📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు

Author Icon By Abhinav
Updated: November 28, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సెల్ఫీ (స్వయంగా తీసుకునే ఫొటోలు), ట్రోల్ (వ్యక్తులను కలవరపెట్టే ఆన్లైన్ సంఘర్షణలు), బ్లాగ్స్పియర్ (వ్యక్తిగత వెబ్ సైట్ల సామూహిక పదం). వెబ్సైట్ల సామూహిక పదం), బజ్వర్డ్ (నిర్దిష్ట సమయ సందర్భాల్లో వాడే పదబంధాలు) లాంటి పలు సంక్షిప్త పదాలు నిత్యం వాడుకలోకి వచ్చాయి. ‘ప్లాట్ఫాం’ అనగానే రైల్వే స్టేషన్ గుర్తువస్తుంది. నేడు అంతర్జాల వలలో ‘ప్లాట్ఫామ్’లు వెలసి డిజిటల్ వేదికల వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా స్నేహితుల్ని ఫ్రెండ్ అంటాం. నేడు అంతర్జాల మాధ్యమాల్లో ‘ఫ్రెండ్’ అనే పదానికి అర్థమే మారిపోయింది.

‘ఫేస్బుక్లో స్నేహితున్ని జోడించడాన్ని ‘ఫ్రెండ్’ అని, ఉన్న వారిని తొలగించడాన్ని ‘ఆన్రెండ్’ అని పిలుస్తున్నాం. నిజానికి ‘ఆన్రెండ్’ అనే పదమే ఆంగ్లభాషలో కనిపించదు. యూకెలో ఫేస్బుక్లో ఒక వ్యక్తి సగటున దాదాపు 300 మంది ఫ్రెండు (స్నేహితులు) కలిగి ఉన్నారు. వీరిలో 10శాతం కూడా ప్రత్యక్ష మిత్రులు ఉండడం లేదు. ఫేస్ బుక్ వేదికగా ఒక వార్తను లేదా వీడియోను లేదా ఫొటోను క్షణాల్లో స్నేహితులందరితో పంచుకోవచ్చు. ‘లైక్’లు (మన పోస్టులకు ఎదుటివారు స్పందించడం), ‘వైరల్’ (క్షణాల్లో బహుళ ప్రచారం పొందడం),

షేర్ (సామాజిక మాధ్యమాల వేదికలో సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం) అనే పదాలు సామాన్యుని బుర్రలో తిష్టవేస్తున్నాయి. ఒక విషయాన్ని శోధించడానికి ‘సెర్చ్ ఇట్’కు బదులుగా ‘గూగుల్’ ఇట్ ‘దీని కోసం శోధించు’ అంటున్నాం. ‘ట్విట్టర్’ ని ఉపయోగించి సందేశాన్ని రాయడాన్ని ‘ట్వీట్ ఇట్’ అంటున్నాం. ఈ పదాలను గమనిస్తే సామాజిక మాధ్యమాలు మనం మాట్లాడే, రాసే ఇంగ్లీషును మార్చివేస్తున్నట్లు తెలుస్తున్నది.

Read Also : భగవంతుని ప్రతిరూపం అమ్మ

భాషలు మిళితమవుతూ ‘స్పాంగ్లిష్’ (స్పానిష్, ఇంగ్లీష్ విభిన్న వినియోగదారులను కలుపుతున్నాయి. మనం వాడే రోజువారీ భాషలో విదేశీ పదాలు చేరుతున్నాయి. వివిధ సామాజిక మాధ్యమాల వేదికలో పుట్టిన ఆంగ్లపదాలు సామాజిక మాధ్యమాల ప్లాట్ఫామ్లు విభిన్న ప్రపంచ భాషల, ) కలయిక), ‘హింగ్లిష్’ (హిందీ, ఇంగ్లీష్ కలయిక)లాంటి హైబ్రిడ్ భాషాపదాలు పుట్టకొచ్చాయి. ‘టెక్టర్స్ లేడా టిఎక్స్ టి (రాతసమాచారం), ‘పోస్ట్’ (సామాజిక మాధ్యమంలో పెట్టడం), ‘ఏమోజీలు’ (చిరునవ్వు, ముఖం చిట్టించడం లాంటి ముఖకవళికల ఫొటోలు, భావవ్యక్తీకరణ ఫొటోలు), ‘హాష్ ట్యాగ్’ (ట్వీట్ల వర్గీకరణకు వినియోగించే పదాలు), ‘నెటిజెన్స్’ (అంతర్జాలం వాడే పౌరులు), టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ లాంటి కొత్త పదాలు లేదా పదబంధాలు నేడు ఆంగ్లభాషలోకి చేరుతున్నాయి.

భాషాపదాల ఆవిష్కరణలకు శక్తివంతమైన సాధనాలుగా సోషల్మీడియా వేదికలు నేడు దహదపడుతున్నాయి. ఆక్స్ ఫర్ట్ నిఘంటువులోకి చేరిన సోషల్మీడియా ఆంగ్లపదాలు ఆక్స్ ఫర్ట్ డిక్షనరీలోకి సహితం కొన్ని సోషల్ మీడియాలో అత్యంత నేటిజెన్ల ఆదరణ పొందన పదాలు చేరిపోయాయి. వైఓఎల్డీ, (యూఓల్లీ లీవ్ వన్స్ -మీరు ఒక్కసారి మాత్రమే జీవిస్తారు), ఎల్డీఎల్ (లాఫింగ్ అవుట్ లౌడీ-బిగ్గరగా నవ్వడం), డిఎం (డైరెక్ట్ మెసేజ్-నేరుగా సమాచారం పంపడం),

ఎఫ్ఎఎంఓ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్-తప్పిపోతుందనే భయం) టిబిటీ (త్రోబ్యాక్ థర్స్), ఓఏంజి (ఓమైగాడ్-ఓరీ దేవుడా), జి8టి గ్రేట్, ఎల్ఆర్ (లాటర్ లేదా సీ యూ లాటర్-తర్వాత), టిటివైఎల్ (టాక్ టు యు లాటర్-మీతో తర్వాత మాట్లాడుతా), బిఆర్బి (బిరైట్ బ్యాక్- వెనక్కి ఉండండి), బిటిహెచ్ (టుబి ట్రూత్పుట్) నిజాయితీగా ఉండడం)లాంటి సంక్షిప్త ఆంగ్లపదాలు సామాన్యుల సన్నిధికి చేరాయి. నేడు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ‘ఎయిర్పంచ్’ (విజయానికి చిహ్నంగా పిడికిలా బిగించి గాల్లోకి పంచ్ చేయడం), ‘బాలర్’ (ఆకర్షణీయమైన), ‘క్రే’ (క్రేజీగా), ‘తోషేడ్’ (పబ్లిక్ విమర్శించడం), ‘ఆమోజ్బాల్ (అద్భుతమైన), ‘స్పిటిటెక్ (ఆకస్మికంగా ధనాన్ని ఉమ్మి వేయడం), ‘బింజ్వాన్ (ఒకేసారి అనేక అంకాల సీరియల్ చూడడం), ‘టెక్-సావీ’ (ఆధునిక టెక్నాలజీని ఒంటపట్టించుకోవడం), స్పీడ్క్స్ (పెరుగుతున్న కమ్యూనికేషన్ రేటు) లాంటి ఆంగ్లపదాలు చేరిపోయాయి.

సోషల్ మీడియా ప్రభావంతో కొత్త ఆంగ్లభాషా పదాల జననం వరమా, శాపమా?

సామాజిక మాధ్యమాల కోసం రాస్తున్న లింగో, సంక్షిప్తాలు, సాధారణ సూచనలు, సాంస్కృతిక ప్రభావాలుకూడా నిరంతరం అభివృద్ధి చెందడంతో కంటెంట్ను అందరు అర్ధం చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుండంతో తప్పుగా కూడా అర్థం లేదా అపార్థం చేసుకోవడం జరగవచ్చని తెలుస్తున్నది. వ్యాకరణ నియమాలకు తిలోదకాలివ్వడం, స్పష్టత కొరవడడం, అధికారిక స్వరం లేకపోవడం, పరిమిత పదజాలం వాడడంతో సోషల్ మీడియా భాషకు హాని కలుగుతున్నట్లు ఆంగ్లభాషా నిపుణులు వాపోతున్నారు. సోషల్మీడియా ప్రభావంతో ఆంగ్లభాషలో చేరుతున్న కొత్త పదాలు లేదా పదబందాలు భాషోన్నతికి వరంగా, కొన్ని సందర్భాల్లో శాపంగా కూడా మారుతున్నట్లు భాషా నిపుణులు వారి వారి వాదనలు వినిపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu Google News in Telugu latest news Latest News in Telugu SocialMedia Telugu News Telugu News online Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.