కాలాన్ని వృథా చేయకండి, ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాలేదు’ మహాత్మాగాంధీ, ‘కాలం అనేది మనకు ఇచ్చిన అత్యంత విలువైన దానం, దాన్ని మీరు ఉప యోగించకపోతే అది మిగిలి పోయే అపరాధం’ మహాత్మా జ్యోతిరావు ఫూలే. సృష్టిలో ప్రతిజీవికి 24గంటల సమయమే ఉంది. మానవుడికి కూడా ఇదే వర్తిస్తుంది. కొందరు ఈ 24గంట ల కాలాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుని, ప్రపం చంలోనే పేరుప్రఖ్యాతలు గాంచారు. ఇదే సమయాన్ని మరికొందరు సరిగ్గా ఉపయోగించుకోకుండా, చెడు ప్రభా వాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాలమనేది మన చేతుల్లోనే ఉంది. దాన్ని సరిగ్గా వాడుకుంటే, అది మన విజయాలకు దోహదం చేస్తుంది. లేకపోతే మనల్ని పాతాళం లోకి నెట్టుతుంది. ఈ వివేచనంతోనైనా రానున్న ఏడాదిలో నైనా జీవించి, సక్సెస్ పొంది, ఇతరులను ఆద ర్శంగా నిలబడాలనే చిరుప్రయత్నమే ఈ వ్యాసం ఉద్దేశం.
మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతు న్నాం. మొన్ననే కొత్త ఏడాదిలోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది, అంతలోనే సంవత్సరం చివరిమాసంలోకి వచ్చేశాం. టైమ్ పరుగులు తీస్తోంది. కాలంతో పాటు మనం కూడా పరుగులు తీయాల్సిందే. లేకపోతే విజయకెరటాలను చేరుకోలేం. విద్యార్థి దశలో సమయము ప్రాముఖ్యత విద్యార్థులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
విద్యార్థులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ చదువుల్లో విజయాలను సాధించి తద్వారా వ్యక్తిగతాభివృద్ధి పొందుతారు. ప్రతిరోజు ఒక సమయ పట్టిక (టైమ్ టేబుల్) రూపొందించాలి. ఈ పట్టికలో చదవడం, వినోదం, విశ్రాంతి, శారీరక వ్యాయామం-ఇతర పనులకు సమయం కేటాయించాలి. ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. అత్యంత ప్రాధాన్యమైన పనుల్ని ముందుగా చేయడం, తర్వాత తేలికపాటి పనులు చేయడం మంచిది. సమయాన్ని దేన్ని దానితో సమాంతరంగా చేయకుండా, ప్రతి పనికి అంచనా వేసి దానిని వాసిలి సురేష్ పూర్తి చేయడం జరగాలి, నిరంతరం గా నెమ్మదిగా లేదా ఆల స్యం చేయకుండా పనులు పూర్తి చేయ డం మంచిది, ఒకసారి అంతరాయం ఏర్పడి ఆగితే తర్వాత ముందుకు సాగడం కష్టంతో కూడుకున్న వ్యవహారం అని తెల్సుకోవాలి. విద్యార్థులు జ్ఞానాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా, మానసిక – ఆరోగ్యాన్ని కాపాడుకో వాలి. అందుకోసం వారంలో కాస్త సమ యం విశ్రాంతికి, వ్యాయామానికి కేటాయించాలి. గడిచే సమయాన్ని మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, గేమింగ్ లాంటి వాటితో వృథా చేయకూ డదు. ఫోన్లు వినియోగం, సోషల్ మీడియా వినియోగంపై స్వీయ నియంత్రణ పాటించాలి. పాఠ్యపుస్తకాలు చదవడంతో పాటుగా, ఇతర మోటివేషనల్ బుక్స్, స్ఫూర్తిదాయక పుస్తకాలను కూడా చదవడం అలవాటు చేసుకోవాలి, నిరంతరం నేర్చుకోవడం ఒక అలవాటుగా మారాలి.
విద్యార్థులు ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసు కోవాలి. అంతేగాక నేర్చుకోవ డానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు విద్యార్థులు తాము చేస్తున్న పనుల్ని సమీక్షించి ఆత్మపరిశీలన రెడి చేసుకోవాలి, తద్వారా వాటిని మరింత మెరుగ్గా చేసేందుకు కృషి చేయాలి. విద్యార్థి దశలో సమయానికి ప్రాధాన్యత ముఖ్యమై నది. విద్యార్థి జీవితంలో సమయం సరిగ్గా వినియోగించకపోతే, అది విద్యా లక్ష్యాలను సాధించడంలో ఇబ్బందులు ఎదురవుతా యి. సమయాన్ని సక్రమంగా వినియోగించడం వల్ల విద్యార్థులు తమ అకడమిక్, నాన్ అకడమిక్ పనులన్నీ సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థి దశలో వివిధ అసైన్మెంట్లు, పరీక్షలు, ప్రాజెక్టులు, హోమ్వర్క్ సమయాన్ని సరిగ్గా కేటాయించేయాలి. సమయాన్ని సరైన విధంగా కేటాయిం చడం ద్వారా, విద్యార్థులు నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఈ ప్రావీణ్యత వారిని తమ కెరీర్లో విజయం సాధించేందుకు తోడ్పడుతుంది. విద్యార్థులు తమ రోజు, వారం లేదా నెలలో చేయాల్సిన పనులను వివరిస్తూ ఒక ప్లాన్పట్టిక తయారు చేసుకోవడం వారి సమయాన్ని మంచిగా వాడేందుకు సహాయ పడుతుంది. ముఖ్యమైన పనులను ముందుగానే గుర్తించి, అవి పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ‘ఉదాహరణకు విద్యార్థి ఒక నిర్దిష్ట అంశంపై ఎక్కువ సమయం గడిపి, మిగతా వాటిని తక్కువ సమయంతో నిర్వహించవచ్చు.
విద్యార్థి దశలో, కుటుంబం, స్నేహితులు, హాబీలు, ఆత్మీయ సంబంధాలు కూడా చాలా ముఖ్యమైనవి. కాబట్టి, విద్యార్థులు చదువు, ఆటలతో పాటు తను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కూడా సమ యం గడపడం నుంచిది. ఇది వారి మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సంతృప్తిని పెంచుతుంది. విద్యార్థులు తమ సమయా న్ని విద్య, క్రీడలు, సంగీతం, చిత్రకళ, ఇతర హాబీలలో సరైన విధంగా వినియోగించడం, విద్యార్థి అభివృద్ధికి ముఖ్యమైనది. ఇవి మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి తోడ్పడతాయి, సమాజంలో మెలిగే అద్భుతమైన వ్యక్తిత్వం కోసం, విద్యార్థులు అనేక స్వచ్ఛంద సేవా కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. సేవా కార్యక్రమాలు సామాజిక బాధ్యతను అర్థం చేసుకునేలా చేస్తాయి. అన్నీ పనులకు సరైన సమయం కేటాయించడం ద్వారా, విద్యార్థులు తమ లక్ష్యాలను సులభం గా సాధించ గలుగుతారు. తమ సామర్థ్యాన్ని తాము తెలుసుకొని, రోజువారీ కార్యాలను కనీస సమయంలో పూర్తి చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సమయాన్ని సరిగా పద్ధతిలో కేటాయించడం వల్ల, విద్యార్థి తరచుగా ఒత్తిడిని ఎదుర్కొనకపోవచ్చు, పరీక్షలు లేదా ప్రాజెక్టు సమీపిస్తున్న ప్పుడు, ముందుగానే ప్రణాళికలు చేసి, పనులను విడతలుగా పూర్తి చేయడం వల్ల, అనుకున్న పనులు సులభంగా పూర్తి చేయవచ్చు. చదువుతో పాటు, శారీరక ఆరోగ్యానికి కూడా సమయం కేటాయించడం ముఖ్యం.
ప్రతి రోజు వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, మంచి నిద్రపోవడం ద్వారా శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. విద్యార్థి దశలో సమయాన్ని సరిగా వినియోగించడం, సోషల్ మీడియా నందు నిరంతర విషయాలు, వీడియోలు ఉండటం వలన అధిక ఫోన్లు చూడటంతో ఎదురవుతాయి.
పెట్టడంలో జై భావితరంలో మంచి కెరీర్ అవకాశాలను ఏర్పరుస్తుంది. విద్యార్థులు తమ అభిరుచులు నెపుణ్యాలు అదిమది చేసి వాటిపై దుష్టి పెడితే భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సమయ నిర్వహణ అనేది విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది, జ్ఞానం, నైపుణ్యాలు, మానసిక శక్తి మరియు సామాజిక నైపుణ్యాలలో సమతౌల్యం సాధించడం ద్వారా వారు సంపూర్ణ వ్యక్తిగా ఎదగవచ్చు. ఈ విధంగా, విద్యార్థి దశలో సమయాన్ని సద్వినియోగం చేయడం, మంచి విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత అభివృద్ధికి ఎంతో అవసరం. నేడు యువత సమయాన్ని సరిగ్గా ఉపయోగించకుండా, దాని వల్ల తమ బంగారు భవిష్యత్తును తమ చేతులారా నాశనం చేసుకొంటున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. యువత ఎక్కువగా సెల్ఫీలు, ఫోటోలు, సోషల్ మీడియా, గేమ్స్ వంటి విషయాలలో గడపడం వలన అధిక సమయం వృధా అవుతుంది చేయాల్సిన పనుల మీద నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
తను లక్ష్యాల మీద స్పష్టత లేకపోవడం, అనిశ్చితి, జీవితంలో ధృడమైన దిశలేమీ లేకపోవడం వల్ల కాలం వృథా అవుతున్నది. కొన్ని సందర్భాలలో సమాజం, కుటుంబం లేదా స్నేహితుల ఒత్తిడి వల్ల, యువత తమ కాలాన్ని సరిగ్గా ప్రయోజనకరమైన పనుల లో మలచడంలో విఫలమవుతుంది. ఈ పరిస్థితిని మార్చ దానికి, యువత దిశానిర్దేశం, సరైన లక్ష్యాలకు ప్రాధాన్యమి వ్వడం, సమయ నిర్వహణను మెరుగుపరచడం, జీవితం యొక్క ముఖ్యాం ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సోషల్ మీడియా వాడకంతో కాలం వృధా. సోషల్ మీడియా నందు ముఖ్యంగా ఫేస్బుక్, ఇస్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వీడియోలు వంటి ప్లాట్ఫాం యువతను ఎక్కువ సమయం ఆకర్షిస్తున్నాయి. ఇవి ఎప్పుడయినా కేవలం అలసట నుంచి లేదా ఆందోళన నుంచి తాత్కాలిక రీలీఫ్ పొందడానికి మాత్రమే ఉపయోగపడాలి, కానీ అసలు పనులపై దృష్టి పెట్టడానికి సోషల్ మీడియా ఉపయోగపడదు. దీన్ని తెల్చుకుని యువత సోషల్ మీడియా వాడకంతో స్వీయ నియంత్రణ పాటించాలి. సమయ నిర్వహణలో లోపం యువత గడిపే సమయం సోషల్ మీడియా నందు ఉండడం, వరం కొత్త లు లాంటివి క సమయాన్ని మొబైల్ తో కంటి చూపు సమస్యలు యువత తమ లక్ష్యాలపై దృష్టి వైఫల్యం చెందుతారు.
పోస్టులు చూడడం, కామెంట్స్, లైక్స్ అన్ని చూస్తూ సమయాన్ని వినోదానికి కేటాయిస్తారు. ఈ సమయాన్ని సమర్థవంతంగా ప్రయోజన కరమైన పనుల్లో పెడితే, వారు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, వ్యక్తిగతంగా పురోభివృద్ధి సాధించవచ్చు. సోషల్ మీడియా వల్ల ఒత్తిడి, దుష్పలితాలు సోషల్ మీడియా ఒత్తిడి యువత మీద ఉంటున్నది. యువత ఎక్కువగా సోషల్ మీడియాని వదిలి ఉండలేకపోవడం, మరొకరితో పోల్చుకోవడం, ఇతరుల్లా పనులు చేయడానికి పోటీపడటం జరుగుతుంది. దీంతో వాళ్ళ మానసిక ఆరోగ్యం ప్రభావితమయ్యి దెబ్బతింటున్నది. అంతేగాక అధిక సమయాన్ని వృథా చేయడం, కాలక్షేపం కోసం వినియోగించడం,
అసలు సమయం సరైనా పనులు ఉపయోగించడానికి కుదరదు. కంటి చూపు సమస్యలు ఏర్పడే అవకాశం సోషల్ మీడియా వినియోగం వల్ల మానసికంగా పనులపై దృష్టి కేంద్రీకృతం కాకుండా చేస్తుంది. సోషల్ మీడియా నందు ‘నిరంతరం కొత్త విషయాలు, వీడియోలు లాంటివి ఉండటం వలన అధిక సమయాన్ని మొబైల్ ఫోన్లు చూడటంతో కంటి చూపు సమస్యలు ఎదురవుతాయి,
యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టడంలో వైఫల్యం చెందుతారు. పరిష్కార మార్గాలు సమయ నియంత్రణ పాటించాలి. యువత రోజువారీ చేయాల్సిన పనుల నిమిత్తం టైమ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవాలి.
సోషల్ మీడియా కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యమైనది. ప్రేరణ, లక్ష్యాల నిర్ణయాలు యువత సరైన లక్ష్యం కల్గి ఉండాలి. ఆ లక్ష్యసాధనకు నిరంతరం ప్రేరణ పొందుతూ ఉండాలి, తమ జీవితంలో వృద్ధాప్యంలో సమయానికి ప్రాధాన్యత వృద్ధాప్యం అనేది వ్యక్తి జీవితంలో కొత్త దశను సూచిస్తుంది. విశ్రాంతి, ఆనందం, ఆత్మపరిశీలన కుటుంబంతో గదిపి సమయానికి ప్రత్యేక స్థానం కలిగిస్తుంది. వృద్ధాప్యంలో సమయం సరైన విధంగా ఉపయోగించడం మరింత అవసరమవుతుంది. ఎందుకంటే ఈ దశలో శారీరక సామర్థం, మానసిక స్థితి మారవచ్చు. కాబట్టి సకల కార్యకలాపాలను, అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సమయం కేటాయించడం అవసరం. వృద్ధాప్యంలో శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యమై ఉంటుంది. రోజూ వ్యాయామం, వ్యాధులను నివారించడానికి పోషకాహారం తీసుకోవడం, ఆరోగ్యంతో గడపడం, మంచి నిద్ర తీసుకోవడం మొదలైన వాటికి సమయం కేటాయించడం ఎంతో అవసరం. ఈ దశలో, వ్యక్తి తమ గత జీవితాన్ని విజయా లను, నష్టాలను ఆలోచించి, ఆనందం మరియు సంతృప్తిని పొందేందుకు సమయాన్ని కేటాయిస్తాడు. ఆత్మపరిశీలనను ప్రోత్సహించడం, అభివృద్ధికి సరైన దిశను తీసుకోవడం, మరియు జీవితం మీద శాంతిని పొందడం వృద్ధాప్యంలో ముఖ్యమైనది.
వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం, వారి మద్దతు పొందడం ఎంతో ముఖ్యం, ఇది వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యానికి, మరియు ఆత్మవిశ్వాసానికి పునరుత్తేజం ఇచ్చే అవకాశం కల్పిస్తుంది. వృద్ధాప్యంలో కొత్త స్నేహాలు, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం, వారితో కూర్చొని మాట్లాడటం, ప్రయాణాలు చేయడం వంటి విషయాలకు సమయం కేటాయించడం కూడా ముఖ్యమైంది. ఇది సామాజిక ఒంటరితనం పోగొట్టడానికి సహాయపడుతుంది. వృద్ధాప్యంలో సమయాన్ని కేటాయించడం అనేది వ్యక్తి యొక్క శాంతిని, సంతోషాన్ని పెంచుతుంది. ఈ దశలో, వ్యక్తి ఎక్కువగా బిజి లైఫ్ను మర్చిపోయి. ఆత్మీయ సంబంధాలు కుటుంబం, చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించడంలో ఆనందాన్ని పొందుతారు. వృద్ధాప్యంలో హాబీలను కొనసాగించడం అంటే రచన, చిత్రకళ, సంగీతం లాంటి వాటిని కొనసాగించడం ద్వారా. ఆరోగ్యాన్ని, మానసిక ఉత్సాహాన్ని పొందుతారు. వృద్ధాప్యంలో మనం సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకొని, జీవితంలోని ప్రతి చిన్న విషయం కోసం ధన్యవాదాలు చెప్పడం, కృతజ్ఞత వ్యక్తం చేయడం, అనుభవాలను మరిచిపోలేదు అన్న భావన వ్యక్తికి శాంతిని మరియు సంతోషాన్ని కలిగిస్తుంది, సమయాన్ని సరిగ్గా వినియోగించడం వృద్ధావస్థలో జీవితానికి పరిపూర్ణతను తెస్తుంది. భవిష్యత్తులో ఉండే యథార్థం మరియు భావోద్వేగ విలువలను అంగీకరించి, ఆనందాన్ని సంతృప్తి పొందడంలో సమయం సరిగ్గా గడపడం అవసరం. ఈ విధంగా, వృద్ధాప్యం.
లో సమయాన్ని సద్వినియోగం చేయడం అనేది నైపుణ్యాల, అనుభవాల, సంబంధాల మరియు సామాజిక అనుబంధాల శక్తిని ఉపయోగించి శాంతిగా, సంతోషంగా జీవించడంలో ఒక కీలకమైన భాగంగా నిలుస్తుంది. సమయం కేటాయించే సాధారణ నియమాలు సమయంలో యాభై శాతం ముఖ్యంగా కెరీర్ మరియు పని సమయం కేటాయించాలి. దీంతో పాటు జీవితానికి ఇతర ఆంశాల మధ్య సమతౌల్యం ఉండాలి. వ్యక్తిగత అభివృద్ధి కోసం గర్భ శాతం కేటాయించాలి, ఆత్మపరిశీలన, హాటీలు, శిక్షణ మొదలైన వాటి మీద ఉపయోగించాలి. ఆరోగ్యం కోసం వది శాతఉపయోగించాలి. వ్యాయామం, నుంచి ఆహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చును. కుటుంబం మరియు సామాజిక జీవితం కోసం ఇరవై శాతం ఉపయోగించాలి. కుటుంబంతో సమయం, స్నేహితులతో సమయం సామాజిక సేవ లాంటివి ఉండాలి. సమయ నిర్వహణ సమర్ధవంతంగా ఉండాలంటే టైమ్ టేబుల్ లేదా షెడ్యూల్ ఉపయోగించడం ద్వారా రోజువారీ పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేసుకోవచ్చును. ప్రముఖ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. అత్యవసరమైన పనులు ముందుగా పూర్తి చేయాలి.
వాయిదా వేయకూడదు. సమయాన్ని ట్రాక్ చేసి యాప్స్ గూగుల్ కాలెండర్, రెమ్మొండర్ యాప్స్ లాంటివి. ఉపయోగించాలి. పని చేయగలిగే స్థాయికి, వేగానికి అనుగు ణంగా పనులను చిన్న భాగాలుగా విభజించడం ద్వారా సులభంగా వేగంగా పూర్తి చేయడానికి వీలవుతుంది. ఈ విధంగా, సమయాన్ని ప్రతీ దశలో సమర్థవంతంగా కేటాయిం. చడం, జీవితం యొక్క అన్ని రంగాలలో సమతౌల్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు వ్యక్తిగత అభివృద్ధి కోసం కొత్త చెప్పణ్యాలను 3 నేర్చుకోవడం, కొత్త భాష టెక్సాలజీ లేదా ప్రత్యేకమైన సామర్ధ్యాలు నూతన సంవత్సరంలో అడుగుపడుతున్న సందర్భంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలానే ఉన్నాయి. వ్యక్తిగత అభివృద్ధి కోసం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, కొత్త భాష, టెక్నాలజీ, లేదా ప్రత్యేకమైన సామర్ధ్యాల నేర్చుకోవడం చేయాలి. జీవితంలో పొందాలనుకునే లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమతూల్య ఆహారం తీసుకోవడం, మానసిక ఆరోగ్యాన్ని కు కూడా కాపాడుకోవడం చేయాలి.
మంచి నిద్ర ధ్యానం లేదా యోగ లాంటివి చేయాలి. సమయాన్ని సమర్థవంతంగా వినియోగించేయాలి. ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం, సమయానికి ప్రాధాన్యత ఇవ్వడం, మరిన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం చేయాలి. ఆర్థిక వ్యయం, ఆదాయాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం, పొదుపు చేయడం చేయాలి, మొత్తం ఖర్చులను పర్యవేక్షిస్తూ ఉండాలి. కుటుంబంతో సమయం గడపడం ద్వారా కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేయడం జరుగుతుంది. స్నేహితులతో, పరిచయాలతో సంబంధాలు మెరుగుపరచుకోవాలి. స్వీయ అభిరుచులకు సమయం ఇవ్వాలి. ఆనందంగా జీవించేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ నిర్ణయాల వల్ల మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడంలో సహాయపడతాయి. చాలామంది జీవితంలో ఎంజాయ్ చేయాలని, దానికోసం అమూల్యమైన సమయాన్ని వృథా చేస్తుంటారు. ఎంజాయ్ అవసరమే కానీ, అది మన కెరీర్కు దోహదం చేసేలా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మీరు ఆశించిన విజయాన్ని సాధించగలరు. ఆల్ ది బెస్ట్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: