📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Crime: హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కత్తులతో దాడి

Author Icon By Anusha
Updated: November 29, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP Crime) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు షుగర్​ ఫ్యాక్టరీలో పోలీసుల కాల్పులు జరిగాయి. ఓ హత్య కేసులో నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కల్లూరుపల్లి హోసింగ్ బోర్డ్​ కాలనీలో పెంచలయ్య అనే వ్యక్తిని కొందరు హత్య చేశారు. ఈ కేసులో నిందితులు ఫ్యాక్టరీ వద్ద దాక్కుని ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా నిందితులు కత్తులతో దాడికి దిగారు. 

Read Also: Chandrababu: ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటన కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది. వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు.

అయితే పోలీసులను చూసిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అంతేకాదు తమ వద్ద ఉన్న కత్తులతో వారిపై దాడికి తెగబడ్డారు. నిందితుల దాడిలో కానిస్టేబుల్ ఆదినారాయణ గాయపడ్డాడు. లొంగిపొమ్మని చెప్పినా నిందితులు వినకుండా కత్తులు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపారుఈ కాల్పులలో నిందితుడు జేమ్స్‌ కాలికి గాయాలు అయ్యాయి.

AP Crime: Police officers who went to arrest the accused in the murder case were attacked with knives

హత్య చేయించింది ఒక మహిళ?

మరో 9 మంది నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు జేమ్స్, కానిస్టేబుల్ ఆదినారాయణ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు.కాగా , ఈ హత్య చేయించింది ఒక మహిళ(Ganja lady don)గా పోలీసులు అనుమానిస్తున్నారు.వ్యాపారానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఏకంగా హత్య చేయించడం నెల్లూరు జిల్లాలో సంచలనం రేపింది.

స్థానికంగా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా పోలీసులు పట్టించు కోలేదని దాంతో దుండగులు చివరకు హత్యకూ బరి తెగించారని స్థానికులు ఆరోపించారు. గతంలో ఎన్నో సార్లు నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశామని అయినా ఫలితం లేకపోయిందని, చివరకు పెంచలయ్య ప్రాణాలు తీశారని స్థానిక యువకులు మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

CPM leader murder case Kovur incident latest news Nellore encounter Penchalaiah Police Firing Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.