📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Acid Attack in Maharashtra: 11 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి!

Author Icon By Pooja
Updated: March 18, 2026 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Acid Attack in Maharashtra: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా సంగమ్నేర్ తాలూకాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వడ్గావ్ పాన్ ప్రాంతంలో ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై ఒక దుర్మార్గుడు యాసిడ్‌తో దాడికి పాల్పడ్డాడు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 11:30 నుండి 12:45 గంటల మధ్యలో ఈ ఘోరం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఇలాంటి అమానుషం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Read Also:Indore Fire Accident: ఇండోర్‌లో ఘోర అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం!

స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా చిన్నారిపై యాసిడ్ పోసిన దుర్మార్గుడు.

Acid Attack in Maharashtra: Acid attack on an 11-year-old girl!

పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి బయలుదేరిన ఆ చిన్నారిని గుర్తుతెలియని యువకుడు దారిలో అడ్డుకున్నాడు. ఏదో అడ్రస్ అడుగుతున్నట్లుగా నటిస్తూ ఆ బాలికను మాటల్లో దింపాడు. ఆమె తేరుకునేలోపే తన వద్ద ఉన్న యాసిడ్‌ను ఒక్కసారిగా బాలిక ముఖంపై పోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో విలవిలలాడిన ఆ చిన్నారిని చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ అమానుష దాడిపై అహ్మద్‌నగర్ జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పాఠశాలకు వెళ్లే చిన్నారులకు రక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AcidAttack Ahmednagar SchoolGirlAttack WomenSafety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.