Ap Crime: అన్నమయ్య జిల్లాలో మానవత్వం మసకబారిపోయేలా ఒక హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లె మండల పరిధిలో నివసించే ఓ మైనర్ బాలికపై ఆమెకు దగ్గర బంధువైన అన్నయ్యే లైంగిక దాడికి (Sexual_assault) పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన చెల్లిని కాపాడాల్సిన బాధ్యత మరిచి, కామావేశానికి లోనై అఘాయిత్యం జరిపిన అన్న ప్రవర్తన సమాజాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ దారుణం వల్ల బాధిత మైనర్ బాలిక గర్భం (pregnancy) దాల్చి, తాజాగా ఓ శిశువుకు జన్మనిచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
Kanpur: కాన్పూర్ లో స్కూటర్లలో పేలుడు
Ap Crime
వివరాల్లోకి వెళ్తే — బాలిక తండ్రి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల Financial Distress కారణంగా ఆమె తల్లి గల్ఫ్ దేశానికి ఉద్యోగం కోసం వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను ఆమె పెద్దనాన్న కుమారుడు (అంటే అన్నయ్యే అవుతాడు) మాయమాటలతో లొంగదీసుకున్నాడు. (Ap Crime) కొన్ని నెలలుగా కొనసాగిన ఈ దారుణ చర్యల ఫలితంగా బాలిక గర్భవతి అయింది. పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు బాలిక గర్భవతని గుర్తించారు. ఈ నెల 7వ తేదీన బాలిక ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలికను అడిగినపుడు జరిగిన విషయం బయటపడింది. విషయం బయటకు రావడంతో గ్రామం మొత్తంలో కలకలం రేగింది.
ఈ కేసుపై పోలీసులు చర్యలు ప్రారంభించి, నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు వైద్యసహాయం మరియు కౌన్సెలింగ్ అందించే చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: