Addanki Crime: అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

Read Time:  1 min
Addanki Crime: అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య
FONT SIZE
GET APP

Addanki Crime: ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొరిశపాడు మండలం పిచ్చుకలగుడిపాడు గ్రామంలో అనుమానం అనే పెనుభూతం ఒక నిండు సంసారాన్ని చిన్నాభిన్నం చేసింది. భార్యను హతమార్చిన భర్త, ఆపై తాను కూడా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also: Malkajgiri Crime: ఆర్థిక మంత్రి పేరుతో డీప్ ఫేక్ స్కామ్..

కలహాల కాపురం.. అనుమానమే కారణం

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఫలతోటి రామారావు (45), ఫలతోటి అరుణ (40) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా భార్య ప్రవర్తనపై రామారావుకు అనుమానం కలగడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.కోపంలో భర్త రామారావు భార్య అరుణపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంంతో ఆమె చనిపోయింది. ఆ తరువాత తాను కూడా పరుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Addanki Crime: Husband kills wife on suspicion.. commits suicide
Addanki Crime: Husband kills wife on suspicion.. commits suicide

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.ఈ విషయం తెలుసుకుని.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను శవపంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న ఈ దారుణ నిర్ణయంతో ఆ పిల్లలు అనాథలుగా మారారు. అన్యోన్యంగా ఉండాల్సిన సంసారంలో అనుమానం పెనుభూతంగా మారి ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడంతో పిచ్చుకలగుడిపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.