📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:AP Fire Accident – ప్రకాశం జిల్లా పొగాకు పరిశ్రమలో భారీ నష్టం

Author Icon By Pooja
Updated: October 10, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అగ్నిప్రమాదాలు(AP Fire Accident) పెరుగుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ సమీపంలో ఉన్న పొగాకు పరిశ్రమలో మంటలు చెలరేగాయి. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌(Electrical short circuit) కారణంగా ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే మొత్తం పరిశ్రమను చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. బీకేటీ సంస్థ వద్ద జీపీఐ కంపెనీ అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలో సుమారు ₹500 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఘటనాస్థలాన్ని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పరిశీలించారు.

Read Also: Guntur Robbery: దంపతుల దొంగతనాల గుట్టు రట్టు – పగటిపూట రెక్కీ, రాత్రి దోపిడీ

కోనసీమలో బాణసంచా కేంద్రంలో పేలుడు – ఎనిమిది మంది దుర్మరణం

రెండు రోజుల క్రితం కోనసీమ జిల్లాలోని రాయవరంలోని గణపతిగ్రాండ్‌ ఫైర్‌వర్క్స్‌లో భారీ పేలుడు సంభవించింది. దీపావళి కోసం బాణసంచా తయారు చేస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో(AP Fire Accident) ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పరిశ్రమ యజమాని సత్తిబాబు, పాక అరుణ, చిట్టూరి శ్యామల, కుడుపూడి జ్యోతి, పెంకే శేషారత్నం ఉన్నారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతతో షెడ్ కూలిపోయి కొంతమంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. రామచంద్రపురం ఆర్డీవో అఖిల ఘటనాస్థలిని పరిశీలించారు. షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రకాశం జిల్లా పొగాకు పరిశ్రమలో అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటి?
విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం.

ఈ ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది?
సుమారు ₹500 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh fire accident Latest News in Telugu Prakasam District Fire Tobacco Factory Fire Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.