📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gautama Buddha : జ్ఞానులకి జ్ఞాని – బుద్ధుడు

Author Icon By venkatesh
Updated: July 15, 2025 • 1:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gautama Buddha : బుద్ధుడు చెప్పిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి, ఎన్నో రకాలుగా స్ఫూర్తినిచ్చాయి. బుద్ధుడి స్ఫూర్తితోనే ఎంతోమంది తాత్వికులయ్యారు. సిద్ధాంతకర్తలయ్యారు. మేధావులయ్యారు. వీరు రోజుల్లో, మానవ మేధస్సు వికసించని దశలో, బుద్ధుడు సుమారు రెండున్నరవేల ఏళ్లు క్రితం ఆ విషయం చెప్పడం మామూలు విషయం కాదు. ఈ రోజు వైజ్ఞానిక ప్రపంచమంతా ఈ సూత్రం చుట్టే తిరుగుతూ ఉండడం మనం గమనించొచ్చు.

బుద్ధుడు ఏం చెప్పాడు? ‘ప్రపంచంలో దుఃఖం ఉంది. దానికి కారణముంది. కారణముంది కాబట్టి, నివారణ ఉంది. నివారణ ఉంది కాబట్టి అందుకు మార్గాలున్నాయి’ అన్నాడు. దీనిమీద ఆధారపడి కారల్మార్క్స్ మరో సిద్ధాంతం చెప్పాడు. ఆయన ప్రపంచంలోని పేదరికాన్ని, అణచివేతను, అసమానతను గుర్తించాడు. ఆ విషయాన్నే తన సిద్ధాంతంగా చెప్పాడు. ప్రపంచంలో పేదరికం ఉంది. పేదరికం ఉంది కాబట్టి అసమానత, అణచివేత ఉన్నాయి. పేదరికానికి కారణాలు తెలుసుకుంటేనే, ఆ కారణాలకు నివారణలు తెలుసుకోవచ్చు. ఆ నివారణకు దారులే సమసమాజస్థాపన, క్రాంతి-విప్లవం అని వివరించాడు మార్క్సు! లోతుగా తరచి చూస్తే, మార్క్సిజం, బుద్ధిజం పునాదులపైనే నిర్మాణమైందని అనిపిస్తుంది.

నేటి ఆధునిక వైద్యశాస్త్రమైనా ఏం చెబుతుంది? ప్రపంచంలో రోగాలున్నాయి. రోగాలున్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలున్నాయి. అవి ఉండడానికి మాత్రమేకాకుండా బుద్ధుడు చెప్పిన ఒక సిద్ధాంతంతో చాలామంది శాస్త్రవేత్తలయ్యారు. పరిశోధకులయ్యారు. ఆయన చెప్పిన అనేక విషయాలలో ఈ ఒక్క సిద్ధాంత విశ్వవ్యాప్తంగా ప్రభావం చూపింది. అదేమంటే ‘కార్యకారణ సిద్ధాంతం’. ఆ ఒక్క మాటతో ఆయన వైజ్ఞానికులకు వైజ్ఞానికుడయ్యాడు. ఏ కార్యం జరిగినా, దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని అన్వేషించి, అర్థం చేసుకుంటేగాని దాన్ని నివారించడానికి మార్గాలు వెతుక్కోవచ్చు అన్నది బుద్ధుడి కార్యకారణ సిద్ధాంతం!

Gautama Buddha ఎక్కడ ఏ ప్రగతీ లేని కారణాలున్నాయి, ఆ కారణాలు బాక్టీరియా, వైరస్ కావచ్చు. వారసత్వ లక్షణాలే కావొచ్చు. మరింకేదైనా కావచ్చు. కారణాలేవైనా అందుకు నివారణలున్నాయి. ఆ నివారణలకు వేర్వేరు దారులున్నాయి. ఆ దారులేమిటి? చికిత్స, థెరపీ, ఆపరేషన్ వగైరా ఏదైనా కావొచ్చు. కార్యకారణ సిద్ధాంతం 16వ శతాబ్దంలో యూరోప్‌కి చేరినప్పుడు, అక్కడ ఏకన్, న్యూటన్, కెప్లర్, గెలీలియో వంటి మహాశాస్త్రవేత్తలంతా తయారయ్యారు.

ఈ రకంగా చెప్పాలంటే భారతదేశం ‘విశ్వగురువు’ ఎప్పుడో అయిపోయింది. కాస్త చదువూ, జ్ఞానం, విజ్ఞత ఉన్నవారికి ఈ విషయం తెలుస్తుంది. అది లేనివారే ఇప్పుడీ దేశాన్ని కొత్తగా ‘విశ్వగురువు’గా నిలబెడతామని బయలుదేరుతున్నారు. అది వారి అజ్ఞానాన్ని బయటపెడుతుంది.

భారతదేశం ప్రపంచానికి ఏమిచ్చిందీ అంటే బుద్ధుణ్ణి ఇచ్చింది. బుద్ధుడు ప్రపంచానికి ఏమిచ్చాడంటే కార్యకారణ సిద్ధాంతాన్నిచ్చాడు. ఎక్కడ ఏ ఆధారాలూ లేని రోజుల్లో, ఏ పరిశీలనలు, ఏ పరిశోధనలు జరగని రోజుల్లో బుద్ధుడు ఆ సిద్ధాంతాన్ని ఇచ్చాడంటే మాటలా? ఆయనకు జ్ఞానోదయ మైందంటే ఇదే – ప్రపంచానికి ఆయన జ్ఞానాన్ని ఆ ఒక్క సిద్ధాంత మీదే అన్న ఆధారపడి ఉన్నప్పుడు, వైజ్ఞానిక పరిశోధనలన్నీ ఇప్పటికీ ఆ సిద్ధాంతం మీదే ఆధారపడి జరుగుతున్నప్పుడు – ఇన్ని శతాబ్దాల తర్వాత మనం ఆయనను ఏ స్థాయిలో నిలుపుకోవాలి?

అందుకే ప్రజలు ఆయనను ‘భగవాన్’ అన్నారు. భగవాన్ అంటే పరిపూర్ణుడు అని అర్థం. బుద్ధుడు ఒక సామాజిక కార్యకర్తగా, సంఘసంస్కర్తగా, తాత్వికుడిగా ముఖ్యంగా మార్గదర్శిగా చూడకుండా – ఆయనను దేవుళ్ళలో కలపడం, ఆయనకు మతాన్ని పులమడం – ఆలోచనలేని కొందరు చేసిన పిచ్చిపని. పరిపూర్ణుడు గనుకనే శతాబ్దాలకు ముందే ఆనాటి ప్రజలు ఆయనను భగవాన్గా పూజించారు. శతాబ్దాల తర్వాత ఈనాడు కూడా ఆధునిక ఆలోచనాపరులు ఆయన మేధోశక్తికి అబ్బురపడి ఆరాధిస్తున్నారు.

ఆ స్ఫూర్తిని నిలుపుకుని, వచ్చే తరాలకు అందించాలనుకుంటున్నారు. పూజ అంటే అదే. పూలు, కుంకుమజల్లి, గంటలు మోగించి, అర్థంలేని, అర్థంకాని సంస్కృతశ్లోకాలు అరవడం పూజ కాదు. అది దారితప్పిన మనువాదుల పైత్యం.

పదిహేడవ శతాబ్దంలో బుద్ధుడి కార్యకారణ సిద్ధాంతం అందుబాటులోకి వచ్చిన తర్వాతనే యూరోప్లో వైజ్ఞానిక విప్లవం వచ్చింది. అంతకు ముందు అక్కడ ఏదైనా జరిగిందంటే దానికి కారణం ధార్మిక, ఆధ్యాత్మిక, దైవ కారణాల్ని వెతుక్కునే వారు. ఇది అప్పటి వారి రచనల్లో దొరికిన అంశమే.

బుద్ధుడు తన బోధనల్ని నాటి ప్రజల భాష అయిన పాలిభాషలో బోధించాడు. అందువల్ల అతడి బోధనలతో పాటు ఆ పాలిభాష ప్రభావం ఇతర దేశాల మీద కూడా పడింది. ఉదాహరణకు కొన్ని ముఖ్యమైన పదాలు చూద్దాం. ధ్యానాన్ని పాలిభాషలో ‘ఝూన్’ అంటారు. దాన్ని మన భారతదేశంలో వైదిక మతస్థులు ధ్యానంగా మార్చారు. ఇదే పదం చైనాకు వెళ్లి ‘చాన్’ అయ్యింది. అక్కడ ‘చాన్’ సంప్రదాయం ఏర్పడింది. అలాగే పాలిభాషలోని ఝూన్ పదం జపాన్లో ‘జేన్’ అయ్యింది. అది పాటించే ‘జేన్’ సంప్రదాయం అక్కడ వర్ధిల్లింది. ఇదే ఝాన్ కొరియాలో ‘సన్ జాన్’ అయ్యింది. వియత్నాంలో ‘థియాన్’ అయ్యింది.

ఇలా వేరువేరు దేశాల్లో ఆ పదం వేరువేరుగా వ్యాపించింది. ఇంతెందుకూ? మనం మన ఊళ్ల పేర్లలో సామాన్యంగా ‘పల్లి’ అని ఉండడం చూస్తుంటాం. అది పాలిభాషలోంచి వచ్చిందే. ఇరాండ్పల్లి అనే ఊరు అశోకుడి శాసనాలలో కూడా కనిపించింది. ‘పల్లి’ అంటే పాలిభాషలో నగరం అని అర్థం. పర్షియా రాజధాని పర్సిపోలిస్ – పోలిస్ అంటే నగరం అనే అర్థం ఉంది. ఇవన్నీ బుద్ధుడి బోధనలతో పాటు వేర్వేరు భాషల్లోకి ప్రవేశించిన పదాలు.

అందుకే మూలాల్లోకి వెళ్లాలి. డాక్టర్ రామ్ విలాస శర్మ వృత్తిరీత్యా ఇంగ్లీషు ప్రొఫెసర్, భాషాశాస్త్రజ్ఞుడు కూడా. బౌద్ధమతాభిమాని అయినందున ఆ విషయాలలో విస్తృతంగా పరిశోధనలు చేశారు. పాలిభాషా పదాలు వివిధ దేశాలకు ఎలా ప్రయాణించాయన్న విషయం ఆయన చాలా వివరంగా రాశారు.

థెరపీ/థియరీ వంటి పదాల గురించి కూడా ఆయన వివరణ ఇచ్చారు. తార్కిక విశ్లేషణలతో లభించేది ‘థేర్’ అని పాలిభాషలో బౌద్ధం చెబుతుంది. ఆస్థా (నమ్మకం-విశ్వాసం) నుండి వేదాలు వచ్చినట్లుగా తార్కిక దృక్పథంతో ‘ధేర్’ వచ్చింది. ‘ధేర్’ అంటే పెద్దవారు – అన్నీ తెలిసిన విజ్ఞుడు అని అర్థం. (ధేరవాద: బౌద్ధంలో ముఖ్యమైనశాఖ)

వైజ్ఞానిక రంగంలో ఏ సాంకేతిక పదం కనిపించినా దాని మూలం ఇటాలియన్, లాటిన్, గ్రీకు అని చెపుతుంటారు కదా? చాలాకాలానికి ముందు ఈ ‘ధేర్’ అనుయాయులే ఈజిప్టులో ‘ధేరాపుటి’ అని పిలవబడేవారు. వీరు చికిత్సకులు. వీరి వల్లనే ‘థెరపీ’ / ‘థియరీ’ వంటి పదాలు విశ్వవాప్తమయ్యాయి.

ఏదో ఒక మత విశ్వాసంలో బలంగా పాతుకుపోయిన వారికి బహుశా ఈ విషయాలు నచ్చకపోవచ్చు. అబద్దాల్లో సుఖాలను వెతుక్కునే వారికి నిజాలు ఇబ్బందిగానే ఉంటాయి.(Gautama Buddha)

buddha stories gautama buddha gautama buddha about life gautama buddha famous quotes siddhartha gautama quotes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.