మేధావుల మౌనం దేశానికి శాపం’ అనే మాట అక్షర సత్యం. ఎప్పుడో ఎవరో గొంతు నుండి వెలువడిన ఈ సత్యం నేటి వ్యవస్థపై అనేక ప్రశ్నలను సంధిస్తున్నది. మౌనం అంగీకారసూచకం అంటారు. మౌనం ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్న సంద్రంగా కొంతమంది ఉద్ఘాటిస్తారు. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు గారి ‘నా గొడవ’ అనే కవితా సంకలనం ఒక నినాదంగా ఉద్యమించింది.
‘నా గొడవ’ ప్రజలందరి గొడవగా, ఒక ఉద్యమ రూపం సంతరించుకున్న విషయం విదితమే. కాళోజీ స్వరం అన్యాయాలపై, అరాచకాలపై సంధించిన శరంలా మారింది. ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిదన్న’ కాళోజీ గళం ఒక గర్జనలా మారి ప్రజలకు బాసటగా నిలిచింది. ప్రజల్లో చైతన్య స్ఫూర్తి రగిలించింది. మనిషి తనను తాను నిర్మించుకోవాలని, ఊహాజనితమైన శక్తులకు ప్రభావితం కాకూడదని జర్మనీకి చెందిన తత్వవేత్త ఫ్రెడరిక్ నీటే ఉద్భోదించాడు.
“ఇతరులను నమ్మడం కంటే తనను తాను నమ్ముకోవడమే ఉత్తమం. ఇతరులను నమ్మితే అధోగతే” అన్న సత్యం తెలుసుకోవడం అత్యంత శ్రేయస్కరం. నీతికి స్థానం వర్తమానంలో అన్యాయాలపై ఎదురించి పోరాటం చేయడమే మార్కెట్ మాయలో జనం విలవిల ఉత్తమం. ఈ ప్రయత్నంలో
చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. ఓటమి పాలైతే రేపటికి అది గుణపాఠంలా మారుతుంది. వర్తమాన వ్యవస్థలో నిజమైన పోరాట పటిమ ప్రదర్శించి, అంకిత భావంతో పని చేసినా ఫలితం కనిపించకపోగా విమర్శలకు, ఈసడింపులకు గురైతే నిస్సహాయత ఆవహించక తప్పదు. అడుగడుగునా అవినీతే తాండవిస్తున్న నేపథ్యంలో చేతి చమురు విదిలిస్తేనే సకల కార్యాలు నెరవేరుతున్న వాస్తవ పరిస్థితులను కప్పిపుచ్చలేం.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచమంతా రెక్కలు. చాసింది. సాంకేతిక పరిజ్ఞానం సాయం లేకుండా పూట గడవని రోజులొచ్చాయి. రోడ్డు, రవాణా సౌకర్యాలు పెరిగాయి. పూర్వ కాలంలో వస్తువుల రవాణా, విదేశీ ప్రయాణాలు సముద్ర (sea) మార్గం గుండా నౌకల ద్వారా కొనసాగింది. ఇప్పటికీ ప్రపంచ వాణిజ్యానికి సముద్ర మార్గాలు, నౌకలే కీలకం. కుగ్రామాలు సైతం సాంకేతిక విప్లవ పరిణామాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. వంద సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా 200 కోట్లు, 50 సంవత్సరాల క్రితం సుమారు 400 కోట్లు, ప్రస్తుత జనాభా(population) 800 కోట్లు దాటింది. జనాభా గణనీయంగా పెరిగింది. పెరిగిన జనాభాకు సరిపడా ఆహారం అవసరం.
విజయం సాధిస్తే
నదుల వద్ద నాగరికత వెల్లి విరిసింది. పంటపొలాలు బతుకునిచ్చాయి. ఆకలిని తీర్చాయి. వర్తమాన ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవించాయి. చమురు కోసం పోరాటం, గుప్తమైన ఖనిజాల కోసం భూగర్భంలో నిక్షి ఆరాటం, ఆయుధాల కోసం ఒప్పందాలు జరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో చరిత్ర గతులను మార్చాలనే ఉత్సుకత పెరిగింది. ఎన్నో ఆవిష్కరణలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి. సూపర్ కంప్యూటర్ నుండి క్వాంటం కంప్యూటర్ల వరకు ప్రపంచం పరివర్తన చెందింది. టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్నది.
ఆయుధాలు, అణ్వాయుధాలు యుద్ధాలకు దారితీస్తున్నాయి. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి స్థానాన్ని రోబోలకు అప్పగిస్తున్నది. కేవలం డబ్బు సంపాదించాలనే ఏకైక ధ్యేయం ప్రపంచాన్ని అధోగతి వైపు నెడుతున్నది. ప్రపంచ గమనంలో వస్తున్న మార్పులన్నీ కొత్త నీరొచ్చి, పాత నీటిని ఆవలికి గెంటుతున్నట్టుగా ఉంది. భువనాన్ని శాసించాలని కొందరు, గగనంలో తిష్టవేయాలని మరికొందరు, రోదసీలో విహరించాలని మరికొందరు,
చంద్రుడిపై నివాసం కోసం కొంతమంది, సూర్యునిపై పరిశోధనలు చేయడానికి ఇంకొంత మంది పోటీ పడుతున్నారు. నిరంతర పరిశోధనలతో వినూత్న ఆవిష్కరణలను ప్రపంచానికందిస్తూ తమ చరిత్రను పదిల పరచుకోవాలనే కీర్తి కండూతీతో ఆధునిక యువతరం భవిష్య పరిణామాలను ఆలోచించడంలేదు. సాంకేతిక ప్రపంచం ఏ కారణం చేతనైనా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం మొదలు పెడితే ప్రపంచమే స్తంభించిపోయే అవకాశముంది.
కొవిడ్ సమయంలో ఏం జరిగిందో మనం చూసాం. ఆ పరిస్థితులను అనుభవించాం. తిండి లేక అలమటిస్తూ హాహాకారాలు చేసి, కొవిడ్తో చనిపోయిన వారి శవాల గుట్టలు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగామా? గుప్పెడు మెతుకులు దొరక్క మంచినీటితో దాహార్తిని తీర్చుకున్న నాటి అసహాయుల ఆర్తనాదాలు వినలేదా? నాడు జేబునిండా డబ్బున్నా తినడానికి తిండి దొరక్క రోదించిన వారి కన్నీళ్లు చెప్పిన పాఠాలేమిటి? ధనిక, పేద తారతమ్యం మరచి, రోడ్లపై గీసిన గీతలపై క్యూ లైన్లలో నిలబడి నిత్యావసర వస్తువుల కోసం పడిగాపులు పడిన నాటి చేదు అనుభవాలు చెప్పిన సత్యాలేమిటి? వాటి నుండి మనం నేర్చుకున్న గుణపాఠాలేమిటి? ప్రపంచమెంత ముందుకు పరుగెత్తినా, మనిషి ఆలోచనలు ఎన్ని అద్భుతాలను సృష్టించినా కూటి కోసమే కోటి విద్యలన్న పెద్దల మాట యథార్థం. ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైనది ఆకలి.
క్షుద్బాధ తీరిన తర్వాత కూడా తరతరాలకు తరగని సంపదను దోచి, దాచి పెట్టాలన్న స్వార్ధ చింతన ఆక్షేపణీయం. కూటి కోసం జీవించే మనం, ఎంత సంపాదించినా, చివరకు అంతా కాటికి పోవలసిందే. శాస్త్ర సాంకేతిక పరంగా ఎన్ని మార్పులొచ్చిలా, భువన గగనాలపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించినా తినడానికి గుప్పెడు మెతుకులు లేని పరిస్థితులు దాపురించిననాడు, ప్రజలకు నిత్యావసర వస్తువులు అందని ద్రాక్షలా, ఆటాడుకున్నప్పుడు ఆహార భద్రత ప్రశ్నార్ధకమైననాడు మనం సృష్టించుకున్న కృత్రిమ వ్యవస్థలన్నీ కుప్పకూలక తప్పవు. మనం సాధించిన అభివృద్ధి అక్కరకు రాదు. అధునాతన సాంకేతిక ప్రపంచం ఆకలితో అలమటించక తప్పదు. మానవుడు జీవించడానికి గాలి, నీరు ఎంత అవసరమో, ఆకలి తీర్చుకోవడానికి ఆహారం కూడా అంతే అవసరం.
ఆహారం విభిన్న రకాలుగా ఉండవచ్చు. కానీ ఆకలి మాత్రం అందరికీ ఒకటే విధంగా ఉంటుంది. ఈ సమస్త సృష్టిలో అద్భుతమైన మేధస్సు గల మానవుడు ఇతర జీవరాశుల జీవన విధానానికి భిన్నమైన పద్ధతులను నేర్చుకుని, నాణ్యమైన, భద్రమైన జీవన ప్రమాణాలతో ఈ ధరిత్రిపై అత్యధిక కాలం మనగలుగుతున్నాడు. మనుగడ సాగించగలుగుతున్నాడు. మనిషి పోయేవరకు ఆకలి పోదు. నియంతలు ప్రజలను శాసిస్తే ఆకలి ఆ నియంతలను కూడా శాసిస్తుంది. అదే ఆకలి గొప్పదనం. అందుకే ప్రజలు ఆకలితో అలమటించ కుండా వారి ఆకలిని తీర్చే నిత్య జీవితావసరాల కోసం ప్రభుత్వాలు ప్రయత్నించడం సమంజసం. వ్యవసాయం ప్రజల ఆకలి తీర్చడానికి అత్యంత అవసరం. కాబట్టి వ్యవసాయాన్ని అనుకూలంగా, లాభసాటిగా మార్చుకోవాలి. నిత్యావసర వస్తువులను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంచాలి. జన జీవనానికి సంబంధించిన ప్రాథమిక అవసరాలను తీర్చే వివిధ రకాల ఆహార పదార్థాలు, ఔషధాలు, ఇంధనాలు మొదలైన వాటిని నిత్యావసర వస్తువులుగా
ఒక్కో దేశంలో, ఒక్కో ప్రాంతంలో ఆహారపు అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని చోట్ల బియ్యాన్ని ఆహారంగా ఉపయోగిస్తే, మరికొన్ని చోట్ల గోధుమలను ముఖ్యమైన ఆహారంగా స్వీకరిస్తారు. కొన్ని చోట్ల కొంతమంది ఆకుకూరలు, కూరగాయలు వంటి శాకాహారాన్ని భుజిస్తే. మరికొన్ని చోట్ల జంతువుల మాంసాన్ని భుజిస్తారు, ఇంకొన్ని చోట్ల శాకాహారంతో పాటు, మాంసాహారాన్ని కూడా భుజించడం అలవాటు. భారతదేశం వంటి ఉష్ణ ప్రాంతాల్లో ఆహారపుటలవాట్లు ఒక విధంగా ఉంటే, కెనడా, రష్యా వంటి శీతల దేశాల్లో ఆహారపుటలవాట్లు మరో విధంగా ఉంటాయి. వాతావరణానికి అనుగుణంగా ప్రజల ఆహారపుటలవాట్లు, జీవన శైలి ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో దక్షిణాది, ఉత్తరాది ప్రజల ఆహారపు అలవాట్లలో వ్యత్యాసముంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తినే ఆహారంలో వైవిధ్యం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ క్షుద్బాధను తీర్చుకోవడానికి ప్రతీ జీవికి ఆహారం అవసరం. ఆహారం నిత్యావసరం. ఇతర జీవరాశులకు, మానవులకు ఆహారపు అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి.
కొన్ని జంతువులు ఇతర జంతువులను సంహరించి, వాటి ఆకలిని తీర్చుకుంటుంటే, మరికొన్ని జీవరాశులు ఇతర జీవరాశులపై ఆధారపడి జీవించడం ప్రకృతి ధర్మంగా పేర్కొనడం జరుగుతున్నది. ఆదిమానవుడు అడవుల్లో జీవిస్తూ, జంతువులను వేటాడి పచ్చి మాంసాన్ని భుజిస్తే, ఆధునిక మానవుడు నాగరికత అలవరచుకుని నేర్పుగా వంట చేయడం నేర్చుకుని, రాబోయే కాలానికి లోటు లేకుండా తమ అవసరాలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతున్నాడు. తాగడానికి పరిశుభ్రమైన నీరు, నివసించడానికి అనువైన గృహాలు, దుస్తులు, తినడానికి అనువైన ఆహార పదార్థాలు నిత్యావసరాలుగా పేర్కొనవచ్చు. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా నిత్యావసరాల్లో కూడా మరికొన్ని అంశాలు చేర్చబడ్డాయి. విద్య, వైద్యం, ఆరోగ్య సంబంధిత అంశాలు కూడా జన జీవితానికి ఆవశ్యకం కాబట్టి ఇవి కూడా ప్రాథమిక మౌలిక సదుపాయాలుగా, నిత్యావసరాలుగా భావించడం జరుగుతున్నది.
భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం. 140 కోట్ల జనాభా గల దేశంలో 3.3 మిలియన్ చదరపు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల భూభాగముంది. అమెరికా, కెనడా, చైనాలు భారత్ కంటే సుమారు మూడు రెట్లు అధిక భూభాగం కలిగి ఉన్నాయి. రష్యా భారత్ కంటే సుమారు ఆరు రెట్ల అధిక భూ విస్తీర్ణం కలిగి ఉంది. అయితే చైనా భూభుగంలో కేవలం 10 శాతం మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. కెనడాలో కేవలం 2 శాతం మంది రైతులు మాత్రమే వ్యవసాయం చేస్తారు.
వాతావరణ మార్పులు వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపడం ఆధునిక సాంకేతిక యంత్ర పరికరాలను వినియోగించడానికి రైతుల ఆర్ధిక స్థోమత సరిపోకపోవడం, ప్రభుత్వంపై సబ్సిడీ భారం పెరగడం కెనడాలో వ్యవసాయం తగ్గుముఖం పట్టడానికి కారణం. భారతదేశంలో రైతులు తరచూ ఆర్థిక ఒడిదుడుకులకు లోనతున్నారు. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడమే ఇందుకు కారణం. కొన్ని దేశాలతో పోల్చితే వ్యవసాయ కూలీల వేతనం భారతదేశంలో చాలా స్వల్పమనే చెప్పాలి. అయినప్పటికీ రైతులు ఈ భారాన్ని కూడా మోయలేకపోవడానికి గల కారణాలెన్నో. వ్యవసాయం తగ్గుముఖం పట్టడం, యువత ఉద్యోగాల్లో స్థిరపడడం
వలన భారత్ భవిష్యత్తులో ఆహార సమస్యను ఎదుర్కొనే అవకాశముంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. వ్యవసాయం చేసే రైతులు ఆర్థికంగా చితికిపోతున్నా, వినియోగదారులకు మాత్రం మార్కెట్లో ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. పంటచేలో లేని ధరలు లు బయట మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఎందుకు పెరుగుతున్నాయో ఊహించడం కష్టమేమీ కాదు. దళారుల దందా, మార్కెట్ మాయాజాలం అన్నదాతల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆత్మహత్యల వైపు అడుగులు వేయిస్తున్నాయి.
భారతదేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణాలు
భారత్ తో పాటు ఏ దేశంలోనైనా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ద్రవ్యోల్బణం పెరగడం ప్రధాన కారణం. ద్రవ్యోల్బణ సమస్య కారణంగా భారత్లోని పలు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దయనీయంగా మారడం, పలు కారణాల వలన సప్లై చైన్స్ లో ఆటంకాలు ఏర్పడడం, ప్రజల జీవన ప్రమాణాలు దిగజారడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం, దళారుల దగాకోరు దోపిడీ విధానాలు, స్వార్థం, అవినీతి, అక్రమంగా నిత్యావసర వస్తువులను వేరే చోటుకి తరలించడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి అనైతిక చర్యల వలన భారతదేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది కేరళలో ద్రవ్యోల్బణం రేటు 6.71 శాతంగా నమోదైనది. ఈ కారణం వల్లనే కేరళలో నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉన్నాయి. కేరళ తర్వాత లక్షద్వీప్, గోవా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, అరుణాచల ప్రదేశ్, హర్యానా, మిజోరం, హిమాచల ప్రదేశ్ లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ఇన్ప్లేషన్ వలన ఈ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.
భారతదేశంలో ఈ సంవత్సరం మే నెలలో ఇన్ప్లేషన్ రేటు కొంత తగ్గుముఖం పట్టి జూన్ నాటికి 1.72 శాతంగా నమోదైనట్టు కొన్ని గణాంకాల వలన తెలుస్తున్నది. నిత్యావసర వస్తువుల ధరలు దేశంలో గతంలో కంటే తగ్గుముఖం పట్టడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి.
గత మే నెల నాటికి ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి వచ్చాయని, ద్రవ్యోల్బణం 14 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్నట్టు రెండు నెలల క్రితం కేంద్రం ప్రకటించింది. 2026వ ఆర్థిక సంవత్సరం నాటికి భారత దేశంలో ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందని, దీనివలన ప్రజలకు అన్ని రకాల కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు చౌక ధరలకే లభించే అవకాశముందనే సూచనలు కనిపిస్తున్నాయి.
క్షీణిస్తున్న భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు ప్రజలపై ప్రభావం
భారతదేశం రష్యాతో సన్నిహిత వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉండడంతో రష్యా నుండి చౌకగా చమురును దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వలన ఏర్పడిన విపత్కర పరిణామాలతో తీవ్ర ఇంధన సంక్షోభాన్ని చవిచూసింది. అయితే రష్యాతో భారత్ కున్న చిరకాల మైత్రి వలన రష్యా చమురు దిగుమతుల వలన భారత్ ఇంధన రంగంలో సురక్షితమైన స్థానంలోనే ఉంది. ఆర్థిక మాంద్యంలోను భారత్ నాల్గవ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు రుచించడం లేదు. భారత్ చర్యల వలనే రష్యా ఆర్థికంగా పుంజుకుని, ఉక్రెయిన్పై సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తున్నదని, ఇందుకు ప్రతీకారంగా అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ వస్తువులపై 25 శాతం సుంకాలను విధించడమే కాకుండా, రష్యా నుండి చమురును, ఆయుధాలను దిగుమతి చేసుకుంటే మరిన్ని వాణిజ్య పరమైన ఆంక్షలను భారత్పై విధిస్తానని ట్రంప్ హెచ్చరించడం వలన భారతదేశం ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో వేచి చూడాలి. భారత్ వలన లాభపడుతున్న అమెరికా ఉచ్ఛనీచాలు మరచి, భారత్ను మృత ఆర్థిక వ్యవస్థగా పేర్కొనడం ఆక్షేపణీయం. అమెరికా ఆంక్షలతో భారత్లో ఇంధన రంగం కుదేలైతే రవాణాపై కూడా అధిక భారం పడుతుంది. దీని వలన నిత్యావసర సరుకుల రవాణాపై పెను ప్రభావం పడుతుంది. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే ఆ భారం మోయడం సాధ్యమా?
నిత్యావసర వస్తువుల చట్టం
1955 నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం భారత ప్రభుత్వం 2007 ఫిబ్రవరి 12వ తేదీన నిత్యావసర వస్తువుల జాబితాలో మరికొన్ని వస్తువులను చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ జాబితా ప్రకారం పండ్లు, కూరగాయలకు సంబంధించిన విత్తనాలను, ధాన్యం, పశుగ్రాసానికి సంబంధించిన విత్తనాలను నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చడం జరిగింది. ఎరువులు, ఔషధాలు, పెట్రోలియం ఉత్పత్తులు కూడా నిత్యావసర వస్తువుల జాబితాలోకి వస్తాయి. 1955 ఇసి ఏక్ట్ లోని కొన్ని సెక్షన్లు నిత్యావసర వస్తువులపై ప్రభుత్వానికి కొన్ని అధికారాలను దఖలు పరచాయి. నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వంటి విషయాల్లో పలు నిబంధనలను చేర్చడం జరిగింది.
నిత్యావసర వస్తువుల నిల్వలపై పరిమితులు విధించడం జరిగింది. ధరల పెరుగుదలను నివారించడానికి, నల్ల బజార్లకు తరలించి కృత్రిమ కొరత సృష్టించే వారిని శిక్షించడానికి చర్యలు తీసుకోబడుతున్నాయి. 1980వ సంవత్సరం నుండి అన్ని రాష్ట్రాల్లోను బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణ చట్టం అమల్లో ఉంది. 1955 నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, నేరస్తులను శిక్షించే అధికారం సంబంధిత అధికారులకుంది.
1966, 1967, 1968, 1970 లలో ఆహార మంత్రిత్వ శాఖ చెరకు, చక్కెర నియంత్రణ కోసం సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రజా ప్రయోజనాల కోసం ఈ సవరణలు తదుపరి సంవత్సరాల్లో కూడా కొనసాగుతున్నాయి. 1955 ‘ఎసెన్షియల్ కమ్మోడిటీస్ ఏక్ట్ అసంబద్ధంగా ఉందనే వాదనలున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడం, ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి అమలు జరిపే సుదీర్ఘ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి.
స్వాతంత్ర్యానికి పూర్వమే భారతదేశంలో నిత్యావసర వస్తువుల చట్టం అమల్లో ఉంది. 1939 నాటి బూజు పట్టిన చట్టాన్ని 1946లో రద్దు చేయడం జరిగింది. స్వాతంత్ర్యానంతరం అనేక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఇసి ఏక్ట్ పలు మార్పులు చేసి 1955లో సరికొత్త చట్టం చేసినా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సవరణలు జరుగుతూనే ఉన్నాయి.
నిత్యావసర వస్తువుల చట్టం-శిక్షలు జరిమానాలు
1955 నిత్యావసర వస్తువుల చట్టంలోని సెక్షన్ 3 కింద జారీ చేయబడిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఆ చట్టంలోని
సెక్షన్ 7 ద్వారా శిక్షలను విధించవచ్చు. సెక్షన్ 7 అక్రమంగా నిత్యావసర వస్తువులను దారి మళ్లించే వాహనాలను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులకు సెక్షన్ 3లోని వివిధ క్లాజుల ప్రకారం సంవత్సరం నుండి మూడేళ్ల వరకు జైలు శిక్ష/జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. సెక్షన్ 7(1), సెక్షన్ 7 (2), 7(3)లు చట్ట ఉల్లంఘనకు సంబంధించిన పలు రకాల శిక్షలను సూచిస్తున్నాయి.
నిత్యావసర వస్తువుల చట్టం, వినియోగ దారుల చట్టాలు
నిత్యావసర వస్తువుల చట్టం, వినియోగ దారుల చట్టాలు, వినియోగదారుల చట్టాలు ఒకటేనా? అనే మీమాంస సగటు పౌరుల్లో కలగడం సహజం. ఎందుకంటే నిత్యావసర వస్తువులను కొనే వ్యక్తులు కూడా వినియోగదారులే కనుక. ఉభయ చట్టాల లక్ష్యం ఒకటే కనుక. వినియోగదారుల చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టాలు ఒకటే కావచ్చునన్న సందేహం కలగడంలో ఆశ్చర్యం లేదు. వస్తు, సేవలను కొనుగోలు చేసి, వినియోగించే వ్యక్తులను వినియోగదారులుగా నిర్వచిస్తారు.
నిత్యావసర వస్తువుల చట్టాలు, వినియోగదారుల హక్కుల చట్టాలు ఒకటి కాదు. వీటికి వేర్వేరు యంత్రాంగాలున్నాయి. వినియోగదారులను వ్యాపారుల లాభాపేక్ష నుండి కాపాడడానికి వినియోగదారుల చట్టాలు ఏర్పడ్డాయి. అధిక ధరలను నియంత్రించి నిత్యావసర వస్తువులు పక్కదారి పట్టకుండా, సంక్షోభ సమయాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి, ప్రజలకు రక్షణ కవచంలా నిత్యావసర వస్తువుల చట్టాలు రూపొందించబడ్డాయి.
భారతదేశం ప్రధానంగా వ్యవసాయిక దేశం. ఒకప్పటి ఆర్థిక అస్థిరత నేడు దేశంలో లేకపోవడానికి భారత్లో ఆహార ధాన్యాలకు కొదవ లేకపోవడమే. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందచేయాలి. దళారుల జోక్యాన్ని నియంత్రించాలి. నిత్యావసర వస్తువుల చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేయాలి.
బంగారం నిత్యావసర వస్తువు కాకపోయినా, నిత్యావసర వస్తువు కంటే ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
భారతదేశ ప్రజలకు ప్రాచీన కాలం నుండి బంగారమంటే అత్యంత ప్రీతిపాత్రం. భారతీయ సంస్కృతిలో బంగారానికి ప్రాధాన్యమెక్కువ. బంగారంతో వివిధ ఆభరణాలు చేయించుకుని
అత్యంత వాతావరణానికి మధ్య చాలా వైరుధ్యముంటుంది. అంతరిక్ష ఉష్ణోగ్రతల నుండి ఉపగ్రహ పరికరాలను కాపాడడానికి బంగారాన్ని వినియోగిస్తారు. ప్రపంచ వాణిజ్యం వివిధ రకాల వస్తు, సేవల ఆధారంగా జరుగుతున్నప్పటికీ, బంగారం కూడా వాణిజ్య రంగంలో కీలక పాత్ర వహించడం విశేషం. ఆర్ధిక సంక్షోభసమయాల్లో బంగారం ప్రాధాన్యతను మరువలేం. కరెన్సీ విలువ పడిపోయినప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో బంగారం ద్వారా లావాదేవీలు జరుపుతారు.
భారతీయ సంస్కృతిలో పెనవేసుకున్న బంధం బంగారం
అపురూపంగా భద్రపరచుకునే వారికి నేడు బంగారమంటే ఒక భద్రత, భరోసాగా మారింది.బులియన్ మార్కెట్లో పది గ్రాముల మేలిమి బంగారం లక్ష రూపాయలు దాటింది. ప్రజలు బంగారాన్ని కష్టకాలంలో ఆదుకునే విలువైన ఆస్తిగా భావిస్తున్నారు. భారతీయులు బంగారాన్ని అనవసరంగా దాచుకుంటున్నారనే అపప్రధ తొలగిపోయింది. బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. బంగారం కొని భద్రపరచుకుంటే, కొన్నేళ్లలోనే వాటి ధరలు విపరీతంగా పెరగడం వలన బంగారం ఒక ప్రధానమైన ఆదాయ వనరుగా రూపాంతరం చెందింది. బంగారాన్ని అంతరిక్ష
పరిశోధనల కోసం అవసరమయ్యే ఉపగ్రహాల్లో, అంతరిక్ష
నౌకల్లో, రక్షణ రంగంలో, ఎలక్ట్రానిక్ పరికరాల్లో కండక్టర్గాను, వైద్య పరికరాల్లోను బంగారాన్ని వినియోగిస్తున్నారు. భూ వాతావరణానికి, అంతరిక్ష
ప్రపంచ దేశాల ఆర్ధిక సుస్థిరత్వానికి బంగారం తోడ్పడుతుంది. బులియన్ మార్కెట్ బిలియన్ డాలర్లను కురిపించే ఖరీదైన వ్యవహారంగా మారింది. భారతీయ బ్యాంకుల్లో కొద్ది సంవత్సరాల క్రితం వరకు రైతులకు బంగారం మీద కేవలం 25 పైసలు వడ్డీతో రుణాలను అందించేవారు. ఈ విధానం రద్దు కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి పావలా వడ్డీకే బంగారంపై వ్యవసాయదారులకు రుణాలను మంజూరు చేయాలి. భవిష్యత్తులో బంగారం ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్న దృష్ట్యా పలువురు ధనికులు భూములపై కాకుండా బంగారంపై దృష్టి సారించడం గమనార్హం.
Read also:hindi.vaartha.com
Read also: