📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP crime: రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

Author Icon By Aanusha
Updated: March 8, 2026 • 10:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP crime: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. ఈ కేసులో ఆమెను రెండో నిందితురాలిగా (A2) పరిగణిస్తూ కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

Read Also: Madhya Pradesh Crime: పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష

AP crime: Anantha Babu’s wife gets slapped in Rajahmundry court

దీంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గను సిట్ అధికారులు ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం రోజున రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో సిట్ అధికారులు అదనపు అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. లక్ష్మీ దుర్గపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు లక్ష్మీ దుర్గ కూడా పాల్గొన్నారని సిట్‌ అధికారులు తేల్చిన సంగతి తెలిసిందే. సుబ్రమణ్యం హత్యకు ప్రేరేపించడంతో పాటుగా అనంతబాబుకు సహకారం అందించారని సిట్ పేర్కొంది. అలాగే హత్య జరిగిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేయటంలోనూ లక్ష్మీ దుర్గ కీలకంగా ఉన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. హత్య సమయంలో ఘటనాస్థలిలో లక్ష్మీదుర్గ ఉన్నారని.. సుబ్రమణ్యం మృతదేహాన్ని తీసుకెళ్లిన వాహనంలోనూ ఆమె ఉన్నారని సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలోనే సుబ్రమణ్యం హత్య కేసులో లక్ష్మీ దుర్గను ఏ2గా చేర్చింది. ఈ వివరాలతో రాజమండ్రి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ap crime Driver Subrahmanyam Murder Case Lakshmi Durga A2 MLC Ananta Babu Rajahmundry SC ST Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.