విద్యార్థినులపై లైంగిక వేధింపులు, కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాలు వంటి ఆరోపణలతో కొన్ని రోజులుగా పరారీలో ఉన్న వివాదాస్పద స్వామి చైతన్యానంద సరస్వతి Swami Chaitanya Saraswati ఎట్టకేలకు పోలీసులు గుట్టు రట్టయ్యాడు. Agra ప్రత్యేక సమాచారం ఆధారంగా చర్యలు తీసుకున్న పోలీసులు, ఈ తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు ఆగ్రాలోని ఓ హోటల్‌లో అతడిని అరెస్ట్ చేశారు. 62 ఏళ్ల చైతన్యానంద అసలు పేరు పార్థసారథి. Parthasarathi ఢిల్లీలోని శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్‌గా పనిచేసిన అతడు, స్కాలర్‌షిప్‌పై చదువుకుంటున్న 17 మందికి పైగా విద్యార్థినులను వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. విద్యార్థినుల కదలికలను నిఘా పెట్టడం, అసభ్యకర సందేశాలు పంపడం, రాత్రివేళ తన గదికి రమ్మని ఒత్తిడి చేయడం వంటి అంశాలు ఎఫ్‌ఐఆర్ FIR లో నమోదు అయ్యాయి.
Agra
ఆగ్రాలోని ఓ హోటల్‌లో
ఈ పరిణామాల నేపథ్యంలో శృంగేరి మఠం యాజమాన్యం అతడిని డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. అదే సమయంలో దేశం విడిచి పారిపోకుండా పోలీసులు లుక్‌అవుట్ నోటీసు కూడా జారీ చేశారు. లైంగిక ఆరోపణలతో పాటు, మఠ నిధుల దుర్వినియోగం కేసులో కూడా అతని పేరు వెలుగులోకి వచ్చింది. 2010లో నకిలీ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దాదాపు రూ. 20 కోట్ల ఆస్తులను తన ఆధీనంలోకి మళ్లించాడని, 2024 డిసెంబర్‌లో జరిగిన ఆడిట్‌లో తేలింది. కేసు నమోదైన వెంటనే రూ. 55 లక్షలు బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసి, నకిలీ పాస్‌పోర్ట్ సృష్టించి తప్పించుకునే ప్రయత్నం చేశాడని విచారణలో బయటపడింది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ Delhi కోర్టులో వేసిన పిటిషన్ గత వారం తిరస్కరించబడింది. అన్ని వైపులా పోలీసులు ఉచ్చు బిగించడంతో, చివరికి ఆగ్రాలోని Agra ఓ హోటల్‌లో అతడు అదుపులోకి వచ్చాడు.
స్వామిజీ చైతన్యానంద ఎక్కడ అరెస్ట్ అయ్యారు?
ఆగ్రాలోని ఒక హోటల్‌లో, ప్రత్యేక సమాచారంతో రాత్రి 3:30 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆయనపై ఎన్ని విద్యార్థినులపై ఆరోపణలు ఉన్నాయి?
17 మంది విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: