యోగా దినోత్సవం.. అది అంతర్జాతీయంగా, జూన్ 21న ప్రపంచ దేశాలు అన్నింటా అంతటా అదే మహోత్సవం,నవోత్సాహం. ప్రతిపాదన చేసింది మన దేశమే. అప్పట్లో దశాబ్దం కిందట ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆ సూచన రావడం, ప్రతినిధి దేశాలు అత్యధిక సంఖ్యలో మద్దతివ్వడం చారిత్రక సత్యం. అగ్రదేశాల ప్రాతినిధ్య బృందాల హర్షధ్వానాల మధ్యఅంతర్జాతీయ
దినోత్సవ’ ప్రకటన వెలువడింది.మొట్టమొదటగా దినోత్సవ నిర్వహణ 2015లో. అంటే ఇప్పుడు 2025లో ఇది దశాబ్ది సంరంభం!
జూన్ 21వ తేదీనే నిర్వహణ
ఎందుకు? ఆ రోజున పగటిపూట సమయం ఎక్కువ. ఇది జీవ పరిణామ క్రమ విశేషం. అప్పుడు సూర్యప్రకాశం ప్రత్యేకించి ఉత్తరార్ధగోళంలో లంబరూపాన ఉంటుంది. అందునా కర్కాటక రేఖకు సంబంధించి. ఊహాత్మక రేఖగా అది ప్రభావం కనబరచేది గుజరాతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాత్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో(areas)
. రేఖా పరంగా, రాశి సంబంధంగా మరికొన్ని రాష్ట్రాలు, నగరాల గుండా ఉంటుందీ పయనం. రోజుకి 24 గంటలైనా, జూన్లో ఆ తేదీన పగటివేళ సుదీర్ఘం. భాను పయనం దక్షిణ దిశన మొదలు కాబట్టి దక్షిణాయనం. అయనాంతంగా సంవత్సరంలో పొడవైన రోజు అన్నమాట. శక్తి సంపన్నతల పతాక ఆరోగ్యం, శ్రేయస్సు.. ఈ రెండింటి ఐక్య విధానమే యోగా, సూర్యుడికి(sun)
నమస్కారంతో దినోత్సవం ఆరంభమవుతుంది. యోగాభ్యాసం అనేది సాధకుడి/సాధకురాలి అంతర దృష్టి.
ఆత్మ దృక్పథం దీని పరమార్థం. కనుబొమ్మల మధ్య బిందువు దగ్గర నుదురు కేంద్రస్థానమవుతుంది. ఇదొక ఆధ్యాత్మిక నేత్రం, సత్యాన్వేషణ మార్గం. మానసిక, శారీరక ఆరోగ్య భాగ్య కీలకం. ఇంతటి ధ్యాన యోగ మూల స్థానం
మన భారతదేశమే. వేదాలతో పాటు ఉపనిషత్తులు,పురాణాలు, రామాయణ, భారత, భాగవతాదులు యోగ ప్రస్తావనతో ఉన్నవే. భక్తి, జ్ఞాన, రాజ, కర్మయోగాల సమ్మిళిత స్వరూపం. ఇంతటి నిజ శక్తి సాధనమే యోగ సారాంశం. యోగా దినోత్సవ సంకల్పం వెనుక ఇంత విస్తృత నేపథ్యముంది. సనాతన సంప్రదాయమైనా, అత్యాధునిక జీవన విధానమైనా యోగంతోనే ముడిపడి ఉంటుంది.
మార్గదర్శకం భారత్ అయితే, మిగతా అన్ని దేశాలూ అనుసరించి ఉంటున్నాయి.
ఓంకారం బిందు సంయుక్తం అంటుంది యోగమంత్రం. సూర్యాయనమః, ఆయుః ప్రజ్ఞాబలం వీర్యం తేజస్మయం, సర్వ వ్యాధి నివారం అని వివరిస్తుంది సూర్య నమస్కార స్తోత్రం. అసతోమా సద్గమయా,తమసోమా
జ్యోతిర్గమయా మృత్మోర్మా అమృతంగమయా.. అంటూ బోధ చేస్తుంది శాంతిస్తవం. శాస్త్రం, కళ.. ఆ మాటకొస్తే పరిపూర్ణ రూపం అంతా యోగాలోనే నిక్షిప్తం. అందుకే సమస్త దేశాలవారూ యోగా వైపే చూపు సారిస్తున్నారు. ప్రథమంగా అంతర్జాతీయ స్థాయి దినోత్సవం దేశరాజధాని నగరంలోని ఢిల్లీ రాజ్పఫ్లో ఏర్పాటైంది. ఆ మహానవోత్సవంలో దేశ దేశాల ప్రముఖులు పాల్గొన్నారు. ఎటువంటి
అంతరాలకూ తావులేని రీతిలో, వారూ వీరూ అనే తేడా లేకుండా అందరూ సుమారు 36,000 మంది ఆనాడుగా ఒకేసారి యోగాను నిర్వర్తించారు.
విశేషించి ప్రత్యేకించి రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను స్థాపించారు. ఎంతో గుర్తింపు, మరెంతో గౌరవం. అప్పటి 2015 మొదలు ప్రతీ సంవత్సరం ప్రపంచ యోగాదినోత్స వాలు ఏర్పాటవుతున్నాయి. రెండోది చండీగఢ్, మూడోది లబూలో(యోగా చేసినవారు అర లక్ష మంది), నాలుగోది డెహరాడూన్లో(55,000 మందికి పైగా
అభ్యాసకులు), ఐదో ఉత్సవం రాంచీలో (హాజరైనవారిలో యోగాగురువులే వేల సంఖ్యలో ఉన్నారు. అటు తర్వాత ఆరోది అప్పటి కరోనా తాకిడి కారణంగా దేశంలోని ఇళ్లల్లో కొనసాగింది. ఆయుష్ మంత్రిత్వశాఖ సూచనలు అనుసరించి అనేకానేక ప్రాంతాలవారు సాంకేతిక వేదికల ద్వారా
దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. తదుపరి పరిణామాల పరంపరలో నిరుడు జరిగింది జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో.
సందేశ వాహిని
ఈ సంవత్సరం యోగా దినోత్సవం మరెంతో విలక్షణ సంతరించుకుంది. ‘మనది ఒకే భూమి; మన ఆరోగ్యం కోసమే యోగా’ అనేది ఇప్పటి ప్రచార అంశం. యోగాతో మొత్తం ప్రపంచమంతటినీ ఆరోగ్య భాగ్యవంతంగా మార్చాలన్నది ఇందులోని ప్రధాన అర్థం. ‘ప్రతీ ఒక్కరికి ఇదొక పండుగ.
భారత్ నుంచి ప్రపంచానికి అందుతున్న అపురూప సందేశగీతిక. భవిష్యత్ తరాలన్నింటికీ ఇదే ఆశాదీపిక అని ప్రధాని నరేంద్ర మోడీ వర్ణించింది ఇందుకే.యువత మరింత ముందుకు వస్తేనే, యోగా ప్రక్రియను | దినచర్యలో భాగం చేసుకుంటేనే యోగ భారత్ సుసాధ్యం అవుతుందనడం సంపూర్ణ అక్షర సత్యం. యోగా అంటే ఏమిటి? “ఎవరి జీవితాన్ని వారు అధీనంలోకి తెచ్చుకోవడం”
అన్నారు సద్గురు. స్వేచ్ఛాపూరిత మనసు కావాలని, అనుభూతిని అందిపుచ్చుకోవాలని, దక్షతను సొంతం చేసుకోగలగాలని, సామరస్యం అనుభవానికి రావాలని హితవు పలికారు ఏనాడో, ఆరోగ్యకర జీవన శైలి, చక్కని ధ్యాస, చిక్కని శ్వాస ఎంతైనా అవసరం.
నిజానికి యోగా అన్నది మత సంప్రదాయం కాదు; తనువూ మనసూ ఆత్మబలశీలతను ఏంక చేసే మేటి సాధనం. మౌన ధ్యానం
చేయాలి. మానసిక సత్తువను సమీకరించుకోవాలి. ఏకాగ్రత పెరిగినకొద్దీ వికాసం చేరువవుతూ వస్తుంది. అలా అని అది దినోత్స వానికి పరిమితం కాకూడదు. నిత్య జీవితంలో మమేకమై ఉన్నప్పుడే యోగభాగ్యం వరించి తీరుతుందన్నది నిస్సందేహం. శాంతి సామరస్యాలకు
యోగా(2015), యువతతోనే ఆరోగ్య భారతం (2016), యోగా అంటే ఆరోగ్యమే (2017), ప్రశాంతత కోసమే యోగా దినోత్సవం (2018), వాతావరణంతోనే భోగభాగ్యాలు(2019), ఇంటా బయటా యోగా (2020).. ఇవన్నీ ప్రచార అంశాలు. అంతా బాగుండటం గురించే(2021), నవత- మానవతల
కలనేత(2022), ప్రపంచమంతా ఒకే కుటుంబం(2023), నీకూ సమాజానికీ యోగా(2024).. ఇలా విభిన్న అంశాలతో యోగా ఉత్సవం జరుగుతూ వస్తోంది యేటేటా. ధ్యానం, యోగం, సూర్య నమస్కారం అని త్రివిధ రీతుల్లో ఆచరణకొస్తోంది.
కీలక మలుపుల పరంపర
ఏది ధ్యానం? ఆలోచనలను అణచడమా! కాదు.. పరిశీలించుకుని, అవసరమైతే సరిచేసుకోవడం. ఎలా లభిస్తుంది యోగం? కాసేపు కూర్చొని ఉండటంతోనా! కాదు.. కాదు. అలా కూర్చుని వున్నంతసేపూ మనసును కేంద్రీకరించి ఉంచడం. ఏముంది సూర్యనమస్కారంలో సూర్యుడి ముందు ఉండి కొంతసేపు అధ్యయనం చేసి వెళ్లిపోవడమా? లేదు, లేదు. ఆ నమస్కారంలో శ్రద్ధ, ఏకాగ్రత, అవగాహహన మిళితమై ఉండాలి; పరిపూర్తిగా నిండాలి. అంతా ఏకీకృత సత్ప్రవర్తన. ఒత్తిడిని తగ్గించి, భావోద్వేగ తీవ్రత అదుపులోకి తెచ్చి, తనను తాను తెలుసుకోవడమే యోగను
ఆచరించడంలోని మూలసూత్రం. సృజన, పరివర్తనల కలగలుపు, సకల మానవ జీవితాలకూ
మేలుకొలుపు. ఏ దేశం వారికి అయినా ఇల ఒకటే, గగనం ఒకటే. ఏ భాషను పలికిస్తున్నా
గొంతులు ఒకటే, స్వరతంత్రులు ఒకటే. నీకూ నాకూ అందరి పుట్టుకతో చుట్టరికం ఒకటే. నువ్వూ
నేనూ, వారూ వీరూ అంతా కలిసి మనమొకటే (సిరివెన్నెల). ఈ ఏకతా సూనరతం ప్రాతిపదికగానే
యోగా దినోత్సవం విస్తారతపెంచుకుంటోంది. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. మనం
చేసే నమస్కారంలో ముఖ్యంగా ఆసనాలు ఉంటాయి.
ఇవన్నీ ఉదయంపూట ఆచరించాల్సినవి. ప్రణామం (నమస్కార ముద్ర), హస్త ఉత్థాన (రెండు చేతులనూ పైకెత్తి, శరీరాన్ని వెనక్కి వంచి,
శ్వాస పీల్చుకోవటం). పాద హస్తాసన (చేతులు రెండింటినీ కిందికి తెచ్చి, మోకాళ్లను వంపు చేసి, తలను మోకాళ్లకు తాకించడం). అశ్వసంచాలన (కుడి కాళ్లను వెనక్కి తీసుకొచ్చి, ఎడమ మోకాలు నేలకు తాకేలా చేయడం). అటు తర్వాత నడుమును పైకి లేపడం. ఇవన్నీ ఆరోగ్య సాధనలో భాగాలు. రెండు కాళ్లనీ, నేల మీద ఉంచి, నడుమును పైకెత్తడం; రెండు కాళ్లూ మోకాళ్లూ రెండు చేతులూ ఛాతీని నేల మీద ఉంచి చేసే అష్టాంగ నమస్కారం బహుళ ప్రయోజన కారకం.
నడుమును పైకి లేపి, ఛాతీని పైకి ఎత్తి, శ్వాస పీల్చుకోవడం; ఎడమ కాళ్లను వెనక్కి ఉంచి, కుడి మోకాలును నేలకు తాకించడం.. వంటివన్నీ అభ్యాస విద్యలో అంతర్లీనంగా ఉండేవే. ‘ఓం ఆదిత్య విద్మహే సహస్ర ప్రభాకరై దీర్ఘతాన్నః సూర్య ప్రచోదయాత్/ఓం సప్తరంగయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో రవిః ప్రచోదయాత్ అని కొనసాగే సూర్య గాయత్రీ మంత్రం ‘ఓం సూర్యా! సహస్రాంశో తేజోరాశీ జగపతే/కరుణాకర దేవ గృహాణాద్య నమోస్తుతే’ అనడం ద్వారా శాంతి సౌభాగ్యాలు చేరువవుతాయి మానవ హృదయానికి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో..
అంతర్జాతీయ స్థాయిన జరిగే యోగామహోత్సవానికి కౌంట్ డౌన్ అనేక ప్రాంతాల్లో ఇదివరకే ప్రారంభమైంది. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 75 రోజుల కిందటే ఆరంభించారు. యోగాంధ్ర’ పేరిట భారీ ఆచరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది.
మొత్తం రెండు కోట్ల మంది ప్రజలు భాగస్వాములయ్యేలా చేస్తున్నామని, నెల రోజులుగా పలు సంబంధిత కార్యక్రమాలు చేపట్టామనీ ప్రకటించింది.
ఇదే జూన్ 21న విశాఖ సముద్ర తీరాన జరిగే మహోత్సవానికి లక్షల మంది ప్రత్యక్షంగా హాజరవుతారని, ఏపీ వ్యాప్తంగా పల్లెలూ, పట్టణాల్లో
ఏర్పాటయ్యే సంరంభానికి మరెందరో వన్నెతెస్తారనీ తెలిపింది ప్రభుత్వం.
ఇప్పుడు యోగ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే యోగా అంటే ఆసనాలు సాధన చేయడమే అన్న భావన ఎక్కువ
మందిలో ఉంది. నిజానికి యోగా ఒక జీవన శైలి. యోగపితామహుడు పతంజలి యోగాను ఎనిమిది అంశాలుగా వర్గీకరించారు. దానినే అష్టాంగ యోగా అంటారు. 1) యమ:విలువలు పాటించడం
2) నియమః స్వీయక్రమ శిక్షణ 3) ఆసన :శారీరక వ్యాయామాలు4) ప్రాణాయామ : శ్వాసనియంత్రణ; 5)అష్టాంగ యోగిప్రత్యాహార: ఇంద్రియ నిగ్రహం; 6) ధారణ : ఏకాగ్రత; 7)ధ్యాన: మానసిక ప్రశాంతత; 8) సమాధి : సమతుల్య స్థితి. ఈఎనిమి అంశాలను జీవన శైలిగా మార్చుకుంటే జీవితం ఒకయోగం అవుతుంది. ఆరోగ్యం, ఆనందం, ఆయువు వృద్ధి చెందుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం శారీరక,మానసిక, సామాజిక సమతుల్య స్థితిని ఆరోగ్యం అంటారు. కేవలం ఎలాంటి వ్యాధులు, జబ్బులు లేకపోవడం మాత్రమే ఆరోగ్యం కాదు. శారీరక సామర్థ్యం, మానసిక దృఢత్వం, మెరుగైన సామాజిక సంబంధాలు కలిగివున్న వారినే పరిపూర్ణ
ఆరోగనయవంతులుగా చెప్పవచ్చు. ఇది జీవనశైలి, వ్యక్తిత్వం, ప్రవర్తన, ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిళ్ల నియంత్రణ లాంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఐదు వేల సంవత్సరాల క్రితం పతంజలి యోగి సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగ సూత్రాలను అందించారు. ప్రకృతి, జంతువులు, పక్షులు, ఇతర ప్రాణులను పరిశీలించి పలు అంశాలను సూత్రీకరించారు. మనిషిలోని గ్రంథులు, నాడీ వ్యవస్థ, కండరాలు, ఆలోచనలను క్రమబద్ధీకరించడానికి తగిన పద్ధతులను వెలుగులోకి తెచ్చారు. కొంతమంది ఆధునికులు భావించినట్టు యోగ అంటే ఆసనాలు, ధ్యానం మాత్రమే కాదు. ఆసనాలు సాధన చేస్తే శారీరక శక్తి సమకూరుతుంది. ధ్యానం ద్వారా మానసిక
ప్రశాంతత చేకూరుతుంది. అయితే సమతుల ఆహారం తీసుకోకుండా ఆసనాలు సాధన చేయడం వల్ల అనుకున్న ప్రయోజనం సిద్ధించదు. వ్యసనాలు, దురలవాట్లు ఉంటేశారీరక శక్తి, రోగ నిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది. ప్రతికూల ఆలోచనలు, భావాలు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. పరిసరాలు, సామాజిక పరిస్థితులు శరీరం, మనసు మీద ప్రభావం చూపుతాయి.
హార్మోన్ల అసమతుల్యత శారీరక,
మానసిక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంది. వ్యక్తిత్వం, విలువలు, ఆశలు, కోర్కెలు, ఆశయాలు, లక్ష్యాలు వ్యక్తిపై ప్రభావం చూపుతాయి. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, విశ్లేషించి ప్రయోగాలు చేసి యోగ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించారు. వీటన్నింటిని క్రోడీకరించి అష్టాంగ
యోగ సూత్రాలుగా విభజించారు. అంటే ఎనిమిది అంగాలు లేదా పద్ధతులుగా మనకు అందించారు. వీటిని యమ,నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన,సమాధి అంటారు.
యమము: యమ అంటే పాటించవలసిన అంశాలు. ఇందులో అహింస, సత్యవచనం, బ్రహ్మచర్యం, పాపరహితం, పరుల వస్తువులను ఆశించకపోవడం అనే ఐదు సూత్రాలు
ఉన్నాయి. హింసాప్రవృత్తి, అబద్ధాలు చెప్పడం, పరులతో ఆరోగ్యం సొమ్ము ఆశించడం,
విచ్చలవిడిగా తిరగడం, తప్పులు చేయడం వల్ల శరీరం, మనసు దారి తప్పుతుంది.
సమాజంలో విలువ పోతుంది. శారీరక, మానసిక రుగ్మతలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సామాజిక ధర్మాలను, విలువలను ఆచరించేవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు.
నియమము: నియమాలు అంటే ఆచరించవలసిన అంశాలు అని భావించాలి. ఇందులో శౌచం అంటే స్వచ్ఛత పాటించడం మొదటి అంశం. మనసు, వాక్కు, శరీరం స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచుకోవడం. సంతోషంగా ఉండటం రెండవ అంశం. సంతృప్తి, సానుకూల దృక్పథం, ఆశావాదం
మానవ సంబంధాల వల్ల సంతోషం మన స్వంతం అవుతుంది. తపస్సు అంటే పట్టుదల, నిరంతర కృషి, నక్రమశిక్షణ కలిగి ఉండటం ముఖ్యం. అలాగే స్వాధ్యాయ అంటే స్వీయ పరిశీలన, స్వీయ అధ్యయనం, స్వీయ నియంత్రణ అలవాటు చేసుకోవడం. ఇందులో ఆఖరి అంశం ఆధ్యాత్మిక భావన కలిగి వుండటం.
ఆసనః యోగాలో ఆసనాలు ప్రధానం. ఆసనాలు అంటే వ్యాయామ భంగిమలుగా చెప్పవచ్చు. సాధారణంగా వ్యాయామాలు కండరాల దృఢత్వానికి ఉపయోగపడతాయి. అయితే యోగాసనాలు కండరాలతో పాటు నాడీ వ్యవస్థను చైతన్యపరుస్తుంది. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత చేకూరుతుంది. రక్తప్రసరణ మెరుగు అవుతుంది. జీర్ణక్రియ చక్కగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి సమకూరుతుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆసనాలలో పద్మాసనం, వజ్రాసనం, హలాసనం, సర్వాంగాసనం, మయూరాసనం, వృక్షాసనం, పశ్చిమోత్తాసనం, శీర్షాసనం, శవాసనం లాంటివి ప్రధానంగా చెప్పవచ్చు. అన్ని ఆసనాలు
వేయలేని వారికి సులభంగా చేయడానికి వీలుగా సూర్య నమస్కారాలు రూపొందించారు.
అష్టాంగ..
ప్రాణాయామాలు: ప్రాణాయామాలు అంటే శ్వాస ప్రక్రియలు. ఇందులో శ్వాస తీసుకోవడం, శ్వాస
వుంచడం, శ్వాస వదిలిపెట్టడం అనే మూడు అంశాలు ఉంటాయి. వీటిని రేచకం, కుంభకం, పూరకం అంటారు. శరీరంలో జీవ రసాయన చర్యలు సక్రమంగా జరిగి శక్తి ఉత్పత్తి కావడానికి
తగినంత ఆక్సిజన్ అవసరం. అలాగే మెదడు చురుగ్గా పని చేయడంలో ఆక్సిజన్ ప్రధాన
పాత్ర పోషిస్తుంది. ప్రాణాయామాలలో సూర్యభేద, శీతలీ, భస్త్రిక, భ్రామరి, విలోమ అనులోమ,
కపాలభాతి ముఖ్యమైనవి. ప్రాణాయామాల వల్ల శారీరక శక్తి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ప్రత్యాహారం: ప్రత్యాహారం అంటే ఇంద్రియాల నుండి మనసును మరల్చడం. మనస్సు చలించకుండా నియంత్రించడం, ఆత్మజ్ఞానం కలిగి వుండటం, కర్మఫల త్యాగం, ఆశ లేకుండా ఉండటం, నిగ్రహం ప్రధాన అంశాలు. అంటే వాస్తవిక దృక్పథం అలవర్చుకుని మనసును
నియంత్రించుకోవడం.
ధారణ: ధారణ అంటే ఏకాగ్రత సాధించడం. మనస్సును చేసే పనిపై లగ్నం చేయడం. సాధారణంగా ఏకాగ్రత ఒక అలవాటుగా చెప్పవచ్చు. అవసరం గుర్తించి, లక్ష్యసాధనపై
దృష్టి పెట్టి, మనసును నియంత్రించుకుంటే ఏకాగ్రత . చేకూరుతుంది. ఏకాగ్రత వల్ల విషయ పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ధ్యానం: ధ్యానం అంటే మనసును ప్రశాంతంగా ఉంచడం ఆలోచనలను వీలైనంతవరకు నియంత్రించడం. చక్కని శ్వాస క్రియల ద్వారా మనసును చైతన్యపరచడం. ధ్యానం
చేయడంలో చాలా పద్ధతులు ఉన్నాయి. అయితే సుఖాసనంలో, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని కళ్లు మూసుకుని, నక్రమబద్దంగా శ్వాస తీసుకోవడం ప్రధానం. ధ్యానం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
సమాధి: సమాధి స్థితి అంటే మానసిక సమతుల్య స్థితి అని అర్థం. ఒక విధంగా చెప్పాలంటే స్థిత
ప్రజ్ఞత సాధించడం. ఇదొక అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి. యోగ అంటే ఒక జీవన విధానం అని గుర్తించాలి. సానుకూల జీవనశైలి అలవర్చుకుంటే ఆరోగ్యం, ఆయుష్షు, సంతోషం మన స్వంతం అవుతుంది. అష్టాంగాలు ఆచరిస్తే జీవన యోగం సిద్ధిస్తుంది.
ఇందుకోసమే గ్రామ, వార్డు స్థాయిల నుంచి మాస్టర్ట్రైనర్లకు శిక్షణ. అంతా కలిపి వంద పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో 21నే ఉత్సవనం. అన్ని జిల్లాల్లోనూ యోగా ప్రదర్శనలూ, పోటీలూ, ఇతర కార్యక్రమాలు, సామూహికంగా యోగాభ్యాసాలు. మరింత ప్రధానంగా ప్రాణాయామం! పద్మాసనంలో కూర్చుని, బంగా ఊపిరి పీల్చుకునే భస్త్రిక. గాలిని నెమ్మదిగా లోపలికి చేర్చే కపాలభాతి. ఉదర
కండరాలను వేంగా కదిలిస్తూ, శబ్దపూర్వకంగా గాలిని బయటకు వదలడం. ఒకసారికి ఓ నాసికా రంధ్రాన్ని మాత్రమే ఉపయోగించే అనులోమ విలోమ పద్ధతి. పద్మాసనంతో పాటు కళ్లు మూసుకుని, ఎడమ ముక్కు రంధ్రాన్ని ఎడమ బొటన వేలితో మూసి వుంచే ప్రక్రియ… కుడి నాసికా రంధ్రం రూపేణా నెమ్మదిగా గాలి పీల్చడం. ఇదే తీరులో ప్రాణాయామ సాధన కొనసాగించడమే యోగాకి సంబంధించిన విశేషం.
ముక్కు రెండు రంధ్రాలతోనూ గాలి పీల్చుకోవడం బాహ్యరూపం. అందువల్ల ఊపిరితిత్తులకు తోడు ఉదర భాగాన గాలి నిండిన అనుభూతి కలుగుతుంది. అలాగే కొంతసేపు ఊపిరిని బిగబట్టి ఉంచి, తలను పైకి లేపుతూ, శ్వాస తీసుకోవడం ఆరోగ్య యోగత్వాన్ని సులభ సాధ్యంగా సమకూరుస్తుంది. ఇక ప్రాణముద్ర ఉండనే ఉంది. ఎవరి స్వల్ప రుగ్మతలను వారే సరిదిద్దుకునే తీరు, అలసటతో నిండిన శరీరానికి ఈ చేతివేళ్ల ముద్ర వినూత్న తేజస్సు నిస్తుంది. దాశరథి అలనాడే అన్నట్లు “బిందువు సింధువగును, ధ్యేయమును బట్టి ప్రతీ పని దివ్యమగును”. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా. కనుక అదే స్ఫూర్తితత్వాన్ని అందిపుచ్చుకుంటానంటోంది తెలంగాణ. సర్వత్రా ప్రశాంతత పెంచేందుకు యోగా దోహదకారి అని వన్ ఎర్త్ వన్ హెల్త్’ సాధక సమావేశాలతో ప్రాచుర్యం కలిగించింది ప్రభుత్వం. వ్యాస, వక్తృత్వ, పోస్టర్ డిజైన్ పోటీల మూలంగా వేలాది విద్యార్థులను ఆకట్టుకుంటోంది. యోగా
గర్వకారణమంటే చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ పోటీల నిర్వహణనూ చేపట్టింది. ఆరోగ్య భాగ్యమే పరమ లక్ష్యంగా ప్రతిజ్ఞలు చేయిస్తోంది. వివిధ వృత్తులు, ప్రవృత్తుల వారిని ఏకోన్ముఖం చేయడం ద్వారా ఉత్సవ శోభను పరిపోషిస్తోంది.
బహుళార్థ సాధకం
మారుమూల పల్లెల వారికీ చేరువవుతోంది యోగా. ఆయుష్వి భాగం ఇదివరకే తెలంగాణ ప్రాంతాల్లో శిక్షకులను నియమించింది. పట్టణాల్లోనూ, చికిత్సా లయాల్లో వనరులు కలిగించి, స్థానికులకు ఆసనాలు నేర్పిస్తోంది నిర్వాహక వ్యవస్థ.ఆరోగ్య మందిరలో భాగంగా కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్
పథకం ముందుగా మొదలైంది తెలంగాణలోనే! ఆయా నిలయాల దగ్గర యోగా గురించే షెడ్లు నిర్మితమయ్యాయి. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సైతం తరగతులు నడుపుతున్నారు. చిన్న వయసు నుంచే యోగ ఆరోగ్యానికి ముందుకు వచ్చేలా బాలలను తీర్చిదిద్దుతున్నారు. అంతటా
యోగోత్సాహం వెల్లివిరిసేలా చేస్తున్నారు.
కార్యాచరణలో ముందుంటున్నారు. నవజీవన వికాసానికి మారుపేరు యోగాక్రియ. ఇందులో ఉన్న వజ్రాసనం శరీర దృఢత్వాన్ని పెంచి తీరుతుంది. పేరులోనే ఉన్నట్లు. మనిషిని అది వజ్రసమానంగా మలుస్తుంది. మరో మాటలో- ప్రయోజనాల నిధి. జీర్ణ విధాన మెరుగుదల, కటికండరాలను బలవత్తరం చేయటం, వెన్నునొప్పి నుంచి ఉపశమనం, అపూర్వ స్వస్థత, మేలైన రీతిలో రక్తప్రసరణ, ఇంకెన్నెన్నో ఉపయోగాలు
సిద్ధిస్తాయి నమ్మినవారికి. అధిక రక్తపోటు నియంత్రణ, నిబ్బరం పెంపుదల వంటివి యోగ శిక్షణ పొందిన వారికి లభ్యమవుతున్నాయి. దీనినే కవిత్వ పరిభాషలో వ్యక్తపరచాలంటే ‘వర్షం వస్తే.. భూమిలో ఉన్న చిన్నారి గింజ/మెడ బయట పెట్టి మొదట వచ్చిన రెండాకులను/చేతులుగా జోడించింది కృతజ్ఞతతో.
‘వసంతాలు వస్తుంటాయి, పోతుంటాయి.
చైత్రాలు రానూ వస్తాయ, వెళ్లనూ వెళ్లిపోతాయి.
బక్క పువ్వెడు వసంతం కోసం
చెట్లు ఆకుల్ని రాల్చుకుంటున్నాయి
ఆశల ఆశయాల లోకంలో కాంతిరేఖలా నిలిచేది యోగా గురించిన అనురక్తే! ప్రజలందరూ యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలంది హరియాణా, కళింగా స్టేడియంలో ముందుగానే ఉత్సవ నిర్వహణకు శ్రీకారం పలికింది ఒడిశా. ఇదివరకు ఉత్తరప్రదేశ్ వేదికగా సాగిన యోగా దినోత్సవం సభకు ప్రధాని మోడీ, ఢిల్లీలోని సదస్సుకు నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రత్యేక అతిథులు. మై లైఫ్ మై యోగా పోటీకి మునుపు 130 దేశాల నుంచి ఎంట్రీలు వచ్చాయి. అదేవిధంగా రెండేళ్లనాడు ఐరాస ప్రధాన కార్యాలయం న్యూయార్క్ దానితో పాటు జబల్పూర్ వద్ద
దినోత్స వాల్లో పాల్గొన్నవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు.
చండీగఢ్, మైసూరు, సూరత్ తదితర ప్రాంతాల్లో యోగా దినోత్సవం వాడుకగా.. వేడుకగా సాగి ఎందరెందరి దృష్టినో ఆకర్షించింది. ప్రకృతి హితకారకం, చరాచర జీవకోటికీ భవ పూరకం. ప్రతీ ప్రాణినీ సౌహార్ద్రంగా ఆహ్వానిస్తుంది. ఎంతగానో సమాదరించి అలరిస్తుంది. అంత చేసినా ఏ
ఒక్కనాడూ ప్రతిఫలాన్ని ఆశించదు. తరువులు, పూలు, మేఘాలు, మెరుపులు, నదీనదాలు,
చూడనంత! ప్రతివారికీ ఉరుకులూ.. గిరులూ, ఝరులూ.. పరుగులూ! ఒక్కో చుక్కగా రాలే
ఇవన్నీ ప్రకృతితత్వం సుఖశాంతులు బిందువులను దోసిళ్లతో రూపాలే మరి. నింపుకొని ఉండాలంటే నిత్య జీవన అందువల్లనే ప్రాకృతిక ధర్మంగా యోగాభ్యాసాన్ని సంపత్తిని స్వీకరించాల్సిందే! అదే అత్యవసరం. ప్రస్తుతించాయి.. కవి స్వరం పలవరించినట్లు ‘యువ’
వేదాలకు తోడు అన్నీ! అంటే కంఠంలో రాగం, గమనంలో ఇటువంటి పూర్ణ ప్రకృతిలోనిదే యోగా.
భారతీయతకు సిసలైన ప్రతీక.
అనుసంధానం, నిత్యావసరం ఇదే!
అంతర్జాతీయ దినోత్స వమూ యువ అసలు యోగా అనేది కేవలం వ్యాయామం కాదు. ప్రపంచాన్నీ, ప్రకృతినీ మనిషితో అనుసంధానం చేసేది అదే. సమృద్ధ (సంపన్న), స్వస్థ
(ఆరోగ్యదాయక), సౌభాగ్య భారతానికి దీపమాలిక. ‘మనసా.. తెలుసా’ అన్నట్లు ఉంటోంది నేటి జీవిత యాత్ర. ఆరాటం ఎంత అంటే- ముందు ఏముందో ఆశలను ప్రతిఫలిస్తోంది. ఆలోచనల
స్థానాన్ని ఆచరణలు పూరిస్తే, ఒడుపూ మలుపూ సంపూర్తిగా తెలిసివస్తే- ఆసేతు హిమాచలం ఐక్యభావ సందీప్తం’. సమైక్యత, సమగ్రతల సురూపమైన ఈ దినోత్స వాన్ని మహదానందంగా మనం స్వాగతిద్దాం! ఎవరికి వారే శక్తికేంద్రం. సరిగ్గా తెలిసి మసలితే అదే అదే యుగోదయం.
Read also:hindi.vaartha.com
Read also: