ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. 21 ఏళ్ల యువకుడు సాయితేజ్, డిగ్రీ విద్యార్థి, తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా విద్యార్థుల్లోను తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తించింది.
Read Also: Banglore Crime:అబ్బాయిలతో స్నేహంపై మందలించిన తల్లి.. స్నేహితులతో కలిసి హతమార్చి కూతురు
సాయితేజ్ చదువుతున్న సమతా కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ (Female lecturer) వేధింపులే, ఆత్మహత్యకు కారణమని విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..లెక్చరర్ మార్కులు సరిగా వేయకపోవడం, రికార్డులు రిపీటెడ్‌గా రాయించడం, మరో మహిళా లెక్చరర్‌తో కలిసి లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో.. సాయితేజకు, మహిళా లెక్చరర్‌కి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌నూ బయటపెట్టారు. మహిళా అధ్యాపకురాలి వేధింపులే సాయితేజ అత్మహత్యకు కారణమని అతని స్నేహితులు ఆరోపించారు. అయితే.. ఈ చాటింగ్‌లోని పలు అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి.
వాట్సాప్ చాటింగ్
మహిళా లెక్చరర్ భర్తను విద్యార్థి సాయితేజ.. బాబాయ్ అని.. వారి పిల్లలను తమ్ముళ్లు ఎలా ఉన్నారని సంబోధించడం ఆసక్తిగా మారింది.ఇక ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా ప్రొఫెసర్ వేధింపులతోనే..సాయితేజ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యుల ఆరోపణలతో పాటు వాట్సాప్ చాటింగ్‌ను బయటపెట్టడంతో సాయితేజ మొబైల్ డేటా, వాట్సాప్ ఛాటింగ్‌ను పరిశీలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: