📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Lakshmi Menon: కిడ్నాప్ కేసులో.. నటి లక్ష్మీ మీనన్‌కు కోర్టులో భారీ ఊరట

Author Icon By Aanusha
Updated: October 9, 2025 • 10:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కిడ్నాప్‌, దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ నటి లక్ష్మీ మీనన్‌ (Lakshmi Menon) కు కేరళ హైకోర్టు (High Court of Kerala) లో పెద్ద ఊరట లభించింది. కేరళ సినీ రంగాన్ని కుదిపేసిన ఈ కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న లక్ష్మీ మీనన్‌తో పాటు మరో ఇద్దరికి ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరు చేసింది. ఈ నిర్ణయం ఆమె అభిమానుల్లో ఊరట కలిగించింది.

Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతి కేసులో DSP అరెస్ట్

ఈ వివాదాన్ని రాజీ ధోరణిలో సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు బాధితుడు (ఫిర్యాది) అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.జస్టిస్ బెచు కురియన్ థామస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ సందర్భంగా, “ఎఫ్ఐఆర్‌లోని ఆరోపణలు ప్రాథమికంగా తీవ్రమైన నేరాలను సూచిస్తున్నాయి.

 Lakshmi Menon

అయితే, ఈ వివాదం పరిష్కారమైందని, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫిర్యాది అఫిడవిట్ (Affidavit) దాఖలు చేశారు” అని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడి అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

కొచ్చిలోని ఒక పబ్‌లో ఈ వివాదం మొదలైంది

ఈ ఏడాది ఆగస్టు 24న కొచ్చిలోని ఒక పబ్‌లో ఈ వివాదం మొదలైంది. అక్కడ లక్ష్మీ మీనన్ (Lakshmi Menon), ఆమె స్నేహితులకు, ఒక ఐటీ నిపుణుడికి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఆ ఐటీ నిపుణుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన కారును అడ్డగించి, తనను బయటకు లాగి, వారి వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకుని దాడి చేశారని ఎఫ్ఐఆర్‌ (FIR) లో ఆరోపించారు.దీంతో పోలీసులు లక్ష్మీ మీనన్‌ (Lakshmi Menon)పై కిడ్నాప్ (సెక్షన్ 140(2)), అక్రమ నిర్బంధం (సెక్షన్ 127(2)), దాడి (సెక్షన్ 115(2)), నేరపూరిత బెదిరింపులు (సెక్షన్ 351(2)) సహా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), 2023 కింద పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని లక్ష్మీ మీనన్ తన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజా కోర్టు ఉత్తర్వులతో, దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ లక్ష్మీ మీనన్‌కు అరెస్టు నుంచి తాత్కాలికంగా రక్షణ లభించినట్లయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

anticipatory bail Breaking News kerala high court Kidnap Case Lakshmi Menon latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.