📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Air India: ఎయిర్ ఇండియా ప్రమాదం: ఇంజిన్ ఫెయిల్యూరే కారణమా?

Author Icon By Shobha Rani
Updated: July 2, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చిన ఎయిర్ ఇండియా (Air India) విమాన ప్రమాద ఘటనలో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. 241 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటనకు రెండు ఇంజిన్లు ఏకకాలంలో విఫలం కావడమే ప్రధాన కారణమా అనే కోణంలో అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.
దర్యాప్తు కీలక దశలోకి
దర్యాప్తులో భాగంగా ఎయిర్ ఇండియా (Air India) పైలట్లు, ఫ్లైట్ సిమ్యులేటర్‌లో ప్రమాదానికి గురైన విమాన పరిస్థితులను పునఃసృష్టించి పరీక్షించారు. ల్యాండింగ్ గేర్ తెరిచి ఉంచి, రెక్కల ఫ్లాప్స్‌ను ముడిచిన స్థితిలో విమానాన్ని నడిపి చూశారు. అయితే, కేవలం ఈ పరిస్థితుల వల్ల విమానం కూలిపోలేదని వారి సిమ్యులేషన్ పరీక్షల్లో తేలింది. దీంతో ప్రమాదానికి మరేదో బలమైన సాంకేతిక కారణం ఉండి ఉంటుందన్న వాదనకు బలం చేకూరినట్లయింది. ముఖ్యంగా, రెండు ఇంజిన్లు ఒకేసారి శక్తిని కోల్పోయి ఉండవచ్చని దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఎయిర్ ఇండియా ప్రమాదం: ఇంజిన్ ఫెయిల్యూరే కారణమా?

ఇంజిన్ ఫెయిల్యూర్‌కు సూచనలేనా?
ఈ అనుమానాలకు మరిన్ని ఆధారాలు కూడా బలం చేకూరుస్తున్నాయి. విమానం నేలను ఢీకొట్టడానికి కొన్ని క్షణాల ముందు, అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ను అందించే ‘రామ్ ఎయిర్ టర్బైన్స్‌ (ఆర్ఏటీ) యాక్టివేట్ అయినట్టు గతంలోనే గుర్తించారు. విమానంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినప్పుడు మాత్రమే ఈ టర్బైన్ పనిచేస్తుంది. ఇది ఇంజిన్లలో తీవ్రమైన సమస్య తలెత్తిందనడానికి స్పష్టమైన సంకేతమని నిపుణులు భావిస్తున్నారు.
ఇంజిన్లు, బోయింగ్ మోడల్ వివరాలు
ప్రమాదానికి ముందు తీసిన వీడియో ఫుటేజీని పరిశీలించగా, టేకాఫ్ అయిన తర్వాత విమానం గాల్లోకి లేవడానికి తీవ్రంగా ఇబ్బంది పడినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా కిందకు దిగివచ్చి నేలను ఢీకొని పేలిపోయింది. విమాన శిథిలాలను పరిశీలించినప్పుడు ల్యాండింగ్ గేర్ చక్రాలు పాక్షికంగా లోపలికి ముడుచుకుని ఉన్నట్లు తేలింది. దీన్ని బట్టి పైలట్లు చక్రాలను లోపలికి తీసుకునే ప్రక్రియను ప్రారంభించారని తెలుస్తోంది. కానీ, ల్యాండింగ్ గేర్ డోర్లు తెరుచుకోలేదు. ఇది విమానంలో పవర్ లేదా హైడ్రాలిక్ వ్యవస్థ ఫెయిల్ అయిందనడానికి మరో నిదర్శనమని పైలట్లు అభిప్రాయపడుతున్నారు. విమానానికి విద్యుత్‌ను, హైడ్రాలిక్ శక్తిని అందించేది ఇంజిన్లే కావడంతో అనుమానాలన్నీ వాటి వైఫల్యం చుట్టూనే తిరుగుతున్నాయి.

‘మేడే’ సిగ్నల్ తర్వాత కేవలం 15 సెకన్లలో ప్రమాదం
ఈ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) కంపెనీకి చెందిన రెండు ఇంజిన్లు ఉన్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు ‘మేడే’ అంటూ ఆపద సంకేతాలు పంపారు. ఈ సిగ్నల్ పంపిన కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోయిందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్ సంస్థలు నిరాకరించాయి. ఎయిర్ ఇండియా(Air India), ఏఏఐబీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
బ్లాక్‌బాక్స్ డేటా విశ్లేషణలో ఆశ
ప్రస్తుతం ఫ్లైట్ రికార్డర్ల (బ్లాక్ బాక్సులు) నుంచి సేకరించిన డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణ పూర్తయితే ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలిసే అవకాశం ఉంది. దశాబ్దాల తర్వాత భారత ఏవియేషన్ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం కాగా, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురై పూర్తిగా ధ్వంసం కావడం కూడా ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) బృందం కూడా ఈ దర్యాప్తులో భారత అధికారులకు సహకారం అందిస్తోంది.

Read Also: Covid Vaccines: ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్లకు సంబంధం

AAIB investigation Ahmedabad plane crash Air India accident cause Air India crash 2025 black box analysis Boeing 787 engine failure Breaking News in Telugu dual engine shutdown GE engines Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News RAT turbine sudden crash after takeoff Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.