AI : AI ని ఇలా కూడా వాడుతున్నారా ..? మీ దుంప తేగ !!

Follow Us: Google News Daily Hunt
AI : AI ని ఇలా కూడా వాడుతున్నారా ..? మీ దుంప తేగ !!
FONT SIZE
GET APP

AI : సాంకేతికత ఎంతగా ఎదుగుతుందో, దాన్ని చెడు దారుల్లో వాడే మనుషుల ఆలోచనలు కూడా అంతే వేగంగా దిగజారుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక 11వ తరగతి విద్యార్థి ఆన్‌లైన్ గేమ్ ‘పబ్జీ’ (PUBG)కి తీవ్రంగా బానిసయ్యాడు. గేమ్ ఆడుతూ ఏకంగా రూ.3 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బును ఎలాగైనా భర్తీ చేయాలని, లేదంటే ఇంట్లో తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో ఒక దారుణమైన ప్లాన్ వేశాడు. తన ప్రేయసి సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి, ఒళ్లంతా తీవ్ర గాయాలు, రక్తపు మరకలతో ఉన్న తన ఫొటోను క్రియేట్ చేశాడు. తాను కిడ్నాప్‌కు గురయ్యానని నమ్మించేలా ఆ ఫొటోను సొంత తండ్రి ఫోన్‌కే పంపించాడు. “వెంటనే రూ.లక్ష పంపండి.. లేదంటే మీ కొడుకు శవం ఇంటికి వస్తుంది” అంటూ కిడ్నాపర్ రూపంలో తండ్రినే బెదిరింపులకు గురిచేశాడు.

Read Also : ₹1 కోటి లంచం కేసులో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్: మాక్ ఇంటర్వ్యూ వీడియో వైరల్

రాత్రికి రాత్రే సీన్ రివర్స్.. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు!

కొడుకు ఫొటో చూసి అల్లాడిపోయిన ఆ తండ్రి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులను ఆశ్రయించాడు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితుడి తండ్రికి వచ్చిన మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ఆధారంగా ఆ నంబర్‌పై నిఘా పెట్టారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో నిందితుడి ఫోన్ లోకేషన్‌ను ట్రాక్ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత, సరిగ్గా రాత్రి 2 గంటల సమయంలో అతడు తన స్నేహితుడి ఇంట్లో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి, గేమ్ నష్టాలను పూడ్చుకోవడానికే ఏఐతో ఫొటోలు సృష్టించి ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు ఆ విద్యార్థి ఒప్పుకున్నాడు. సాంకేతికతను మంచికి కాకుండా ఇలాంటి నేరాలకు వాడుతున్న తీరు చూసి పోలీసులు సైతం ముక్కున వేలేసుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు