AP Crime: మద్యం మత్తులో అన్నను హత్య చేసిన తమ్ముడు

Read Time:  1 min
AP Crime
AP Crime
FONT SIZE
GET APP

ఉమ్మడి చిత్తూరు(AP Crime) జిల్లా పరిధిలో శనివారం అర్ధరాత్రి హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసింది. ఈ ఘటన గుర్రంకొండ పంచాయతీ పరిధిలోని మగ్బీరా గ్రామంలో జరిగింది.

Read Also: UPCrime: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

AP Crime

పోలీసుల వివరాల ప్రకారం.. రఫీ (23) మద్యం మత్తులో(AP Crime) తన అన్న సాధిక్ (26)తో వాగ్వాదానికి దిగాడు. మాటల తూటాలు తీవ్రస్థాయికి చేరడంతో ఆగ్రహానికి లోనైన రఫీ కత్తితో సాధిక్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రక్తస్రావం అధికమవడంతో సాధిక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. సాధిక్ తిరుపతిలో కూలీ పనులు చేస్తుండగా, రఫీ స్వగ్రామంలోనే పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే సాధిక్ గుర్రంకొండకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.