ఉత్తర్‌ప్రదేశ్(Uttara Pradesh) రాజధాని లఖ్‌నవూ(Lunknapur)లో హృదయాన్ని కలచివేసే సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక ఒక శిశువుకు జన్మనిచ్చింది. లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్‌లో ఉన్న ఝాల్కారి బాయి ఆసుపత్రిలో ఆ బాలిక గురువారం ప్రసవించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులు రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ప్రసవం చేసారు. అయితే బాలికపై అత్యాచారం చేసిన 23 ఏళ్ల నిందితుడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
బాలికపై పలుమార్లు అత్యాచారం
యూపీలోని బహ్రైచ్ జిల్లాకు చెందిన బాలిక కుటుంబం బతుకుదెరువు కోసం లఖ్‌నవూకు వలస వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చిన్నగదిలో గోమతి నగర్ ఎక్స్‌టెన్షన్‌లో ఆ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ సమయంలో ప్రమోద్ అనే యువకుడు తరచుగా వారి ఇంటికి వచ్చేవాడు. కుటుంబ పరిచయం ఉన్న కారణంగా, ఎవరూ అనుమానించలేదు. ఈ క్రమంలో అతడు బాలికపై పలుమార్లు అత్యాచారం లైంగిక దాడి చేశాడు. బాలిక ఆరోగ్యంలో మార్పులు రావడంతో తల్లిదండ్రులు గమనించారు. బాలికను గట్టిగా అడగ్గా తనపై జరిగిన లైంగిక దాడి గురించి తల్లిదండ్రులకు చెప్పింది.
యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు
ఈ ఘటన ఈ ఏడాది మే9న వెలుగులోకి రాగా మరుసటి రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. మే 30న పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేసారు. అనంతరం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతి అనే షాకింగ్ విషయం తెలిసింది. ఆగస్టు 6 రాత్రి బాలికకు పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు ఝాల్కారి బాయి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆగస్టు 7న ఉదయం 3 గంటల ప్రాంతంలో సాధారణ ప్రసవం ద్వారా ఆ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం వైద్య బృందం బాలికకు కౌన్సెలింగ్ చేస్తోంది. శిశువు సంరక్షణ, తల్లి ఆరోగ్యం, మానసిక ధైర్యం వంటి అంశాలపై మార్గదర్శనం ఇస్తున్నారు. తల్లి-శిశువుకు చికిత్స పూర్తిగా ఉచితంగా అందిస్తామని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :