గుంటూరు : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు అన్న దమ్ములిద్దరూ కోర్టుకువచ్చారు.
వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఎ6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎ7 పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నిందితులుగా ఉన్న విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి రెండువారాల్లో లొంగిపోవాలంటూ వీరిద్దరికీ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందికూడా. అయితే గురువారంతో సుప్రీంకోర్టు గడువు ముగియనుండటంతో ఉదయం మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు.
Read also: Vizag : నేడు విశాఖలో 9 IT సంస్థల క్యాంపస్ లకు భూమిపూజ
Pinnelli brothers surrender at Macherla court
పిన్నెల్లి సోదరులకు చుక్కెదురవ్వటం
ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు పరిశీలిస్తే.. ఈ యేడాది మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. తెలంగాణలోని (Telangana) బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న బైక్ ను కారుతో ఢీకొట్టి వీరిని బండరాళ్లతో కొట్టి హత్య చేసిన సంఘటన అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా జంట హత్యల కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో ఎ6గా మాజీ ఎమ్మెల్యే పిఆర్కే, ఎ7గా వెంకటరామిరెడ్డి పేర్లు ఎఫ్ ఐఆర్ పోలీసులు నమోదు చేశారు. అనంతరం తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిన్నెల్లి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. కాగా హైకోర్టులో పిన్నెల్లి సోదరులకు చుక్కెదురవ్వటంతో వీరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రెండు వారాల పాటు సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది
కొద్దిరోజుల పాటు వీరికి సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు విచారణలో భాగంగా ఎపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు విన్పించారు. నిందితులు కేసు విచారణకు సహకరించటం లేదని, సాక్షులను బెదిరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయటంతో పాటు వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. కాగా రెండు వారాలు సమయం ఇవ్వాలని పిన్నెల్లి తరపు న్యాయవాది కోరగా, ఈ క్రమంలో పిన్నెల్లి సోదరులు లొంగిపోయేందుకు రెండు వారాల పాటు సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు కోర్టులో లొంగిపోయేందుకు నిర్ణయించిన పిన్నెల్లి సోదరులు గురువారం మాచర్ల జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు.
‘పిన్నెల్లి’ సోదరులకు 14 రోజుల రిమాండ్
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితులైన మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్సార్సీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వీరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. నిందితులు పిన్నెల్లి సోదరులకు మాచర్ల అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంత్ 14 రోజులు రిమాండ్ విధించారు. పోలీసు బందోబస్తు మధ్య పిన్నెల్లి సోదరులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. గుండ్లపాడు టిడిపి నేతల జంటహత్యల కేసులో పిన్నెల్లి సోదరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టిడిపి నాయకులు జె. కోటేశ్వరరావు, జె. వెంకటేశ్వర్లు హత్యకేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: