విద్య అనేది ప్రతి ఒక్కరికీ అతి ముఖ్యమైనది. నవసమాజ నిర్మాణానికి విద్య దోహద పడుతుంది. నానాటికీ విద్యావంతులు పెరుగుతున్నప్పటికీ సమాజంలో మార్పురావడం లేదు. ప్రాచీన కాలం నాటి విలువలు నేటి చదువుల్లో లేదని సర్వత్రా వినిపి స్తుంది. బండెడు పుస్తకాలను బాలకార్మికుల్లా పిల్లలు మోసు కుని పాఠశాలకు వెళుతున్నా, వారు నిజ జీవితంలో అడుగిడి నప్పుడు ఆ చదువు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమాజ అభివృద్ధిఅనేది ప్రజల విద్యా వివేకాలపై ఆధారపడి ఉంటుంది. విద్య వెలుగునిస్తుంది. దీనిని భారతీయ సమాజం ఆది నుండి గుర్తించింది. తొలినాళ్ళ నుండి విద్యకు చక్కని ప్రాముఖ్యత ఉంది. విద్య జీవితానికి వెలుగు నిస్తుందని, అది లేనివాడు నేత్ర దృష్టిలేని వారితో సమానమని భావించేవాళ్ళు. “స్త్రీ, పురుషులకు విద్య చాలా ముఖ్యమైనది. అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. తల్లిలాగా పోషిస్తుంది. తండ్రిలా మార్గదర్శిలా నిలుస్తుంది. భార్యలాగా సుఖసౌఖ్యాలను ప్రసాది స్తుంది. కీర్తిని సంపాదిస్తుంది. కష్టాలు తొలిగిస్తుంది. స్వచ్ఛమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. మంచి నాగరికునిగా మారుస్తుంది. పొరుగుదేశంలో ప్రయాణిస్తుంటే మంచి తోడుగా నిలుస్తుంది. ఇన్ని కారణాల వల్ల విద్యను కల్పవృక్షంగా భావిస్తారు. అందుకే ప్రాచీనకాలం నుండి విద్యను మూడోనేత్రంగా భావిస్తూవచ్చారు.

ప్రాచీన కాలంలో విద్య క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు పూర్వం 600 వరకూ గల కాలంలో విద్య అనేది పూర్తిగా మతపరమైనదిగానే సాగింది. ఆ తరువాత బౌద్ధ మతం వచ్చాక విద్యా వ్యవస్థలో కొన్ని మార్పు లు జరిగాయి. విద్య గురుకులాలనుండి ఆరామాలకు చేరుకున్న ది. బౌద్ధ ఆరామాలలో చాలా మంది గురువులు ఉండి ఇప్పటి మన విశ్వవిద్యాలయాలలాగా బోధన చేసేవారు. ఈ తరుణం లోనే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు అయిన నలందా విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయాలు వచ్చాయి. అనం తరం విద్యాబోధన సంస్కృతం నుండి ప్రజాభాషకు వచ్చింది. తదుపరి ముస్లిం పాలకులు, హిందూ రాజులు విద్యా వ్యవస్థ లో అనేక మార్పులు చేశారు. బ్రిటిషు పాలకుల కాలంలో భారతదేశ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రెండు మార్పులు చెప్పు కోవాలి. అప్పటివరకూ ఎన్ని మార్పులు జరిగి భారతదేశంలో విద్యావ్యవ హిందూ, బౌద్ధ, ఇస్లాం ఇత్యాది మతాల ప్రభావం ప్రధానమైనదిగానే ఉండేది. కానీ బ్రిటిషువారు వచ్చిన తరువాత భౌతిక విద్యయ ప్రాధాన్యం పెరిగింది. మత విద్యను అభ్యసించడం మానేసి ప్రజలు సైన్సు చదవడం మొదలు పెట్టి భాషకు ప్రాముఖ్యత పెరిగింది. బ్రిటిషు వారి విద్యావిధానంలో ఎన్నో కమిటీలు వేశారు. ఎన్నో సంస్కరణలు తెచ్చే ప్రయత్నం చేశారు.

అయిన ప్పటికీ వారు భారత దేశాన్ని వదిలే సమయానికి మనదేశంలో అక్షరాస్యత పది శాతం కూడాలేదు. దీనికికారణం వారు పాటిం చిన ఫిల్టరు పద్ధతి అని చెప్పవచ్చు. ఈ పద్ధతి ద్వారా పై తర గతి వారికి విద్యాబోధన చేసేవారు కింది తరగతివారికి చదువు నేర్పుతారు అని భావించడం జరిగింది. అది ఆచరణలో విఫల మైంది. ఆ మీదట నిజాం కాలంలోని విద్యావ్యవస్థ గురించి మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో తెలుగు భాష ద్వారా విద్యావ్యాప్తికి బొత్తిగా రాజాశ్రయం లేదని తెలుస్తున్నది. ఆధునిక విద్య ఆ రోజులలో కొందరు చక్రవర్తులు సహాయ సహకారాలు అందించడం వల్ల అరబిక్, ఉర్దూ భాషల మనుగడ కొన సాగింది. అనంతరం ఆంగ్లేయులు ఆంగ్ల భాషకు పెద్ద పీట వేశారు. తరువాత వచ్చిన గ్రంథాలయోద్యమం వంటి అనేక ఉద్యమాల వల్ల ఎక్కువ మంది ప్రజల మాతృభాష అయిన తెలుగు ద్వారా విద్యావ్యాప్తికి ప్రయత్నాలు జరిగాయి. బ్రిటిష వారు అధికారాన్ని ఏకీకృతం! చేయడంతో, దేశాన్ని పరిపాలిం చడంలో ఆంగ్ల భాష చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని బ్రిటిష్ వారు గుర్తించారు. భారతదేశంలో విద్య పరిణామంలో ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటి 1835లో లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టడం అని చెప్పవచ్చు. పాశ్చాత్య విద్య ను, ప్రత్యేకంగా ఆంగ్ల భాష, సాహిత్యాన్ని ప్రోత్సహించడాన్ని మెకాలే నొక్కిచెప్పారు. దాంతో మెకాలే కాలంలో ఆంగ్ల విద్యకు పాఠ ర్థుల దృ ప్రాధాన్యత పెరిగింది.

ఆంగ్ల పాఠశాలలు ప్రారంభించారు. ఉన్నత విద్యకు ఆంగ్ల భాష బోధనా మాధ్యమంగా మారింది. 19వ శతాబ్దంలో భారతీయ విద్యలో మరో ముఖ్యమైన అభివృద్ధి 1854లో పుడ్స్ డెస్పాన్ను ప్రవేశ పెట్టారు. డెస్పాచ్ విద్యా విభాగాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయా లను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, విశ్వ విద్యాలయాల స్థాపన ప్రాము ఖ్యతను వుడ్స్ డెస్పాచ్ నొక్కి చెప్పింది. ఆంగ్ల విద్యకు ప్రాధా న్యత ఉన్నప్పటికీ, భారతీయు లలో ప్రాంతీయ విద్యకు డిమాండ్ బాగా పెరిగింది. 19వ శతాబ్దంలో భారతదేశం బ్రహ్మ సమాజం, ఆర్యసమాజం, అలీఘర్ ఉద్యమం ఇత్యాది సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలను కూడా చూసింది. ఈ సంస్కర్తలు సంప్రదాయ భారతీయ జ్ఞానాన్ని ఆధునిక పాశ్చాత్య విద్యతో మిళితం చేసే విద్య కోసం వాదించారు. వారు సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి, స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి, శాస్త్రీయ విజ్ఞాన వ్యాప్తిని ప్రోత్సహించ దానికి ప్రయత్నించారు. ఈ కాలంలో క్రైస్తవ మిషనరీలు కూడా విద్యలో గణనీయమైన పాత్ర పోషించాయి. 19వ శతాబ్దపు విద్యావిధానం ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు అందుబాటులో లేకుండా పోయింది. విద్య ప్రధానంగా పట్టణ కేంద్రాలు, ప్రత్యేక వర్గాలకు పరిమితమైంది. తెలుగు రాష్ట్రాలలో.. ఇలా అనేక మార్పులు జరుగుతూ నేడు విద్య అందరికీ చేరు వైంది.

మనదేశంలో సుమారు 15లక్షల పాఠశాలల్లో 25కోట్లకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, వీటిలో 44,617 ప్రభుత్వ పాఠశాలలు, 13,249 ప్రైవేట్ పాఠశాలలు, ఇంకా ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఉన్నాయి. పది మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలు 5,520, 20మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలు 8,072గా గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల సంఖ్య 35.14,948, ఎయిడెడ్ విద్యార్థుల సంఖ్య 92,579, ప్రైవేటు విద్యార్థుల సంఖ్య 34,15,948, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య 1,87,996.
ఎయిడెడ్ ఉపాధ్యాయుల సంఖ్య 3.396 అని అంచనా. పాఠశాల విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్) ప్రాథమిక స్థాయి పూర్తిగా. మాధ్యమిక స్థాయి పాక్షికంగా అనగా 1నుండి 10వ తరగతుల వరకు విద్యావ్యవస్థని నిర్వహిస్తుంది. ఇది విద్యార్థులందరికీ
మెరుగైన ప్రవేశం కల్పించడం, నమోదు, నిలుపుదలని ప్రోత్స హించడం, అందరికీ సమాన విద్య అవకాశాలను, నాణ్యత, పాఠశాల మౌలిక సదుపాయాలను అందించడం ధ్యేయంగా పనిచేస్తుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యా ర్థులకు 100 శాతం ఆధార్ అనుసంధానం చేయడం జరిగింది.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్మార్ట్ క్లాసూమ్ల’ను ప్రారంభిం చారు. ‘విందాం నేర్చుకుందాం’ (రేడియో పాఠాలు), ‘మీనా ప్రపంచం’ (రేడియో ప్రోగ్రామ్), ‘వీడియో పాఠాలు’ లాంటి దృశ్య, శ్రవణ బోధనా పద్ధతుల ద్వారా విద్య నేర్పడం జరుగుతున్నది.

డిజిటలీకరణలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యా ర్థుల హాజరు వేలిముద్రల ద్వారా నమోదు చేస్తున్నారు. ‘బడి పిలుస్తోంది’ అనే ప్రచార కార్యక్రమం ద్వారా విద్య అనేది ప్రతి బిడ్డకు హక్కు అని ప్రజల లో అవగాహన కల్పించడం, ఉచితంగా మధ్యాహ్న భోజనం, ఏకరూప వస్త్రాలు, పుస్తకాలు అందిస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 26,101 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 1,06,641 లు పనిచేస్తున్నారు. తెలంగాణ లో సుమారు 60 లక్షల మంది పాఠశాల విద్యాభ్యాసం చేస్తుంటే 35 లక్షలమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ, 25 లక్షలమంది ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్యా భ్యాసం చేస్తున్నారు. గత పది సంవత్సరాలతో పోలిస్తే ప్రతి సంవత్సరం సుమారు 3 శాతం మంది చొప్పున ప్రభుత్వ పాఠ శాలల్లో పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలల్లో 87 శాతం పిల్లలు ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో 13 శాతం పిల్లలు ఉన్నారు. నేడు సుమారు 55 శాతం మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో 45 శాతం మంది పిల్లలు ఉన్నారు. తెలంగాణలోని 272 పాఠశాలల్లో 501 నుంచి 750 మధ్య పిల్లలు ఉండగా, 85 పాఠశాలల్లో 750 మంది. విద్యార్థులు ఉన్నారు. ఇదిలా ఉండగా కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే చేరిన పాఠశాలల సంఖ్య 53 ఉండగా, టీవర్లు 51 మంది ఉన్నారు. అలా ఈ విద్యాసంవత్సరం. లో పది మందిలోపు విద్యార్థులు చేరిన పాఠశాలలు మొత్తం 4324 ఉన్నాయి.

అందులో మొత్తం 3326 ముంది ఉపాధ్యాయులు ఉన్నారు. జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రైమరీ పాఠశాలల సంఖ్య 1818 కాగా అందులో ఉపాధ్యాయులు 517 మంది ఉన్నారు. అప్పర్ (ప్రైమరీ పాఠశాలలు 48 ఉండగా ఉపాధ్యాయులు 33 మంది, హైస్కూళ్ళు 33 ఉండగా ఉపాధ్యాయులు 30 మంది ఉన్నారు. ప్రాథమిక స్థాయి పూర్తి చేసిన పిల్లల్లో కనీసం చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు వేయలేని పిల్లల సంఖ్య 40 శాతం ఉందంటే ఆశ్యర్యం కలగక మానదు. ఇటువంటి సంఘటనలు తల్లిదండ్రులతో పాటు పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేసి, పైతరగతులకు వెళ్ళలేమనే భావనతో బడి వదలి వెళ్ళిపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది. దేశంలో ప్రైవేటు పాఠశాలలు అధికం గా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని యునిఫైడ్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎఫ్ ఈప్లస్) నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ప్రైవేటు విద్యాసంస్థలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశా లల్లో నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించాలని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సిలబస్ రూపొందించాలని, సిలబస్ కోసం విద్యారంగ నిపుణులు, మేధావులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, వచ్చే 10, 20యేళ్లకు ఏమి అవస రం ఉంటుందో గుర్తించి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలుగు రాష్ట్రాల పాలకులు భావిస్తున్నారు.

బడి ఈడు పిల్లలం దరూ బడిలో చేరేలా చర్యలు తీసుకోవాలని, ఒక్కరు కూడా బయట ఉండటానికి వీలులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటుస్కూళ్ల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పేరెంట్, టీచర్ మీటింగ్లను నిర్వహించాలని నిర్ణయించడమే కాక కొన్ని చోట్ల ప్రారంభించారు కూడా, ఎన్ని వయత్నాలు చేసినా పెద్ద ‘సంఖ్యలో డ్రాపౌట్స్ పెరుగుతూనే ఉన్నారు. వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలల్లో చేరడానికి ఆసక్తిని కనబరుస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని లోపాలు ఆర్థిక కారణాల వల్ల కొందరు చదువును మధ్యలోనే నిలిపి వేస్తుంటే, ప్రైవేటు పాఠశాలలో విద్యాబోధన బాగుంది అని భావించిన అనేకమంది తల్లిదండ్రులు చాలీచాలని ఆదాయం ఉన్నప్పటికీ తినీ తినక వేలాది రూపాయల ఫీజు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్నీ ఉచితంగా ఇస్తున్నప్పటికీ ప్రైవేటు పాఠశాలలవైపు తల్లి
దండ్రులు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? అనే విషయమై పరిశీలకులు కొన్ని అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాలకు పెద్దపీట వేయకపోవడం, కేవలం తరగతి పుస్తకాల వరకే పరిధి నిర్దేశించడం, కొత్తదనానికి అవ కాశం ఇవ్వక కడుపులో చల్ల కదలకుండా ఉండాలని నేర్పడం. ఏదో ఒక కారణానికి భయపడి మన చరిత్రను మనమే మార్చి, తప్పుగా పిల్లలకు నేర్పడం,” ప్రశ్నించే తత్వాన్ని పిల్లలకు నేర్పకపోగా, ప్రశ్నించిన చిన్నా రులను వెధవ ప్రశ్నలు అపు అని భయపెట్టడం, కొత్త విధానాలను పరిశీలించి మన విధానాన్ని సరిదిద్దకపోవడం, చాలామంది గురువులు కేవ లం ఉద్యోగం కోసమే ఉపా ధ్యాయ వృత్తిలో చేరడం తప్ప, విద్య నేర్పాలి అనే దృక్పధం లేకపోవడం, దేశా నికి అవసరమైన చదువుల్లో తర్ఫీదు ఇవ్వకపోవడం, ఎక్కువమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు లో జవాబుదారితనం లేకపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక లోపాలను పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.

ప్రపంచం లో తొలి విశ్వవిద్యాలయాన్ని మనదేశంలోనే స్థాపించారని ఇప్ప టికీ అందరంగర్వంగా చెప్పుకుంటున్నాము. ఆస్థాయిలో కాకపో యినా నేటితరం పిల్లల ఆశయాలకు, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నారా? లేదా? అనేది పరిశీలించాలి. ఆ కారణంగానే నేడు ఉపాధ్యా యులు, తల్లిదండ్రుల సమావేశాలను ప్రభుత్వ బడులలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. తల్లిదండ్రుల ద్వారా లోపాలను తెలుగు కొని సరిదిద్దడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మార్పులు చేసి నాణ్యమైన విద్యను అందించవచ్చు. విద్యార్థి దశలోనే” నైతిక ప్రవర్తన బాగు చెయ్యలేకపోతే వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు. విపరీతమైన కర్చు తప్ప ప్రయోజనం ఉండదు. విద్యా వ్యవస్థలో మార్పు రావలసిన అవసరం ఉంది. వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్పించాలి. బాలకార్మికులను బడిలో చేర్పించడానికి ఇప్పుడు అనుసరిస్తున్న చట్టాల వల్ల సరియైన స్పందన రావడం. లేదు. అందువల్ల మంచి వ్యవస్థను తయారు చేయుటకు సలహాలు ఇస్తూ బడికి పోవల సిన పిల్లలను పనిలో పెట్టుకొని, వెట్టిచాకిరి చేయిం చుకుంటున్న వారిని కఠినంగా శిక్షించిన సంఘటనలు తక్కువగా కనిపిస్తున్నాయి. శిక్షలు పడకపోవడము వలన కొందరు పదే పదే వెట్టి చాకిరీ చేపించుకుంటున్నారు. శిక్షలు అమలు అయ్యేవిధంగా చట్టాలు కఠినంగా తెస్తూ బాలకార్మి కులను బడిలో చేర్చించుటకు ప్రతిపౌరుడూ బాధ్యత తీసుకునేలా చూడాలి.

ముఖ్యంగా ఇటుకలు తయారుచేసే బట్టిల దగ్గర తల్లిదండ్రులు పనిచేయడమే కాకుండా వారి పిల్లలను కూడా బడికి వంప కుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారు. వారి తల్లిదండ్రులతో పాటు ఇటుక బట్టీలను నిర్వహిస్తున్న యజమానులకు కూడా పిల్లలను పనిచేయకుండా చదువు కోవాలి. అని చెప్పే విధముగా అధికారులు వారిని సంప్రదించి కఠినంగా బాధ్యత తీసుకోవాలి. మౌలిక సదుపాయలు పెంచాలి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సౌకర్యాలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా మౌలిక సదుపాయాలు పెంచవలసిన అవసరం ఉంది. పలు రంగాల అభివృద్ధి విద్య తోనే ముడిపడి ఉంది. వ్యవసాయం, ఆర్ధికం, పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం ఇత్యాది రంగాలు ప్రత్యక్షంగానో, పరోక్షం గానో విద్యతోనే అనుసంధానమై ఉన్నాయి. అందువల్ల పాఠ శాల దశ నుండే చక్కటి ప్రణాళికలు రూపొందించాలి.
కార్యా చరణ అనేది సమర్థవంతంగా ఉండాలి. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరిగేలా చూడాలి. ప్రభుత్వం ఉపాధ్యాయు లకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించాలి. విద్యా వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు తగిన శిక్షణనివ్వాలి. పిల్లల నిష్పత్తికి తగిన విధంగా ఉపాధ్యాయులను భర్తీ చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు విద్యారంగానికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయిస్తూ మౌలిక వసతుల కల్పన చేయాలి. నిరంతర తనిఖీలు, పర్య వేక్షణ కోసం శాశ్వత మండల విద్యా శాఖ అధికారుల నియా మకం జరగాలి.

ప్రైవేటు పాఠశాలల్లో విద్యా బోధన ఎలా జరుగుతుందనే విషయాన్ని సి.సి. కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేరీతిలో ప్రభుత్వ పాఠశాలల్లో సి.సి. కెమెరాలు పెట్టి విద్యాబోధన ఎలా చేస్తున్నారనే విషయాన్ని అధికారులు పరిశీలించి జవాబుదారీతనం లేనివారిపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అధికారులు తమ విద్యా బోధనలోని లోపాలను గమనిస్తున్నారనే బెరుకుతో విద్యా బోధనలో మెరుగైన ఫలితాలు రావచ్చు. డ్రాపౌట్ల సంఖ్య తగ్గించడానికి స్థానిక పెద్దలు, నాయకుల సహాయం తీసుకొని పిల్లల తల్లిదం డ్రులకు విద్య విలువ తెలియజేయాలి. పిల్లల కు సకాలంలో ఉపకార వేతనాలు అందించి ప్రోత్సహించాలి. పట్టణాలతో పాటు వల్లెల్లో సైతం డిజిటల్ టెక్నాలజీతో తరగతులను నిర్వహించాలి. డ్రాపౌట్ అనేది మౌలిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలతో ప్రభావి తమై ఉంది. వీటిని పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీ కరించాలి. పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు, బడిలో అనే నినాదంతో పాటు నేను బడికి పోతాను అనే కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరు గుతున్నాయి. తెలంగాణాలో ఏటా లక్షన్నర మంది ప్రభుత్వ పాఠశాలలు మానేస్తున్నారని అనధికారిక లెక్కల ద్వారా తెలు స్తుంది. ఇదే కొనసాగితే ప్రభుత్వ బడులు మూతవేయవలసి వస్తుంది. ఇలా పాఠశాలలు మానేసిన వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందినవారే. వీరు మధ్యలోనే చదువు నిలిపివేస్తున్నారు.

డ్రాపౌట్ల సంఖ్యను తెలియజేయడానికి ఏ ప్రభుత్వం ఇష్ట పడటంలేదు. ప్రభుత్వపాఠశాలలు చాలా గొప్పగా ఉన్నాయి. ప్రైవేటు పాఠశాల లకు దీటుగా నడుస్తున్నాయంటూ గొప్పలు చెబుతుంటారు. అయినప్పటికీ అసలు నిజాలు మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియడం వల్ల విమర్శలు వెల్లువలా ముంచెత్తుతున్నాయి. విద్యా బోధనలో మార్పులు రావాలి అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడినోట్లో శని ఉన్నట్లు మనకు చాలా వనరులు ఉన్నప్పటికీ వాటిని సరిగా సద్వినియోగం చేసుకోవడంలో విఫల మవుతున్నాము. జీవితంలో వెళ్ళాక వారు బ్రతకడానికి అవసర మైన విధంగా విద్యాబోధనలో మార్పు రావాలి. విద్యాభ్యాసం చేసిన ప్రతిఒక్కరూ సంపద సృష్టికర్తలు కావాలి. ఒక దినపత్రిక వారు ఒకానొక సందర్భంలో నిత్య జీవితంలో ఉపయోగించే పది తెలుగు పదాలు చెప్పి వాటి అర్థాలు అడిగితే పాఠశాలల్లో చదివే ఒక్క విద్యార్థి కూడా చెప్పలేక పోయాడు. గడియారం చూసి సమయం ఎంత అని అడిగితే నోరెళ్ళబెట్టే పిల్లలు ఉన్నారు. ఏ సిలబస్ చదవాలి? ఏ మాధ్యమంలో చదవాలి? ఏపుస్తకాలు చదవాలి? పిల్లలకు ఏ విధంగా బోధించాలి? నేటి పాలకులకు అనుకూలంగా చరిత్రను ఎలా తిరగరాయాలి? అని మీనమేషాలు లెక్కేసుకుంటున్నారు తప్పితే అసలు పిల్లవాడికి అర్ధమవుతుందా? లేదా? నేర్చుకుంటున్నాడా? లేదా? అనే విషయాన్ని గాలికి ఒదిలేస్తున్నారు. ఒక భవనం పటిష్టంగా ఉండాలంటే పునాది గట్టిగా ఉండాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: