోసాలపై అప్రమత్తత
ఈ తరహా సైబర్ మోసాల నుంచి రక్షించుకోవడానికి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనధికారిక లింకులు, యాప్‌లు, సందేశాలను నమ్మకూడదు. బ్యాంకింగ్ లావాదేవీలు చేసే సమయంలో, వర్చువల్ కీబోర్డ్ ఉపయోగించడం, సురక్షితమైన మాల్‌వేర్ ప్రొటెక్షన్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.సైబర్ నేరగాళ్ల నుంచి రక్షించుకోవడానికి, ప్రజలు సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలి. ఈ తరహా మోసాలకు బలికావడం నివారించేందుకు, ప్రభుత్వాలు, పోలీసు శాఖలు, మరియు ప్రజలు కలిసి పనిచేయాలి.
Read Also : Sheikh Hasina : యూనస్‌పై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు