దేశంలో మరోసారి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కర్ణాటక (Karnataka Bus Accident) లో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారు జామున.. లారీ ఒకటి.. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి.. పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.. సదరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. బెంగళూరు (Karnataka Bus Accident)నుంచి శివమొగ్గ వెళ్తుండగా.. చిత్రదుర్గ వద్ద ప్రమాదానికి గురైంది. బస్సును ఢీకొట్టిన లారీ కూడా మంటల్లో దగ్ధమైంది.
Read Also: Bandi Sanjay: గ్రామీణ అభివృద్ధి ప్రణాళికల్లో కేంద్రం యత్నం
మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శాయశక్తుల ప్రయత్నించారు
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాద స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శాయశక్తుల ప్రయత్నించారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు కూడా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: