📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Heart’s Cry : గుండె ఘోష

Author Icon By Abhinav
Updated: December 10, 2025 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల మాజీముఖ్యమంత్రి, సినీనటుడు ఎన్.టి. రామారావు మనవడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై 23 రోజులు బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఏడాదిన్నర క్రితం జిమ్లో కసరత్తులు చేస్తూ కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ గుండె పోటుతో మరణించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నేత మేకపాటి గౌతంరెడ్డి ఇలాగే మృతి చెందారు. హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ కూడా ట్రెడ్మిల్పై పరిగెడుతూ గుండె పోటుతో కుప్పకూలారు..ఇంకా సిద్ధార్ద్ శుక్లా, తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటుడు వర్కౌట్స్ చేస్తూ హఠాత్తుగా గుండె పోటు వచ్చి ప్రాణాలు వదిలారు. తెలంగాణలో గుండె పోటుతో మూడో తరగతి విద్యార్థి మృతి, స్కూల్లోనే కుప్ప కూలిపోయిన తొమ్మిదేళ్ల బాలుడు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్ ఇప్పుడు సమాజంలో ఒక ఆందోళనకరమైన పరిస్థితిని కలిగిస్తున్న సమస్య. హార్ట్ ఎటాక్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఎందుకు వస్తుందోఅర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్లు, చిన్నచిన్న పిల్లలు సైతం గుండెపోటు బారిన పడి మృతి చెందుతున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. ఇలా పాతిక, ముప్పై ఏళ్ల వయస్సు తో పాటు, చిన్న వయసు ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. 

ముఖ్యంగా యువత, నడి వయస్సు వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నడి వయస్సులోనే స్టంట్లు, యాంజీప్లాస్టీలు చేయించుకుంటున్నారు. ఛాతి నొప్పితో వచ్చి యాంజీప్లాస్టీ చేయించుకునేవారి సంఖ్య లక్షల్లో ఉంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో ఎక్కువ శాతం గుండె వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయి. గుండెకు సంబంధించిన మరణాల్లో దాదాపు 60 శాతం అకస్మాత్తుగా సంభవించేవే ఉన్నాయి. ఈ తరహా మరణాలకు కార్డియో వాస్కులర్ డిసీజ్ (సీవీడీ) ప్రధాన కారణం. 40 ఏళ్లు దాటిన వారిలో 35 నుండి 40 శాతం మందికి కార్డియాక్ అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి వారిలో 50 శాతం మంది ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ తరహా గుండె పోటు వచ్చిన వారికి లెవల్-1 కార్డియాక్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా చికిత్స అందిస్తే దాదాపు 70 నుండి 80 శాతం మేరకు రోగిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడగలిగే అవకాశాలు ఉన్నాయి. ఛాతి నొప్పి వచ్చిన రోగుల్లో 10 శాతం అత్యవసరంగా ఆసుపత్రికి వచ్చే సరికే తక్కువ రక్తపోటు, లేక ఎడమ వైపు గుండె పంపు పనితీరు మందగించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మానవ శరీరంలో గుండె చాలా సంక్లిష్టమైన అవయవం. మనల్ని సజీవంగా ఉంచడానికి, క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనే ఈ అవయవానికి వ్యాధుల ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. 

ప్రస్తుతం ప్రపంచంలో మనుషు ల ఆహారపు అలవాట్లు అనారోగ్యా నికి దారి తీస్తున్నా యి. ముఖ్యంగా గుండెపై ప్రభావం చూపే అలవాట్లతో అనారోగ్యం బారిన పడుతున్నారు. గుండె జబ్బులున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. చాలా మంది గుండె పోటుతో మృతి చెందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా నెలల బిడ్డ నుండి 90 ఏళ్ల వృద్ధుల వయస్సు వరకూ గుండె పోటుకు బలవుతున్నారు. చాలా మంది ఇటీవల కాలంలో డాన్స్ చేస్తూ, డ్రెడ్ మిల్పై వాకింగ్ చేస్తూ, ఏవైనా శారీరక వ్యాయామాన్ని చేస్తూ సడెన్గా కుప్పకూలి పోతున్నారు. ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చెయ్యకండి మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు గుండె పోటుకు ప్రధాన కారణాలు. చాలామంది గుండె పోటు వచ్చినప్పటికీ దాన్ని గుర్తించడంలో జాప్యం చేయడం వల్ల అది వారి ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడుతోంది. గుండె పోటుతో పాటు, గుండెకు సంబంధించిన అనేక సమస్యలు రావడానికి ముందు ఎటువంటి లక్షణాలు వ్యక్తుల్లో కనిపిస్తాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తాతీలో హఠాత్తుగా నొప్పిరావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం, గుండె నొప్పి మెల్లగా మొదలై ముందుకు, వెనక్కి, పక్కలకి పాకుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఛాతిలో నొప్పి అనేది లేకున్నా అసౌకర్యంగా అనిపి స్తుంది. 

ఇది తగ్గిపోతూ, మళ్లీ వస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే గుండె సంబంధిత సమస్యలుగా గుర్తించాలి. తరచుగా ఛాతి నొప్పి, లేదా గుండెల్లో బరువుగా అనిపిస్తే గుండె సంబంధిత సమస్యలకు కారణంగా అనుమానించాల్సి ఉంటుంది. సాధారణ మైన ఛాతి నొప్పికి, గుండె నొప్పికి కొద్దిపాటి వ్యత్యాసం ఉంటుందనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. గుండె నొప్పి అసౌకర్యాన్ని కలిగించడంతో పాటు, ఎక్కువ సేపు గుండెపై భారంగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పిండు తున్నట్లుగా నొప్పి పుడుతుంది. కాబట్టి ఛాతి నొప్పిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదిం చాల్సి ఉంది. అలాగే గుండె జబ్బులకు మరొక లక్షణం వాంతులు. కొన్నిసార్లు ఛాతి నొప్పి తర్వాత వాంతులు మొదల వుతాయి. ఈ వాంతులు గుండె జబ్బులను సూచించే ప్రమాదరకమైన లక్షణం. అటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండటం మంచిదికాదు. ఒక్కసారిగా ఛాతినొప్పి వచ్చి వాంతులు అయితే నిర్లక్ష్యం చెయ్యకుండా ఆసుపత్రికి విధిగా వెళ్లాలి. గుండె జబ్బులకు మరొక ముఖ్యమైన లక్షణం విపరీత మైన కడుపు నొప్పి. సహజంగా మనకు కడుపు నొప్పి అనేక కారణాల వల్ల కలిగినప్పటికీ దీనిని గుండె జబ్బుల హెచ్చరికగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందనేది గ్రహించాలి. 

నొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది గుండెను ప్రమాదంలో పడేసే అవకాశాలు ఉన్నాయి. ఇక భుజాల నొప్పి, ఎడమ చెయ్యి లాగడం, మెడ నొప్పి, వెన్ను నొప్పి కూడా గుండె జబ్బులకు సంకేతాలుగా గుర్తించాలి. అదేవిధంగా గుండె జబ్బులకు మరొక లక్షణం తరచుగా దవడలు నొప్పి కలిగి ఉండటం. విపరీతమైన దవడలు నొప్పి పెడుతున్నా నిర్లక్ష్యం చేయెద్దని వైద్యులు సూచిస్తున్నారు. దవడలు ఎక్కువగా నొప్పి పెడుతుంటే అది గుండె జబ్బులకు సంబంధించిన లక్షణం కావచ్చు. దీనికి వెంటనే పరీక్షలు చేయించుకోవ లసిన అవసరం ఉంది. లేకుంటే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అంతేకాకుండా అకస్మాత్తుగా విపరీతంగా చెమటలు పట్టడాన్ని కూడా గుండె జబ్బుల లక్షణంగా గుర్తించాలి. గుండె సమస్యలు ఎందుకు వస్తాయంటే.. వాస్తవానికి కొలెస్ట్రాల్ శాతం అనేది మనిషి వయస్సును బట్టి ఉంటుంది. వంశపారంపర్యంగా కూడా గుండె పోటు వస్తుంది. దాంతో పాటుగా. డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్, జనరిటికల్ సమస్యలు, స్మోంకింగ్ చేసే వారిలో కొలెస్ట్రాల్ శాతం శరీరంలో అసాధారణంగా ఉంటుంది. అంతేకాకుండా గుండె జబ్బులు రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒక వ్యక్తి గుండె జబ్బులతో బాధపడుతుంటే కొలెస్ట్రాల్ శాతం ప్రకారం ఈ విధంగా ప్రమాదాన్ని పసిగట్టొచ్చు. ఎప్పుడైతే ఎల్డీఎల్, హెచ్ఎఎల్ రేషియో 3.5 కంటే తక్కువ కానీ, లేక 2.5 కంటే తక్కువ ఉంటుందో అప్పుడు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 

ఒక వ్యక్తి గుండె జబ్బులతో బాధపడుతుంటే కొలెస్ట్రాల్ శాతం ప్రకారం ఈ విధంగా ప్రమాదాన్ని పసిగట్టొచ్చు. ఎప్పుడైతే ఎల్డీఎల్, హెచ్ఎఎల్ రేషియో 3.5 కంటే తక్కువ కానీ, లేక 2.5 కంటే తక్కువ ఉంటుందో అప్పుడు మనిషి ఆరోగ్యం బాగున్నట్లు. అంతేకాని ఈ రేషియోకి మించి ఉంటే ప్రమాదం ఉన్నట్లుగా భావించాలి. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ద్వారా పోషకాలు అందుతాయి. ఎన్నో రకాల ప్రక్రియలు జరుగుతాయి. అయితే. మనం తీసుకునే అహారం ద్వారా కొలెస్ట్రాల్ కూడా మన శరీరంలోకి చేరు తుంది. కొలెస్ట్రాల్ పెరిగిందని గుర్తించేం దుకు మోచేతులు, మోకాళ్లు దగ్గర వాపులు రావడం, చర్మంలో చాలా మార్పులు కనపడడం, కళ్లు, ముఖం ఉబ్బిపోవడం వంటివి కనపడతాయి. అయితే అందరిలో కూడా ఈ లక్షణాలు కనపడతాయని ఖచ్చితంగా చెప్పలేం. కొన్ని సందర్భాల్లో కొలెస్ట్రాల్ కనురెప్పల దగ్గర పేరుకుపోయి పసుపు రంగులో ఉండేటువంటి వాపులుగా కనపడతాయి. కొంత మందిలో జనటికల్ పరంగా కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల చిన్న వయసులోనే గుండెకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటి కొవ్వు పదార్థాలు గుండె జబ్బులకు రావడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. కొవ్వు పదార్థాలలో ముఖ్యంగా కొబ్బరినూనె, డాల్డా, నెయ్యి, మార్జరిన్ ఎక్కువగా ఈ వ్యాధులను కలిగిస్తాయి. 

అదే విధంగా ప్రతీ సిగరెట్ గుండెల్లోకి దూసుకెళ్లే ఒక బుల్లెట్ లాంటిది. ఒకటి, రెండు సిగరెట్లు తాగితే ఏం కాదు అను కుంటారు. అది పొరపాటు. రక్త సరఫరాలో అప్పటికే బ్లాకేజ్ ఉంటే స్మోకింగ్ చేసిన వెంటనే ఉన్న కొలెస్ట్రాల్ డిపాజిట్ బరస్ట్ అవుతుంది. ధూమపానం చేసేవారికి సమీపంలో ఉండేవారు కూడా ఆ పొగ కారణంగా త్వరగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. పొగాకు నమలడం, గుట్కా సేవనం పల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇంట్లో ఒకరు స్మోకింగ్ చేస్తే అది కుటుంబం సభ్యులందరికీ గుండె అబ్బును తెచ్చి పెడుతుంది. పొగతాగే వారిలో బ్లడ్ క్లాట్ అవుతుంది. దీంతో స్ట్రోక్ వస్తుంది. అలాగే డ్రగ్స్ వినియోగించే వారిలో కూడా స్ట్రోక్ వస్తున్నాయి. పలు రకాల డ్రగ్స్ వల్ల రక్త నాళాలు కుంచించుపోయి, గుండె పోటుకు దారి తీస్తోంది. ఇతరులతో పోలిస్తే స్మోకింగ్ చేసే వారిలో 10 రెట్లు ఎక్కువ గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. చిన్న పిల్లలకూ హార్ట్ ఎటాక్ నడివయస్సు వారు, ఊబకాయం ఉన్నవారు, వృద్ధులు మాత్రమే హార్ట్ ఎటాక్ బారిన పడడం లేదు. ఎప్పుడూ ఆట పాటలతో సంతోషంగా ఉంటున్న పిల్లలు సైతం హార్ట్ ఎటాక్ బారిన పడి మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకుంది. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన మూడవ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు (కౌసిక్) పాఠశాలలో భోజన సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. 

దీపావళి పండుగ రోజు రాత్రి కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా టపాసులు కాల్చిన ఈ బాలుడు ఉదయం లేచి యధావిధిగా స్కూల్కు వెళ్లాడు. స్కూల్లో మధ్యాహ్నం వరకూ తరగతులు విన్న పిల్లవాడు, మధ్యాహ్నం భోజనం కోసం క్యూ లైన్లో స్నేహితులతో కలిసి నిలబడ్డాడు. అంత వరకు సరదా ఉన్న ఆ విద్యార్థి ఒక్కసారిగా క్యూ లైన్లో కుప్ప కూలిపోయాడు. వెంటనే గ్రామంలోని వైద్యుని వద్దకు తీసుకెళ్లగా గుండె పోటు వచ్చినట్లు తేల్చారు. ఆ వెంటనే ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఈ విధంగా ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా గుండె పోటుకు గురవుతున్నారు. ఈ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీనికి కారణం అనేకం ఉన్నాయి. వేయించిన ఆహారాలు, ఫాస్ట్ఫుడ్స్ వంటి ఆహారాల వల్ల చాలా ముంది ఊబకాయం బారిన పడుతున్నారు. దీంతో శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోయి చిన్న వయసులోనే గుండె సమస్యలకు గురవుతున్నారు. అంతేకాకుండా దగ్గర సంబంధాలు చేసుకోవడం వల్ల కూడా పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే ఆకాశం ఉంది. ఇటీవల వైద్య నిపుణుల బృందం ఒక సర్వే నిర్వహించింది. గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, ఛతీస్ గఢ్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 13 నుండి 18 ఏళ్ల లోపు 937 మంది పిల్లలపై ఈ సర్వే నిర్వహించారు. 

బాల్యం నుండి కౌమారదశకు వెళ్లే ఈ చిన్నారుల ఆహారంలో సోడియం, కొవ్వు, షుగర్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పీచు పదార్థాలతో కూడిన ఆహారం స్వల్పంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో 26 శాతం మంది పిల్లలు అధిక కొవ్వు, అధిక కేలరీల ఆహారాన్ని తిన్నారు. నూనెలో వేయించిన ఆహారాన్ని తినే పిల్లలు 30 శాతం మంది ఉన్నారు. ఇలా అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల ఇప్పుడు చిన్న పిల్లలు కూడా షుగర్, హార్ట్ పేషెంట్లుగా మారుతున్నారు. ఛాతి నొప్పి గురించి ఫిర్యాదు చేసే చాలా మంది పిల్లలకు మస్క్యులో స్కెలాటల్ ఛాతి నొప్పి ఉంటుంది. ఇది ఛాతిలోని కండరాలు లేదా ఎముకలు మరియు వాటి కనెక్షన్ల నుండి వచ్చే నొప్పి. అరుదైన సందర్భాల్లో గుండె సమస్య పిల్లల్లో ఛాతి నొప్పికి కారణమవుతోంది. ఇక కొందరికి పుట్టుకతోనే గుండె జబ్బులు ఉంటున్నాయి. గుండెకు చిన్న రంధ్రం ఉండటం నుండి తీవ్రమైన డిసీజ్ కిందకు వస్తాయి. ఈ వ్యాధులను చాలా వరకూ శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు. గర్భధారణ సమయంలో వైద్యులు తరచుగా ఈ సమస్యలను నిర్ధారిస్తారు. కానీ కొందరిలో యుక్తవయసు వచ్చేంత వరకూ ఎలాంటి లక్షణాలు బయట పడకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో అసలు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల్లో అనేక రకాలు ఉన్నాయి. గుండె కవాటాల్లో, రక్తనాళాలు, గుండె కండరాలు వంటి సమస్యలు సమర్థవంతంగా గుండె రక్తాన్ని పంప్ చేయలేదు. మీ గుండె గురించి మీ కెంత తెలుసు? గుండె నిముషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 7000 లీటర్లు పంప్ చేస్తుంది. 

సాధారణంగా మీ ఇంటి నీళ్ల ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది. ఇందులో 70 శాతం మెదడుకు వెళుతుంది. 30 శాతం మిగిలిన శరీర అవయవాలకు వెళుతుంది. గుండె ఒకసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకన్ల సమయంలో 0.3 సెకన్ల సమయం సంకోచించడానికి, 0.5 సెకన్ల సమయం వ్యాకోచించడానికి (అంటే రిలాక్స్ కావడానికి), ఇక ఈ 0.5 సెకన్ల రిలాక్స్ టైమ్లో రక్తం ఊపిరి తిత్తులకు వెళ్లి శుభ్రపడుతుంది ఈ రిలాక్స్ టైమ్ తగ్గితే రక్తం సరిగా శుభ్రపడదు. టెన్షన్లో కాని, కోపంతో కాని ఉంటే మెదడుకు ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అప్పుడు గుండె తక్కువ రిలాక్స్ అవుతుంది. 0.5 బదులు 0.4 సెకన్ల టైమ్ రిలాక్స్ అవుతుంది. గుండె ఒక 25 0.85 ລ້ 0.3+0.4 = 0.7 సమయం మాత్రమే తీసుకుంటుంది. నిముషానికి 84 సార్లు కొట్టుకుంటుంది. గుండెకు విశ్రాంతి (రిలాక్సేషన్) 20 శాతం తగ్గుతుంది. రక్తం 80 శాతం మాత్రమే శుభ్రపడుతుంది. మిగిలిన అపరిశుభ్ర మైన రక్తం మీ మెదడుని, మీ శరీర అవయవాలను సరిగా కుభ్రపరచ లేకపోతుంది. కనుక కోపుడవద్దు. టెన్షన్ పడవద్దు. ఇతరుల మీద కోపం, ద్వేషం బరులు మీరు ప్రేమ చూపిస్తే మీ గుండె 72 పార్ల కొట్టుకుని మీ మెదడు ప్రశాంతంగా. చురుకుగా ఉంటుంది. గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ బీసీ (బాసిల్లస్ సెరియస్) తక్కువగా ఉంటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుందనేది గుర్తుంచుకోండి. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ గుండె అంత పదిలంగా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Cardiac Arrest Cardiology chest pain Cholesterol Healthy Heart heart attack heart attack causes Heart Disease Symptoms Heart Failure heart health high blood pressure hypertension Pediatric Heart Issues Smoking Effects Sudden Heart Attack Youth Heart Health

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.