ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్లు ముఖ్యమైనవి. ఇవి ప్రకృతిలో వివిధ రుచులతో చెట్ల నుంచి వచ్చే తినే పదార్థాలు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పువ్వుల ఫలదీకరణం, పరిపక్వత ఫలితంగా ఒక పండు ఏర్పడుతుంది. పండు అనేది పుష్పించే ష్పించే మొక్క కండగల భాగం. పండు నిర్మాణ శాస్త్రాన్ని ఆంగ్లంలో ‘ఫ్రూట్ అనాటమీ’ అంటారు. పండు ఉద్దేశం అభివృద్ధి సమయంలో విత్తనాల్ని రక్షించడం. అవి తరచుగా వివిధ రంగుల్ని, ఆహ్లాదకరమైన వాసన కలిగి వుంటాయి. ఇవి రకరకాల సైజుల్లో, ఆకృతిలో ఉంటాయి. ఇవి సహజసిద్ధమైన శాకాహారం. పురాతన కాలం నుంచి పండ్ల వాడ వాడకం రాతియుగం నుంచి ఉంది. పండు అనేది లాటిన్ పదం. ప్రక్టస్ నుండి వచ్చింది. దీని అర్థం ఆస్వాదించడం. ఇవి పుష్పించే మొక్కలలో విత్తనాన్ని కలిగి వుండే నిర్మాణం. వీటినే పండ్లు లేదా ఫలాలు అని అంటారు.
పండు నిర్మాణం: ప్రతి పండులో 2-3 పొరలుంటాయి.
1) ఎక్సోకార్ప్ అంటే పండు పైచర్మాన్ని ఏర్పరిచే బయటి పొర. 2) మీసోకార్ప్.. అంటే కండగల జ్యూసీపొర. 3) ఎండోకార్ప్ అంటే లోపల విత్తనం ఉండే పొర. కొన్ని వాణిజ్య ఫలాల్లో విత్తన రహితమైన పండ్లు ఉన్నాయి. అవి అరటి, పైనాపిల్ మొదలైనవి.
పండ్ల రకాలు
పండ్ల రకాలు అనేవి అభివృద్ధి చెందిన అండాశయాల సంఖ్య, వాటి నిర్మాణంలో పాల్గొన్న పువ్వుల సంఖ్యని బట్టి రెండు రకాలు.
1) అవృత ఫలాలు: ఫలదీకరణం వల్ల అండాశయంతో పాటు మరి ఏ ఇతర పుష్పభాగం అయినా ఫలంగా పెరిగితే దాన్ని అవృత ఫలం అంటారు. ఉదా: ఆపిల్, జీడిమామిడి, స్ట్రాబెర్రీ.
2) నిజ ఫలాలు: ఫలదీకరణం చెందిన అండాశయం నుంచి ఏర్పడతాయి. విత్తనాలు, ఫల కవచాన్ని బట్టి ఐదు రకాలు. ఎ) సరళ ఫలాలు: పువ్వులోని సంయుక్త అండకోశంలోని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని ‘సరళ ఫలం’ అంటారు. ఉదా: ఆపిల్, పీచెస్, చెర్రీలు, ఫలకవచ స్వభావాన్ని బట్టి ఇవి రెండు రకాలు. 1) కండగల ఫలాలు: ఫలకవచం పక్వ స్థితిలో గుజ్జుగాగానీ, రసయుతంగా గానీ తయారవుతుంది. ఎ) మృదుఫలం (చెర్రి): ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విత్తనాలుండే ఒక కండగల ఫలం. ఉదా: స్ట్రాబెర్రీ (Strawberry), టమోట, అరటి. బి) పోమ్: దీనినే ఆక్సిసరీ ఫ్రూట్ అంటారు. కండ కలిగిన పుష్పాసనం చేత ఆవరించబడి
ఉంటుంది. ఉదా: ఆపిల్, వాటర్ ఆపిల్, బేరి, రోజ్ ఫిష్లు. సి) పెపో: బాహ్య ఫలకవచం మెత్తగా ఉండి అనేక విత్తనాలు కలిగి ఉంటుంది. ఉదా: దోస, గుమ్మడి, బీన్స్, పుచ్చకాయ. డి) హెస్పరీడియం: ఇది కండ గల ఫలం. దీనిలో అంత! ఫల కవచం అనేక గదులుగా విభజించబడి ఉంటుంది. ఉదా: నిమ్మజాతి పండ్లు. ఇ) టెంక గల ఫలం(డ్రూప్): ఎండోకార్ట్ గట్టిగా, మెసోకార్ప్ కండతో ఉంటుంది. ఉదా: నారింజ, ద్రాక్ష, మామిడి (mango),కొబ్బరి.
2) శుష్క ఫలాలు(డ్రై ఫ్రూట్స్): పెరికార్ప్ మొత్తం పరిపక్వత సమయంలో పొడిగా మారుతుంది. ఉదా: నేరేడు, చెర్రి, ఆలివ్ మొదలైనవి.
ఎ) ఆచెన్: ఒకే అండాశయం నుండి అభివృద్ధి చెందుతుంది.
ఉదా: స్ట్రాబెర్రీ, సన్ఫ్లవర్ సీడ్స్. బి) కార్యోప్సిస్: ఇది పొడిగా ఉండే ఒకే పండు. ఉదా: తృణ ధాన్యాలు, మొక్కజొన్న, వరి, బార్లీ
మొదలైనవి. సి) లెగ్యూమ్స్: పొడవుగా, పల్చగా ఉండే డ్రై ఫ్రూట్స్. ఉదా: పీస్, పీనట్, చింతకాయ. డి) నట్స్:
సింగిల్ విత్తనంగా ఉండేది. ఉదా: జీడిపప్పు, బాదం. బి) సంకలిత ఫలాలు: చిరుఫలాలన్నీ ఒకే పుష్పవృంతం మీద గుమిగూడి ఒక సంకలిత ఫలం ఏర్పడుతుంది. ఉదా: సీతాఫలం, కోరిందకాయ, బ్లాక్ బెర్రీ. సి) సంయుక్త ఫలాలు: అన్ని పుష్పాల నుంచి ఏర్పడే ఫలాలన్నీ కలిసిపోయి పక్వ దశలో ఒకే ఫలంగా మారుతాయి. ఉదా: పైనాపిల్, ఫిగ్, మల్బరీ. ఎ) సోరోసిస్: ఇది కంకి పుష్ప విన్యాసం నుంచి ఏర్పడుతుంది. ఉదా: పనస, మల్బరీ, అనాస మొదలైనవి.
బి) సైకోనస్: పుష్ప విన్యాస వృంతం కండ కలిగి ఒక ఫలంగా కనపడుతుంది. ఉదా: పైకస్ జాతులు. ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. పండ్లలో 3-18 శాతం వరకు షుగర్స్, సిట్రిక్, మాలిక్ టార్టారిక్ ఆసిడ్స్ వంటి ఆర్గానిక్ ఆసిడ్స్ ఉంటాయి.
Healthy Fruits:ఆరోగ్య ప్రయోజనాలు
శక్తి కోసం సహజ చక్కెరల్ని అందించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. ఇది హైడ్రేటింగ్గా ఉండి తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ లేకుండా చేస్తాయి. అధిక ఫైబర్ కంటెంట్, విటమిన్ సి స్థాయిల్ని బట్టి శరీరంలో పోషకాల శోషణ ఉంటుంది. కడుపులోని ఆసిడ్ని తటస్థీకరించడం ద్వారా కడుపునొప్పి, ఎసిడిటీ తగ్గుతుంది. చర్మంలో కొల్లాజెన్ ధాతువుల్ని పెంచి మెరుగైన చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి. పండ్లు డీటాక్సిగా పని చేసి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తాయి. గటా హెల్త్ మైక్రోబ్స్ కు మంచిది. అరటి పండ్లలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి, రక్తపోటుకి మంచిది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, ఆపిల్స్, పీచ్ వంటి అనేక పండ్లు దీర్ఘాయుష్షుని ప్రసాదిస్తాయి. ఇవి రుచికరమైన పోషక ఆహారాలే గాకుండా ప్రకృతి ఇచ్చిన హెల్దీ స్నాక్స్ గా ఉపయోగపడతాయి. పండ్ల నుండి తీసిన పండ్లరసం పానీయంగా తాగుతారు. ఉదా: నిమ్మ, ఆపిల్, ద్రాక్షరసం. శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు పూర్తిగా అందుతాయి. పండ్లని పులియబెట్టడం వల్ల ఆల్కహాల్ విస్కీ, బ్రాందీ తయారు చేస్తారు. ఆహారంలో భాగంగా పండ్లని తీసుకోవడంవల్ల స్థూలకాయులు బరువు తగ్గుతారు. చాలా పండ్లు సహజ రంగుల్ని అందిస్తాయి. దీనివల్ల విటమిన్ ఎ, డి లభ్యమై శరీర కాంతిని కలిగిస్తాయి. ఆలివ్ పండ్ల నుండి అలివ్నూనె, కొబ్బరి, వేరుశనగ నుండి నూనెల్ని తయారు చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంచే తెల్ల రక్తకణాల ఉత్పత్తికి ఉపయోగపడడం వల్ల బాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు రాకుండా చాలా వరకు అరికట్టబడతాయి. ఆపిల్ నుండి వెనిగర్ని తయారు చేస్తారు. కొన్ని మసాలా దినుసులుగా
ఉపయోగడతాయి. ఉదా: బెర్రీ మృదుఫలాలు. నల్ల మందు
ఫలాల(గసగసాలు) నుండి నల్లమందు, మార్పిన్ తయారు చేస్తారు. ఆయా సీజన్లలో దొరికే సీజనల్ పండ్లని తినడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు తినదగిన, తక్కువ ధరకు, అందరికి అందుబాటులో దొరికేవి పండ్లు. ఇవి సులభంగా జీర్ణమై, కడుపు నిండుగా ఉన్నట్లుంటుంది.
జీర్ణకోశ సమస్యలు(అజీర్తి, మలబద్ధకం, విరేచనాలు రాకుండా ఉంటాయి. డయాబెటిక్ రిస్క్ తగ్గుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిల్ని నియంత్రిస్తాయి. ఆకాల వార్ధక్యం రాకుండా అరికడతాయి. ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యల్ని రాకుండా చేస్తాయి. ఫ్రూటేరియనిజం అంటే ప్రధానంగా పండ్లు, గింజలు. దీన్నే ఫలహార ఆహారం అంటారు. ఇది బి12, కాల్షియం, జింక్, ఒమేగా3, ప్రొటీన్స్ ని తగ్గించడం వల్ల పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చు. ఇవి సహజంగా పండే రక్షిత మొక్కల సమ్మేళనాలు. ఇది శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. జీవక్రియని పెంచుతుంది. శరీరానికి కావలసిన అంటీ ఆక్సిడెంట్స్ ని అందించడం వల్ల కేన్సర్ వ్యాధులు (ప్రొస్టేట్, లంగ్, కోలోరెక్టల్) రాకుండా అరికట్టబడతాయి. ఇవి తక్షణ శక్తినిస్తాయి. ఉదా: అరటి, అవకాడో, బెర్రీస్, ఆపిల్, స్ట్రాబెర్రీ, ఆరెంజెస్, డార్క్ బెర్రీస్లు.
నిమ్మ వంటి సిట్రస్ పండ్లు తాజాపండ్లు రక్తశుద్ధికి ఉపయోగపడతాయి. మనుషుల ఎత్తు, బరువు, వయస్సు, ఫిజికల్ ఆక్టివిటీ, అనారోగ్య పరిస్థితులు, సీజనల్ ఇన్ఫెక్షన్లని బట్టి పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు మారుతాయి. ఈ ప్రయోజనాలు ఒకరిలో ఉన్నట్లు మరొకరిలో ఉండవు.
సైడ్ ఎఫెక్ట్స్: ఎక్కువ కాలం వండ్లపై ఆధారపడితే స్థూల పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. 10 శాతం మందిలో సిట్రస్ పండ్ల వల్ల ఎలర్జీ వస్తుంది.
చలికాలంలో పైనాపిల్ వల్ల ఎలర్జీ, జలుబు, దగ్గు వస్తాయి. పండ్లలో ఉండే ఫైబర్ వల్ల ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, క్రోన్స్ డిసీజెస్ ఉన్నప్పుడు, పేగుపూత ఉన్నపుడు అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, విరేచనాలు ఎక్కువవుతాయి. అంతేగాకుండా పండ్లని ఎక్కువగా తింటే గ్యాస్ ట్రబుల్, పొట్ట
ఉబ్బరం, ఎసిడిటీ, విరేచనాలు, ఆకలిలో హెచ్చుతగ్గులు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి.
పండ్లలోని సహజ చక్కెరలైన ఫ్రక్టోజ్ వల్ల కొందరిలో పడక ఫ్రక్టోజ్ మాల్ అజీర్ణం(ఉబ్బరం, కడుపునొప్పి, వికారం, గ్యాస్, విరేచనాలు) అధిక ఫైబర్ వల్ల జీర్ణకోశ సమస్యలు, షుగల్ లెవల్స్ వల్ల రక్తంలో బ్లడ్ షుగర్స్, రక్తపోటు ఎక్కువవుతుంది. స్థూలకాయం ఎక్కువవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు, గేట్ వ్యాధి ఎక్కువవుతుంది.
పండ్లు ఒక్కటే తిని బతకలేం. దీనివల్ల రక్తహీనత, అలసట, కాల్షియం, విటమిన్ల లోపం వల్ల రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల ఆస్టియో ఫోరోసిస్, విటమిన్ల లోపం ఏర్పడుతుంది. సిట్రస్ పండ్ల వల్ల దంతాల ఎనామిల్ దెబ్బ తింటుంది. సెన్సిటివ్ దంతాలేర్పడడం వల్ల వేడి, చల్లదనాన్ని భరించలేరు. మామిడి, అరటి, ద్రాక్ష వల్ల అధిక కేలరీలు పెరిగి బరువు పెరుగుతారు. జామపండ్లు ఎక్కువగా తింటే చల్లని స్వభావం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ, మలబద్దకం, జ్వరాలు వస్తాయి. ఆరెంజెస్, నారింజ, ఫైనాపిల్ చలికాలంలో కీళ్లనొప్పులున్నవారు తింటే ఎక్కువవుతాయి.
సీజనల్ పండ్లు
ఆయా సీజన్స్ లో దొరికే పండ్లు ప్రతిరోజూ 2-3 రకాల రంగుల పండ్లని తీసుకోవడం ఆరోగ్యరీత్యా మంచిది. రోజూ రెండు కప్పుల పండ్లు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. పండ్ల రసాల కన్నా తాజా పండ్లనే తీసుకోవడం చాలా మంచిది. వీటిని అల్పాహారంగా, స్నాక్స్ గా, భోజనానికి ముందు, భోజనం తర్వాత అరగంట నుండి గంటకు తీసుకోవాలి. చెర్రీస్ పైనాపిల్ని కాటేజ్ చీజ్తో కలిపి తీసుకోవాలి. ముక్కలు చేసిన అరటిపండ్లు, ఎండుద్రాక్ష, బేరి, పీచెస్ని తృణధాన్యాలు, ఓట్మీల్తో కలిపి తీసుకోవాలి. ఉపవాసాలు చేసేటప్పుడు పండ్లలోని ఎంజైమ్లు కాలేయంపై ఉత్తేజంగా, బలమైన ప్రభావాన్ని కలిగి వుంటాయి. కాబట్టి ఎక్కువ రోజులు ఉపవాసాలుండకూడదు. 2.2-3.5 శాతం మాత్రమే పండ్లని ఆహారంలో భాగంగా తీసుకుంటే- 37 శాతం మంది మాత్రమే తక్కువగా తీసుకుంటారు. ఇది మనిషి వయస్సు, ఎత్తు, బరువు, ఫిజికల్ ఆక్టివిటీ, సీజనల్ ఇన్ఫెక్షన్స్ ని బట్టి మారుతుంది. పండ్లని కట్ చేసి వాటిని ఫ్రిజ్లో ఉంచకూడదు. దీనివల్ల రుచి, పోషకాలు తగ్గుతాయి. రాత్రిపూట, నిద్ర పోయేముందు
పండ్లు, పండ్ల రసాలు తీసుకోరాదు. పాలు, పండ్లు కలిపి తినరాదు. పండ్లు తిన్న అరగంట తర్వాతనే నీళ్లు తాగాలి. ఖాళీ కడుపుతో సిట్రస్ పండ్లు తినరాదు. తింటే ఆసిడ్ రిఫ్లెక్స్, గుండెలో మంట వస్తుంది. ఖాళీ కడుపుతో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ మితంగా తీసుకోవాలి.
Healthy Fruits:ఫ్రూట్ డైట్
ఆహారం సరిగా తీసుకోకుండా పండ్లు ఎక్కువగా తినడాన్ని ఫ్రూట్ డైట్ అంటారు. దీనివల్ల శరీరంలో ఎలెక్ట్రోలైట్ ఇంబాలెన్స్, ఖనిజాల లోపం, కళ్లు తిరగడం, తలనొప్పి, అలసట, కండరాల తిమ్మిర్లు, హైపోగ్లైసీమియా, రక్తహీనత, బరువు తగ్గడం, జుట్టు రాలడం, చర్మ సమస్యలు, తక్కువ ఎముకల సాంద్రత ఉండడం, జ్ఞాపకశక్తి తగ్గడం, బలహీనత, ఆందోళన, నిరాశ, ఎదుగుదల లోపం, ఎముకలు బోలువారడం, పోషకాహార లోపం, రోగనిరోధక శక్తి తగ్గడం, ప్రొటీన్, ఒమేగా 3, బి కాల్షియం, ఐరన్ పోషకాలు అందవు. ఇది డయాబెటిస్, పిసిఓడి, పిసిఓఎస్ ఉన్నవారికి మంచిది కాదు. పాంక్రియాజ్, కిడ్నీ డిజార్డర్స్ తో బాధపడేవారు, వాపులున్నవారు తినరాదు. కాబట్టి ఫ్రూట్ డైట్ 1-2 రోజులు మాత్రమే తీసుకోవాలి.
ఫ్రూటేరియనిజం అంటే ప్రధానంగా పండ్లు, గింజలు మాత్రమే తినడం. దీన్నే ఫలహార ఆహారం అంటారు. ఇది బి12, కాల్షియం, ఐరన్, జింక్, ప్రొటీన్స్, ఒమేగా 30 తగ్గించడం వల్ల పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చు. వీరు మొక్క నుండి సహజంగా పండే వాటిని మాత్రమే తింటారు. వీటిలో పండ్లు, కాయలు, విత్తనాలు కూడా ఉంటాయి. ఇవి పోషకాహారమైనవి. ఇవి కొన్ని విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉన్న రక్షిత మొక్కల సమ్మేళనాలు. ఎక్కువగా పండ్లరసాలు తీసుకోవడం వల్ల విరేచనాలు, మెటబాలిక్ సిండ్రోమ్, దంతక్షయం ఏర్పడుతుంది.
దీర్ఘకాలిక శాశ్వత ఫలితాల్ని ఇచ్చే పండ్లు-ప్రత్యేకతలు
బ్రెయిన్ రికవరీ ఫ్రూట్స్: స్ట్రాబెర్రీ, కివి, టమోట, జామ, నారింజ, సిట్రస్ పండ్లు: గాడ్ ఫ్రూట్: ఖర్జూరం: హెల్దీ పవర్ ఫ్రూట్: అకైబెర్రి: డాక్టర్ ఫ్రూట్: ఉసిరి: రాయల్ ఫలం: స్టార్ గూస్బెర్రీ. పండ్ల పితామహుడు-బొప్పాయి: రాణీపండు: మాంగోస్టీన్ శక్తివంతమైన డీటాక్స్ పండు: నిమ్మ, సిట్రస్ పండ్లు: ఫల ఔషధం: ఉసిరి:
రక్తాన్ని పునరుద్ధరించే పండ్లు: ఆప్రికాట్స్, ఆపిల్స్, నల్ల ద్రాక్ష, దానిమ్మ, పుచ్చ, అరటి మొదలైనవి: ఇండియాలో ఖరీదైన పండు: ఆల్ఫోన్సో మామిడి, కాశ్మీరీ ఆపిల్: అధిక ప్రొటీన్స్ ఇచ్చే పండ్లు: ఆపిల్, అవకాడో, బెర్రీలు, చెర్రీస్, అత్తి, జామ, ద్రాక్ష, కివి, నారింజ: రిలాక్స్ డ్ ఫ్రూట్స్ బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆపిల్, నిమ్మ, నారింజ; అధిక ఫైబర్ పండ్లు: రాస్బెర్రీస్, మామిడి, జామ, ఖర్జూరం: అధిక విటమిన్ సి ఉన్న నారింజ: ఉప్పుగా ఉండే పండ్లు: కొబ్బరి, ఆపిల్, నారింజ, బెర్రీ మొదలైనవి: విలాసవంతమైన పండు: యుబారికింగ్ మెలోన్: నిద్ర పట్టే పండ్లు: ఆపిల్స్, ద్రాక్ష, అరటి: వేసవిలో తినాల్సిన పండ్లు: బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, నిమ్మ, జాక్: తక్షణ శక్తినిచ్చే పండ్లు: అరటి, అవకాడో, గోజీ, బెర్రీస్, ఆపిల్స్, స్ట్రాబెర్రీస్ డార్క్ బెర్రీస్లు, ఆరెంజెస్. మానవ శరీరంలోని అవయవాలతో పోలిక ఉండే పండ్లు: మానవ శరీరాన్ని అరవై శాతం పోలి వుండే పండు: అరటి ఇది సెరటోనిన్ గా మారి సంతోషాన్నిస్తుంది. కండరాలు: అరటి: అవకాడో-గర్భాశయం: అల్లం-కడుపు: నిమ్మ, నారింజ, ద్రాక్ష: రొమ్ము, కేన్సర్: కిడ్నీబీన్స్-కిడ్నీ: పుట్టగొడుగులు-చెవి: ఆలివ్-అండాశయాలు: ఉల్లి-కళ్లు: చిలగడ దుంపలు-పాంక్రియాస్; వాల్నట్-మెదడు. ఇది 30కి పైగా వివిధ న్యూరాన్ ట్రాన్స్ మీటర్ల అభివృద్ధికి దోహదపడుతుంది.
వివిధ వ్యాధులకు ఉపయోగపడే పండ్లు
ఆపిల్స్-గుండె వ్యాధులు, కేన్సర్స్, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ వ్యాధులు: ద్రాక్ష, బ్లూ బెర్రీస్, దానిమ్మ, ఆపిల్, అవకాడో-కొలెస్ట్రాల్: ఫిగ్స్-అధిక ఆక్సిడెంట్స్ ఉండి కణాల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. ద్రాక్ష-కేన్సర్స్: ఆరెంజెస్: న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ని గర్భస్థ శిశువులో ఏర్పడకుండా ఫోలేట్ నయం చేస్తుంది: బొప్పాయి: పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ సి, జీర్ణక్రియకి, ఇన్ఫ్లమేటరీ మార్పులు రాకుండా చేస్తుంది. రాస్ బెర్రీస్: ఫైబర్ బరువు తగ్గించడంలో, గుండె జబ్బులున్నా డయాబెటిక్స్ లో ఉపయోగపడుతుంది:
స్ట్రాబెర్రీస్: విటమిన్స్, ఎలాంజిక్ ఆసిడ్స్ వెంట్రుకలు రాలకుండా, కేశ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి.
నిమ్మ: అజీర్తి, మలబద్దకం, గ్యాస్ ట్రబుల్, వికారం: ద్రాక్ష, కివి, సిట్రస్, పిస్తా- ఇన్ఫెక్షన్స్ రాకుండా నిరోధించే తెల్ల రక్త కణాల పెంపుదలకి తోడ్పడుతాయి. ద్రాక్ష, ఆరెంజెస్, నిమ్మ, పీచెస్: ఇమ్యూనిటీ నారింజ, బెలెపెప్పర్స్, జామ, కివి, స్ట్రాబెర్రీ, టమాట- బ్రెయిన్ హెల్త్: బెర్రీలు, నారింజలు, అవకాడో, స్టీబెర్రీ, నల్ల ఎండుద్రాక్ష మొదలైనవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. బెర్రీస్, అవకాడో, క్యారట్స్, బ్రకోలీ, కాలీఫ్లవర్, పొటాటో, నట్స్, గుడ్లు, సీవుడ్, గ్రేప్స్, మామిడి, బొప్పాయి, టమాట, ఆరెంజెస్, ఆప్రికాట్స్, పీచెస్ పుండ్లు, ఆపరేషన్ గాయాలు, రోగి రికవరీ కావడానికి ఉపయోగపడతాయి.
స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు-బాడీ పెయిన్స్: సిట్రస్, ఆరెంజెస్, నిమ్మ, ద్రాక్ష, బెర్రీలు-జబ్బు పడినప్పుడు, జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ నుండి కోలుకోవడానికి ఉపయోగం. కివి, చెర్రీస్, జామ, క్యారట్స్ – గాయాలు మానడానికి; ఆరెంజెస్, నిమ్మ, ద్రాక్ష, దానిమ్మ- రక్తం పట్టడానికి: అవకాడో-విటమిన్ ఈ; బొప్పాయి, ఆరెంజెస్-కేన్సర్లు; బెర్రీస్, సిట్రస్, ఆపిల్స్, అవకాడో, ద్రాక్ష, బొప్పాయి, పుచ్చకాయ-లివర్ ఆరోగ్యానికి;
బ్లూబెర్రీస్, ఎర్ర ద్రాక్ష, ఆలివ్, ఆపిల్, పియర్స్- క్రానిక్ కిడ్నీ డిసీజెస్: సిట్రస్, అవకాడో, ఆపిల్, బెర్రీస్, స్ట్రాబెర్రీస్-షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతుంది: సిట్రస్, నిమ్మ, ఆరెంజెస్, పైనాపిల్- చర్మ వ్యాధులు: పైనాపిల్, బొప్పాయి, రేగు, ఖర్జూరం, అత్తి, దానిమ్మ-కీళ్లనొప్పులు, కీళ్ల వాపులు, బ్లూ బెర్రీస్లు, స్ట్రాబెర్రీలు, నారింజ-పెయిన్ కిల్లర్, బాడీ పెయిన్స్ నివారణకు ఉపయోగపడతాయి; ఆపిల్, బేరి, బ్లూబెర్రీస్: నీరసం, అలసట తగ్గిస్తాయి. పుచ్చకాయ, దానిమ్మ, టమాట, సిట్రస్, బెర్రీస్-రక్తప్రసరణ. మామిడి-గుండె, కంటి, కిడ్నీ ఆరోగ్యానికి మంచిది. గోజీబెర్రీలు, అత్తి, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు-చలువ చేసే డ్రై ఫ్రూట్స్. ఆపిల్స్, అరటి, పుచ్చ. నారింజ, అవకాడో-క్రియాటిన్ తక్కువగా ఉండే పండ్లు. ద్రాక్ష, నారింజ, పైనాపిల్, స్ట్రాబెర్రీ, యూరిక్ ఆసిడ్ నివారణ పండ్లు.
రంగుల ఆహారం పండ్లు
1) ఎరుపు పండ్లు: ఎర్ర ద్రాక్ష, స్ట్రాబెర్రీ, చెర్రీస్, పుచ్చకాయ, టమాట, రాస్బెర్రీస్, దానిమ్మ, ఎరుపు ఆపిల్. వీటిలోని ఆంటి ఆక్సిడెంట్స్ వల్ల గుండె, లంగ్స్, కళ్లు, జీర్ణవ్యవస్థకి మంచిది. 2) పసుపు పండ్లు: పసుపు ఆపిల్, అప్రికాట్స్, నారింజ, ద్రాక్ష, పీచెస్, మామిడి, బొప్పాయి, బేరి, పైనాపిల్, మొక్కజొన్న, నిమ్మ, అరటి. వీటిలో విటమిన్ సి, కెరోటినాయిడ్స్ ఉండి ఇమ్యూనిటీకి, చర్మవ్యాధులకి, రక్తప్రసరణకి మంచిది. 3) ఆకుపచ్చ: ఆంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్స్ ఐరన్ విటమిన్ల వల్ల ఇవి గుండె, రక్తం, ఎముకల ఆరోగ్యానికి మంచిది. హార్మోన్ల ఇంబాలెన్ని సమతుల్యం చేస్తాయి. తక్కువ కొలెస్ట్రాల్ కి మంచిది. ఉదా: ఆపిల్, కివి, ద్రాక్ష, నిమ్మ, అవకాడో, బ్రకోలీ, కీర, పాలకూర.
4) నీలం/ఊదా: వీటిలోని ఆంథోసైనిన్ కారణంగా కంటి, నరాల మెదడు ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తికి, బిపికి మంచిది. ఉదా: బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రేగు, ఎండుద్రాక్ష, అత్తి, నల్ల ద్రాక్ష-ఇవి జ్ఞాపకశక్తికి, బలమైన ఎముకల ఆరోగ్యానికి మంచిది.
5) ఆరెంజ్ పండ్లు: వీటిలో విటమిన్ సి, బీటాకెరోటిన్
ఉండడం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరిగి గుండెజబ్బులు, స్టోన్స్ రావు. జట్టు, చర్మం, కండరాల ఆరోగ్యానికి, ఆంటి ఇన్ఫ్లమేషన్కి మంచిది. ఉదా: గుమ్మడికాయ, కమలా పండ్లు, క్యారెట్స్, మామిడి, పీచెస్, నారింజ, 6) తెలుపు రంగు పండ్లు: ఆంటి ఆక్సిడెంట్స్, ఆంటి ఇన్ఫ్లమేటరీ కారణాల వల్ల ఇది గుండెజబ్బులు, కోలన్ కేన్సర్స్, కడుపు, ప్రొస్టేట్ కేన్సర్స్కి మంచిది. ఉదా: అరటి, తెల్లని పీచెన్, బేరి, తెల్ల ద్రాక్ష, 7) బ్రౌన్ రంగు పండ్లు: ఖర్జూరం, కొబ్బరి, కివి, జుజుబ్ డేట్స్, అత్తి, మేడి, మల్బరీ, ఎండుద్రాక్ష, సపోటా, శాంటారోసా ప్లమ్స్, లాంగ్ సాట్, సలాక్, దానిమ్మ, చింతపండు, చెస్ట్నట్, వాల్నట్, ఎర్ర అరటి, పియర్, దోసకాయ. ఇవి జ్వరం, జలుబు, ఇమ్యూనిటీకి, కీళ్ల నొప్పులకి, కేన్సర్స్కి, అల్సర్స్కి మంచిది.
జాగ్రత్తలు
ఒక్కో పండు ఒక్కోసారి తినడం ఎల్లప్పుడూ మంచిది. ఎందుకంటే ఏ పండు ప్రత్యేకత దానిదే. అన్ని పండ్లను కలపడం వల్ల జీర్ణక్రియలో లోపాలేర్పడతాయి. ఒక్కో పండులో ఒక్కో విధమైన పోషకాలుంటే, మరికొన్నింటిలో పోషకాల కంటే రుచి ఎక్కువగా ఉంటుంది.
భోజనం చేసిన వెంటనే పండ్లని తినరాదు. వీటిలోని ఎంజైమ్స్ విచ్ఛిన్నమై ఆహారంతో పాటు కలిసిపోయి పొట్టలో సమస్యల్ని కలిగిస్తాయి. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. వీటిని ఇతర పదార్థాలతో తింటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. వీటిని విడిగా తీసుకోవాలి. లేకపోతే పోషకాల శోషణ కష్టమవుతుంది. ఇది జీర్ణరసాల్లో కలిసి పులిసిపోతాయి. రాత్రిపూట నిద్రకు 2-3 గంటల ముందు నుంచి పండ్లు తినరాదు. రాత్రిళ్లు తింటే అధిక పోషకాలు, ఫైబర్, చక్కెరల వల్ల రక్త సరఫరాలో మార్పులు ఏర్పడతాయి. ఎసిడిటీ, ఆసిడ్ రిఫ్లెక్స్ వల్ల నిద్రాభంగం ఏర్పడుతుంది. వీటిని పొట్టనిండా తినరాదు. కొన్నింటిని తొక్కతో తినడం వల్ల స్థూలకాయం, కేన్సర్లు తగ్గుతాయి. ఉదా: ఆపిల్, ద్రాక్ష, రేగు, పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగరాదు. పండ్లలోని అధిక నీటి శాతం వల్ల పిహెచ్ స్థాయిల్లో మార్పు వచ్చి విరేచనాలు, చిగుళ్ల సమస్యలు, ఎలర్జీలు, కలరా వ్యాధులు వస్తాయి. ఉదా: పుచ్చకాయ, నారింజ, కీర, దోస, స్ట్రాబెర్రీ, పండ్ల రసాలు తీసుకోవడం కంటే పండ్లు తీసుకోవడమే ఉత్తమం. పండ్లు తిన్న తర్వాత నోరు బాగా పుక్కిలించాలి.
నోటి పరిశుభ్రత పాటించకపోతే దంతక్షయం, పంటి ఎనామిల్ పొర దెబ్బతింటుంది. పండ్లపై రసాయనాలుండటం వల్ల శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఎసిడిటీ వున్నవారు ఖాళీ కడుపుతో సిట్రస్, మామిడి వండ్లు తినకూడదు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
బొప్పాయితో కలిపి సిట్రస్ పండ్లు తినకూడదు. ఖాళీ కడుపుతో అరటి తినాలి. అరటితో నిమ్మ, నారింజ, నద్రాక్ష, సిట్రస్ పండ్లు తీసుకుంటే అజీర్ణం, ఎసిడిటీ సమస్య వస్తుంది. గర్భిణిలు అరటిపండు ఎక్కువగా తినకూడదు. యూరిక్ ఆసిడ్ ఎక్కువగా వున్నవాళ్లు ఆపిల్, బేరి, మామిడి, అత్తి, పుచ్చకాయ, ఎండిన పండ్లు తీసుకోకూడదు. బయటి నుండి వచ్చినపుడు శరీరం వెచ్చగా ఉంటుంది. అందువల్ల వెంటనే పండ్లని తినరాదు. తింటే జీర్ణక్రియపై శరీర వేడిని ప్రభావితం చేయడం వల్ల వాంతులు, నీళ్ల విరేచనాలు వస్తాయి. ఉదా: పుచ్చకాయ, బత్తాయి, మామిడి. వీటిని అరగంట నుండి ఒక గంట ఆగి తినడమే మంచిది. పండ్లు తిన్న వెంటనే దాహం వేస్తుంది. కానీ వెంటనే నీళ్లు తాగకూడదు. నీళ్లు తాగితే చిగుళ్ల వాపులు, ఎసిడిటీ, కడుపునొప్పి మొదలైన సమస్యలు వస్తాయి. పండ్లని టీ/కాఫీతో పాటు తినకూడదు. దీనివల్ల చర్మ, ఎలర్జీలు, జీర్ణకోశ సమస్యలేర్పడతాయి. వండ్లని కట్ చేసి ఫ్రీజర్లో ఉంచడం వల్ల వాటిలోని పోషకాలు పోతాయి. కాబట్టి పండ్లను కోసిన వెంటనే తినాలి. పండ్లు తినడం కూడా ఒక ఆర్ట్.
Read also: hindi.vaartha.com