📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Anantapur: కుమార్తెలను కాలువలో పడేసిన తండ్రి.. ఒకరు మృతి

Author Icon By Rajitha
Updated: December 24, 2025 • 5:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో (Anantapur district) హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన కల్లప్ప అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను హెచ్‌ఎల్‌సీ కాలువ వద్దకు తీసుకెళ్లి నీళ్లలోకి తోసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఒక బాలిక మృతి చెందగా, మరో బాలిక కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటపడటంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Read also: AP Solar Scheme: అందని ద్రాక్ష పిఎం సూర్యఘర్ యోజన..

Anantapur

భయంతో పారిపోవడానికి ప్రయత్నించిన

స్థానికుల కథనం ప్రకారం, సింధు మరియు అనసూయ అనే ఇద్దరు బాలికలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కాలువ వద్ద పెద్ద కుమార్తెను నీళ్లలోకి తోసిన తర్వాత, భయంతో పారిపోవడానికి ప్రయత్నించిన చిన్న కుమార్తెను కూడా వెంబడించి పట్టుకుని కాలువలోకి నెట్టినట్టు తెలుస్తోంది. పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కల్లప్పను ప్రశ్నించగా, అతడు చేసిన పనిని అంగీకరించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు విచారణ చేపట్టి కాలువలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో అనసూయ మృతదేహం లభ్యమైంది. మరో బాలిక కోసం శోధన కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నిందితుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అతడు కోలుకున్న తర్వాత పూర్తి విచారణ చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

anantapur Andhra Pradesh Canal Incident Crime latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.