Anakapalli accident: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నూతనగుంటపాలెం వద్ద ఉన్న నల్లమారమ్మ ఆలయం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని గుర్తుతెలియని వాహనం అతివేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది.
Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ
పోలీసులు కేసు నమోదు
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కశింకోట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: