Andhra Pradesh Crime: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. విచారణకు హాజరైన లక్ష్మీదుర్గ

Read Time:  1 min
Andhra Pradesh Crime: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. విచారణకు హాజరైన లక్ష్మీదుర్గ
FONT SIZE
GET APP

Andhra Pradesh Crime: ఏపీలో పెను సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో రెండో నిందితురాలిగా (A2) ఉన్న మాజీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడారు. రాజమహేంద్రవరం కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో, రక్షణ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు ఇచ్చిన షరతులతో కూడిన వెసులుబాటు మేరకు ఆమె నేడు సిట్ (SIT) అధికారుల ముందుకు విచారణ నిమిత్తం హాజరయ్యారు.

Read Also: Hyderabad Crime: ఎఆర్ కానిస్టేబుల్ దారుణహత్య

హైకోర్టు ఆదేశాలు, విచారణ షెడ్యూల్

రాజమహేంద్రవరం కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో, రక్షణ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆమెకు షరతులతో కూడిన వెసులుబాటు కల్పిస్తూ, ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు ప్రతిరోజూ విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఆమె ఈరోజు సిట్ ముందు హాజరయ్యారు.ఈ హత్య జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలో లేనని, బంధువులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లానని లక్ష్మీదుర్గ గతంలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

Andhra Pradesh Crime: Driver Subramaniam murder case.. Lakshmi Durga attends the hearing
Andhra Pradesh Crime: Driver Subramaniam murder case.. Lakshmi Durga attends the hearing

కానీ సాంకేతిక ఆధారాలు, ముఖ్యంగా సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన సిట్ అధికారులు, ఆమె చెప్పేవన్నీ అబద్ధాలని తేల్చారు. హత్య జరిగిన రాత్రి ఆమె అనంతబాబుతో కలిసే ఉన్నట్లు, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసే సమయంలో కూడా ఆమె పాత్ర ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను నిందితురాలిగా చేరుస్తూ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో ఆమె ఈరోజు విచారణకు హాజరయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.