हिन्दी | Epaper
అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’

Old people without care : ఆదరణ కరవైన పండుటాకులు

Abhinav
Old people without care : ఆదరణ కరవైన పండుటాకులు

మానవత్వపు విలువలు తరిగిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు బిచ్చగాళ్లు, అనాథల కోసం ఆశ్రమాలు నిర్మించేవారు. నేడు అందరూ ఉండి కూడా చూసుకోవడానికి సమయం లేదు అనే నెపంతో కన్నవారిని వృద్ధాశ్రమాల్లో పడవేస్తున్నారు. పూర్వం రాజులు, చక్రవర్తులు వృద్ధాప్యంలో రాజ్య భారాన్ని కుమారులకు అప్పగించి భార్యతో సహా అడవికి వెళ్లి, కుటీరాన్ని నిర్మించుకుని ఐహిక బంధాలకు దూరంగా గడిపే వారు. దాన్నే వానప్రస్థాశ్రమం స్వీకరించడం అనేవారు. వృద్ధాశ్రమం నిర్మించడానికి శ్రీకారం చుట్టిన మహిళ ‘సిస్టర్ మేరీ ఆఫ్ క్రాస్’గా పేరు పొందిన సెయింట్ జీన్ జుగన్. ఈవిడ ఫ్రాన్స్ లోని కాంకేల్ అనేచోట 15 అక్టోబర్ 1792 ప్రాంతంలో ఒక నౌకలో పనిచేసే మత్స్యకారుల కుటుంబంలో జన్మించారు. మేరీ, జోసఫ్ ఈమె తల్లిదం డ్రులు, జీన్ జుగన్కు నాలుగు సంవత్స రాల ప్రాయంలోనే తండ్రి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి మరణించారు. తల్లి నాలుగు ఇళ్లల్లో పనిచేసి పిల్లలను పోషిం చేది. జీనుగన్ కూడా గొర్రెల కాపరిగా పనిచేసేది. ఆమె ఉన్ని వస్త్రాలు అల్లడం నేర్చుకుంది. బడికి వెళ్లే ఆర్థికస్థోమత ‘ లేకపోవడంతో నర్సుగా చేరి పదేళ్లపాటు ‘లేరో సైస్’లోని ఆసుపత్రిలో సేవలు అందించారు. 

ఆ తరువాత 1839లో సెయింట్ సెర్ఫాన్లో ‘అన్నే చౌవిన్’ అనే వృద్ధురాలికి తన ఇంట్లో ఆశ్రయం కల్పిం చారు. అన్నే చౌవిన్కు పాక్షికంగా పక్షవా తం సోకింది. ఆమె సేవతో జీన్ జుగన్ వృద్ధుల సేవకు శ్రీకారం చుట్టారు. అనంతరం 1841లో ఒక గదిని అద్దెకు తీసుకుని 12 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించారు.. 2 1842  భవనాన్ని కొని, అందులో 40 మంది వృద్దులకు ఆశ్రయం.. కల్పించారు. వర్జీని ట్రెడానియల్, ఫ్యాందన్ అనే ఇద్దరు స్నేహితులులు కలిసి ఆశ్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమం లిటిల్ సిస్టర్ ఆఫ్ ది. పూర్తి ప్రసిద్ధి చెందింది. 1950 నాటికి ఆసియా, ఆఫ్రియా, జీవి అమెరికా మొదలైన అనేకచోట్ల ఈ నమః పండా సంస్థను స్థాపించి వృద్ధులకు సేవలు కోవా అందించడం ప్రారంభిం చారు. 29 ఆగస్టు 1879న జీన్ జగన్ మరణించారు. ఆమె సంస్థను ఇతర వ్యక్తులు సొంతం చేసుకుని వృద్ధాశ్రమాలు నిర్వహిస్తూ సేవలు అందిస్తు న్నారు. వృద్ధు లకు ఆశ్రయం కల్పించాలనే సదుద్దేశంతో జీన్ జగన్ వృద్ధాశ్రమా కనికి లను స్థాపించారు. నేడు వృద్ధాశ్ర మం అంటే కొత్త భాష్యాలు చెబుతు మా న్నారు. తాము కొవ్విత్తిలా కరిగిపో ఒక యి బిడ్డల జీవితాల్లో వెలుగును .. ప్రసాదించిన తల్లిదండ్రు లను గుండెలపై కుంపటిలా భావించే నైతిక విలువలు లేని కసాయి.

బిడ్డలు వారిని వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. పెరుగుతున్న వృద్ధాశ్రమాలు నేటి నవనాగరిక యుగంలో నగరా ల్లోనే కాదు, చిన్న పట్టణాల్లో సైతం వృద్ధాశ్రమాల సంఖ్య నానాటికీ పెరుగు తోంది. కుటుంబ వ్యవస్థలో పేదరికం వంటి అనివార్యమవుతున్న మార్పుల కార ణంగా కొందరు వయోధికులు వృద్ధాశ్రమా లను ఆశ్రయించక తప్పడం లేదు. నిజానికి ఈ వృద్ధాశ్రమాలు ముసలివారికి వరమా? లేక శాపమా? అన్న ప్రశ్నకు రెండూ సరైన జవాబులే అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. సాధారణంగా ఏ ప్రశ్నకైనా జవాబు అవు ననో లేక కాదనో ఉంటుంది. కానీ వృద్ధాశ్రమాల విషయంలో ఈ రకమైన విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. కొందరు డబ్బును వృద్ధులు తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేక అష్టపూర్వకం గా సకల సౌకర్యాలు గల వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. వారి అభిప్రాయానుసారం వృద్ధాశ్రమం భేష సరైన సంపాదన లేక చివరి దశలో అవసత్వాలుడిగిన పండుటాకు లు ఖరీదైన వృద్ధాశ్రమాల్లో చేరలేరు. అటువంటివారు తమ కుటుంబ సభ్యులతోనే “జీవించాలని కోరుకుంటారు. వృద్ధాశ్రమంలో జీవించడానికి ఇటువంటివారు నూరు శాతం అంగీకరించరు. అయితే ఇక్కడ వస్తున్న సమస్య ఏమిటంటే కొందరు కన్నబిడ్డలే. 

వండుటాకుల్లాంటి తల్లిదండ్రులను వదిలించు. = కోవాలని చూస్తున్నారు. కని, పెంచి, పోషించిన తల్లిదండ్రుల అవసాన దశలో వారిని వదిలించుకోవాలనే కసాయి సంతానం ర కంటే విశ్వాసం గల కుక్క నయం అన్నా తప్పు కాదేమో! సమస్యలు పలు విధాలుగా వస్తాయి. అత్త, కోడళ్లకు సరిపడక కుటుంబ కలహాలు ప్రారంభమైన నేపథ్యమే హెచ్చుగా కనిపిస్తుంది. అత్త, మామలను నేను చూడలేను అని కోడలే తెగేసి చెబితే కొడుకు మాత్రం ఏం చేయగలడు? చేతులెత్తేయడం తప్ప. ప్రతి అత్త తన కోడల్ని కూతురులా చూసుకోవడం, ప్రతి కోడలు తన అత్తలో అమ్మను చూసుకున్నట్లయితే కొంతలో కొంత సమస్య తగ్గవచ్చు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలైన నేపథ్యంలో మానవత్వం మంట కలిసిపోయింది. ఏదో ఒక కారణం చూపి పండుటాకుల్లాంటి పెద్దలను వదిలించుకుంటున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయి. వృద్ధాశ్రమాలకు వెళ్లడానికి పలు కారణాలు పిల్లలందరూ విదేశాల్లో ఉంటే అటువంటివారు వృద్ధాశ్రమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇంట్లో అన్ని చేసుకోలేమని భావించి సకల సౌకర్యాలున్న వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

ఇంట్లో వృద్ధులు ఉంటే వారి చాదస్తం భరించాల్సి వస్తుందని భావించి కొందరు వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. భార్యాభర్తల్లో ఒకరు మరణిస్తే మరొకరు ఒంటరిగా ఉండలేక, కొడుకులు, కూతుళ్లతో సర్దుకోలేక మరో కారణం. పేద కుటుంబాల్లో వృద్ధులను భారంగా భావిస్తున్న కుటుంబ సభ్యులు కొందరు ఉచిత వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. మంచంలో ఉన్న వృద్ధులకు సేవలు చేయడం కష్టంగా భావించి వైద్య సదుపాయాలున్న ఆశ్రమాల్లో చేర్చిస్తున్నారు. అనారోగ్యంతో శుచి, శుభ్రత తగ్గిన వృద్ధులకు ఇంట్లో ఉంచుకుంటే వా పల్ల తమ పిల్లలు అనారోగ్యం జారిన పడతారని ఇంకొందరు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగుర్తులైతే ఇంట్లో ఒంటరిగా వారిని ఉంచడం ఇష్టంలేక వృద్ధాశ్రమాలకు సంపిస్తున్నారు. నిజానికి వృద్ధాశ్రమాల వ్యవస్థ మన సంప్రదాయం కానేరాదు. ఏ ధర్మగ్రంథాల్లో ను, ఇతిహాసాల్లోను దీని ఊసే లేదు. విదేశీ సంస్కృతులను గుడ్డిగా అనుకరించడం వల్లనే ఈ వ్యవస్థ నేడు మన దేశంలో విస్తరి స్తోంది. వృద్ధాశ్రమాల్లోను రెండు రకాలు న్నాయి. సేవా భావంతో స్వచ్చంద సహాయ సంస్థలు (ఎస్బీవోలు) నడిపేవి కొన్ని, కేవలం లాభాపేక్షతో నడిచేవి మరికొన్ని, కొన్నిచోట్ల ప్రభుత్వ రంగంలో విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేక వృద్ధాశ్రమాలు నడుస్తున్నా యి. 

మొదటి రకం వృద్ధాశ్రమాలు ఉచితం గానే సేవలను అందిస్తున్నాయి. ఇవి సామా న్య ప్రజలకు అందుబాటులో ఉండవు. ప్రస్తు తం మన దేశంలో వృద్ధాశ్రమాలు ఉచితంగా నే సేవలను అందిస్తున్నాయి. ఇవి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవు. ప్రస్తుతం మన దేశంలో వృద్ధాశ్రమాల సంఖ్య వేలల్లోనే ఉన్నట్లు హెల్పేజ్ ఇండియా’ సంస్థ చెబుతోంది. కేరళలో అత్యధికంగా రెండు వందలకు మించి వృద్ధాశ్రమాలు ఉండగా, పంజాబ్లో తక్కువ సంఖ్యలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. వృద్ధాశ్రమాల సంఖ్య నానాటికీ పెరగడాన్ని చూసి మనం ఆనందిం చాలా? బాధపడాలా? అన్నది సమాధానం దొరకని సందేహమే. ఎవరూ లేని అనాథ వృద్ధులకు జీవిత చరమాంకంలో ఆసరా కల్పించడం అవసరమే. అయితే అయినవా ళ్లంతా ఉండి కూడా నిరాదరణకు గురయ్యే వృద్ధులకు ఇవి ఎలాంటి సుఖసంతోషాలను కలిగించలేవనే చెప్పాలి. పలురకాల వృద్ధాశ్రమాలు వృద్ధాశ్రమాలలో అనేక అనేక రకాలు ఉన్నాయి. కొన్ని ఆశ్రమాలు అయిదారు ఎకరాల విశాల మైన స్థలంలో రిసార్ట్స్ కనిపిస్తాయి. ఎక్క డ చూసినా పచ్చని చెట్లు, రకరకాల పూల మొక్కలతో ఆహ్లాదక రంగా ఉంటాయి. దంపతులకు కలిపి ఒక రూమ్ ఇస్తారు.

అది ఏసీ చెయ్యబడి ఉంటుండి. వీటిలో నివసించేవారు సాధారణంగా ధనవంతులు, ఉన్నతాధికారులుగా పనిచేసేనవారు, బాగా డబ్బు సంపాదిం చినవారు, పిల్లలు విదేశా ల్లో ఉండే, ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇలాంటి ఆశ్రమాల్లో కాలక్షేపం చేస్తుంటారు. వీరికి పిల్లలతో ఎలాంటి పేచీలు ఉండవు. వీరు ఆశ్రమాలకు భారీమొత్తం విరాళంగా ఇస్తారు. వీరిని కనిపెట్టుకుని ఉండటానికి అటెండర్లు, నర్సులు, వైద్యులు ఉంటారు. ఎప్పటికప్పుడు వీరికి సకల సౌకర్యాలు అందిస్తుంటారు. వీటిని ‘హైటెక్’ ఆశ్రమాలు అనవచ్చు. వృద్ధాశ్రమం అనడం కంటే భూత ల స్వర్గం అన్నా తప్పు కాదు. పిండికొద్ది రొట్టె అన్నట్లు అధిక మొత్తంలో ధనం చెల్లించడం వల్ల వీరి బతుకు వడ్డించిన విస్తరిలా ఉంటుంది. ఇక్కడ దనం చెల్లించి చేరిన వృద్ధుల జీవితం రాజభోగంతో, సకల సదుపాయాల తో తులతూగుతుంది. ఇటు వంటి ఆశ్రమాలు అమెరికా వంటి దేశాలతో పాటు ప్రపంచంలోని ప్రధాన నగరాలలో కనిపిస్తాయి. ధనవంతులైన కొందరు తల్లిదం డ్రుల అభిప్రాయాలు మరో రకంగా ఉంటా యి. మా యవ్వన ప్రాయంలో మేం హాయి గా సర్వసుఖాలను అనుభవించాం. పిల్లలు కూడా అలాగే ఉల్లాసంగా గడపటానికి తాము అడ్డు కాకూడదని భావించి హైటెక్ వృద్ధాశ్రమాల్లో చేరి శేష జీవితాన్ని గడుపు తుంటారు.

ఇటువంటి వృద్ధాశ్రమాలో కామ న్ రూమ్లు, బెడ్లతో పాటు టీవీ, పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి. అవసరమైన ప్పుడు వైద్య సదుపాయాలు కల్పిస్తారు కానీ కొన్ని ఆశ్రమాల్లో వైఫై సౌకర్యం, వెబ్ కెమెరాలు, చెస్, క్యారమ్స్ సరదాగా అడు కునే సౌకర్యం, వ్యాయామం, యోగా సెంట ర్, ఫోన్, లైబ్రరీ, 24 గంటలు వైద్యసేవ లు, వ్యక్తిగత రూమ్, వ్యక్తిగత సేవకులు.. వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాయి. అన్ని సౌకర్యాలతో కూడిన వృద్ధాశ్రమాల్లో ఒక్కొక్క రికి రూ.30 వేలకు పైగానే వసూలు చేస్తున్నారు. మరికొన్ని వృద్ధాశ్రమాలు అపార్ట్మెంట్లో ఉంటాయి. ఇక్కడ గదులతో పాటు పడుకోవ డానికి హాల్స్ ఉంటాయి. సాధారణంగా ఇవి మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటా యి. దీనిలో చేరేవారు మాత్రం ఎక్కువగా కుటుంబంతో, పిల్లలతో తగాదాలు ఉంటా యి. పిల్లలు అంటే ఇక్కడ కొడుకు-కోడలు అని మాత్రమే అర్థం చేసుకోవాలి. వీరు సంపాదిస్తున్నంత కాలం ఆధిపత్య ధోరణితో ఉంటారు. పదవీ విరమణ అయ్యాక వీరికి మునుపు లభించి నంత గౌరవం లభించదు. తమను ఎంత గౌరవిస్తున్నప్పటికీ ఎవరూ తమని లెక్క చేయడం లేదనే ఆత్మన్యూనతా భావంతో వీరు ఉంటారు. కోడలు చేసే ప్రతి పనిలో తప్పు పడుతుంటారు. కొడుకులను కావాలనే తిడుతుంటారు. 

వారు తిరిగి ఏమైనా అంటే, మాకు గౌరవం దొరకడం లేదని ఇరుగు-పొరుగుతో చెప్పుకుని బాధపడుతుంటారు. చివరకు టి.వి. రిమోట్ సైతం తమ చేతిలో పెట్టుకుని తాము చూసే. ఛానల్లోనే అందరూ చూడాలని పట్టుపడ తారు. ఒకరి కొకరు ఇగోలకు పోయి పచ్చని జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటుంటారు, ఏడు పదుల వయస్సు వచ్చినా ఇంట్లోవారి మీద గొంతులు చించుకుని అరుస్తుంటారు. పిల్లలు ఆదరంగా చూస్తున్నా, వేళకు తిండి పెడుతున్నా, వైద్య సౌకర్యాలు చూస్తున్నా, ఏదో అసంతృప్తితో రగిలిపోతుంటారు. “నలభై ఏళ్లపాటు ఇంట్లో పెత్తనం చేసాం. పిల్లకు వృద్ధిలోకి తెల్యం. ఇక వారి జీవితాన్ని వారికి వదిలేసి శేష జీవితాన్ని పుస్తక పఠనంతోనో, మరేదో వ్యాప్తకంతోనో ఆనందంగా గడుపుదామన్న స్పృహే కొందరికి లోపిస్తుంది. అందరిపై అజమాయిషీ చేయాలనే ధోరణిగల కలాంటివారు ఎక్కువగా వృద్ధాశ్రమాల్లో తేరిపోయి పిల్లల పరువును తీస్తుంటారు. మరికొందరు వృద్ధాశ్రమాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. విదేశాల్లో వృద్ధాశ్రమాలు చాలా దేశాల్లో వృద్ధాశ్రమాలు ఉన్నప్పటికీ అక్కడ చేరిన వృద్ధులు శారీరక శక్తిని కలిగి వున్నట్లయితే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. 

ఆదాయం వచ్చే పనులు చేసుకోవచ్చు. విదేశాల్లో వృద్ధుల వాధ్యతను ప్రభుత్వాలే తీసుకుంటాయి. ఆస్ట్రేలియాలో వృద్ధులకు అందించే సౌకర్యాలను బట్టి అక్కడి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, దీనివల్ల వృద్ధులపై ఆర్థిక భారం తగ్గుతుంది. వృద్ధా వ్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలపై పూర్తి అవగాహన ఉండే జిరియాట్రిషియన్స్ పర్య వేక్షణలో వృద్ధాశ్రమాలు పనిచేస్తాయి. ప్రతీ హోమ్కు తప్పనిసరిగా అంబులెన్స్ ఉంటుం ది. వారికి సేవ చేసే సిబ్బంది తప్పనిసరిగా నర్సింగ్లో శిక్షణ పొంది ఉండాలి. లేకపోతే అనర్హులు, అమెరికాలో వృద్ధుల రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. వయస్సులో ఉన్నప్పుడే వారి ఆదాయంలో ప్రభుత్వం కొంత తీసుకుని వయసు మీరిన అనంతరం వారిని వృద్ధాశ్రమాల్లో ఉంచి అన్ని రకాల సేవలు అందిస్తుంది. అమెరికాలో నిర్వహించే భారతీయుల ఆశ్రమాల్లో యోగా, సాయంత్రం వేళల్లో భజనలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్విట్జర్లాండ్లో వృద్ధులకు 50 శాతం ఆరోగ్య బీమా చెల్లిస్తే సరిపోతుంది. దీనికింద అన్ని రకాల వైద్యసేవలు, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. కెనడాలో వృద్ధాశ్రమాలకు పన్నులు, ఉచిత విద్యుత్ వంటి రాయితీలు ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ వృద్ధులు తప్పనిసరిగా యూనిఫారం ధరించాలి. 

దీనివల్ల అందరం ఒకటేననే భావన ఉంటుంది. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఇండోర్ గేమ్స్ ను అందుబాటులో ఉంచుతారు. మరో రకం వృద్ధాశ్రమాలు

ఏవైనా స్వచ్ఛంద సేవాసంస్థలు, దేవాలయాలు, మఠాలు నడుపుతుంటాయి కొందరు యాచకుల కోసం ఆశ్రమాలు నడుపుతుంటారు. పేదరికం, నేర చరితులు, వివిధ కారణాలతో ఇళ్లు వదిలి నగరాలకు చేరుకుని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఫుట్పాత్లు, పార్కులు, బస్టాపుల్లో తలదాచుకుంటూ రాత్రి వేళల్లో నిద్రిస్తున్న వారికోసం ఢిల్లీ లాంటి నగరాలలో ఆశ్రమాలున్నాయి. ఫుట్పాత్లపై నివాసముండి పనులు చేసుకునేవారు, యాచకులు రాత్రివేళల్లో వీటిలో నిద్రించవచ్చు. రాత్రివేళల్లో తలదాచుకునేవారి వద్ద నుంచి అతితక్కువ రుసుము వసూలు చేస్తారు. అతితక్కువ ధరకే ఆహారం కూడా దొరుకుతుంది. ఇటువంటి ఆశ్రమాల్లో చేరే పేద వృద్ధులకు ఎలాంటి ఆధారమూ ఉండదు.

ఇక్కడ దొరికే వసతులు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. ఒక్కొక్క గదిలో ఐదారుగురు ఉంటారు. వైద్య సౌకర్యాలు కూడా మృగ్యమే. వీరంతా మృత్యువు కోసం ఎదురు చూస్తుంటారు. కానీ మృత్యుదేవత వీరిని తొందరగా కరుణించదు. వీరికి ఎంత సాయం చేసినా తక్కువే కొంతమంది సహృదయంతో సాయం అందిస్తే మరికొంతమంది గోరంత సాయం అందించి కొండంత గొప్పలు చెప్పుకుంటుంటారు. ఇటువంటి పేద వృద్ధాశ్రమాలకు దాతలు కొంత ఆర్థిక సహాయం అందించి వృద్ధుల జీవితాన్నంతా తామే బాగు చేసినట్లు కటింగ్ ఇస్తూ పత్రికల్లో ఫొటోలు వేయించుకుని దానకర్ణుల్లా ఫీలవుతుంటారు. కుడి చేత్తో ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియకూడదని మన పెద్దలు చెప్పారు. ఆ సూక్తిని మరచిపోయి ఒకరోజు అన్నదానం చేసినా దినపత్రికల్లో ఫొటోలు వేయించుకుని తాము సమాజానికి స్ఫూర్తినిస్తున్నామని చెప్పుకుని ఆనందిస్తుంటారు. ఇటువంటి వారిని చూస్తే చేసేది చారెడు, ఆర్భాటం బారెడు అన్న లోకోక్తి గుర్తుకు వస్తుంది. మన దేశంలో వృద్ధాశ్రమాలు ఒకప్పుడు తక్కువగా ఉండేవి. నేడు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870