हिन्दी | Epaper
అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’

Future Leadership : నేటి యువకులే రేపటి పాలకులు

venkatesh
Future Leadership : నేటి యువకులే రేపటి పాలకులు

Future Leadership : భారతదేశంలో రాజకీయాల్లో యువత ప్రవేశించడానికి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన జాతీయ ఉద్యమం ఒక అవకాశంగా మారింది. చాలామంది విద్యావంతులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఇతర వృత్తులవారు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా ఎంతో మంది యువతీ యువకులు ఆనాటి జాతీయ రాజకీయ ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అలా అడుగుపెట్టిన వారిలో కొందరు బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటంలో అమరులయిపోగా, మరికొందరు స్వాతంత్య్రానంతరం రాజకీయాల్లో మనగలిగారు. అనేక ఉన్నత పదవులు పొందగలిగారు. జాతీయ ఉద్యమ స్పూర్తితో అనేక రంగాలలో ఉద్యమ స్ఫూర్తితో మంచి మార్పులు తేగలిగారు. అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మంచి పరిపాలన కావచ్చు. ఇలా ఏ రంగంలోనైనా ఆనాటి యువత వ్యవస్థల ఏర్పాటు, నిర్మాణంలో తమ వంతు పాలుపంచుకున్నారు.

నేటి నిజం ఏమిటి? అది ఒకనాటి సంగతి. కానీ నేడు సామాన్య యువత రాజకీయాలలోకి రావడానికి అనేక అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒకవేళ ఎవరైనా అమాయకంగా తాము రాజకీయాల్లోకి పోతామని సామాన్య యువతీ యువకులు అంటే, వారి కుటుంబ సభ్యులతో పాటు సమాజం హేళన చేసే పరిస్థితి ఉంది. దానికి కారణం.. రాజకీయాలంటే మోసం, ద్వేషం, పనికిరానివి అని అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఈ మాట సమర్థించే చర్యలు సమాజంలో ప్రతిరోజు ఎన్నో జరుగుతున్నాయి. ఎంతమంది యువతీ యువకులు రాజకీయ పార్టీలను నమ్ముకుని, ఉద్యమాలను నమ్ముకుని రాజకీయాల్లో ఏదో పొడిచేస్తాం అని వచ్చి మోసపోయి, అటు ఉద్యోగాలకు పనికిరాకుండా, ఇటు రాజకీయాల్లో పదవులు రాకుండా పోతున్నారు. రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే “న మర్కాన ఘాట్కా” అనే సామెతను నిజం చేస్తున్నారు. రాజకీయ పార్టీల పల్లకి మోసే బోయలుగా యువత రాజకీయ పార్టీల నేతల పల్లకి మోసే బోయలు లాగానే యువత మిగిలిపోతున్నారు.

అప్పటికే రాజకీయాల్లో బాగా ఎస్టాబ్లిష్ అయిన రాజకీయ కుటుంబాలు, నేతల కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు, ఇతరత్రా బంధుత్వాలు ఉన్న యువత రాజకీయాలలో సామాన్య యువతను తొక్కిపెడుతున్నారు. రాజకీయ వారసులుగా వచ్చినవారికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మొదటి అడ్వాంటేజ్: వారికి రాజకీయాల్లో ఎంట్రీ ప్రవేశంగా వారసత్వంగా వస్తుంది. వాటిని ఆసరా చేసుకుని వారు ముందుకెళ్తుంటే, ఎలాంటి ఆసరా లేకుండా రాజకీయాలలో మనగలిగే పరిస్థితి సామాన్య మధ్య తరగతి యువతకు కరువైంది.

ఒకవేళ డబ్బున్న యువత కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే, వారి జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప పదవులు రావడం లేదు. దానికి కారణం చాలా ప్రాంతీయ పార్టీలు ప్రైవేటు ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో, ఆయా ప్రాంతీయ పార్టీల నాయకుల కొడుకులు, కూతుళ్లు మాత్రమే రాజకీయాల్లో వారసత్వ పదవులు అనుభవిస్తున్నారు. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలని, కొడుకులు లేకపోతే ముఖ్యమంత్రి కూతురు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నారు, ఆశిస్తున్నారు. ఇది ఒక రాజకీయ దెవ శాసనంగా వారు మారుస్తున్నారు.

వారసత్వ రాజకీయాల(Inheritance Politics)లో కూడా కొనసాగుతున్న లింగ వివక్ష వారసత్వ రాజకీయాలలోనూ లింగ వివక్ష కొనసాగుతుంది. ఆయా రాజకీయ పార్టీ నాయకుల కొడుకులకి మొదటి ప్రాధాన్యం దక్కుతుంది. ఒకవేశ ఎవరైనా రాజకీయ వారసులుగా వస్తుంటే, ఆయా రాజకీయ నాయకులకు మగపిల్లలు లేనట్లే లెక్క. ఉదాహరణకు సోనియాగాంధీకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కానీ రాహుల్గాంధీని ముందుకు పెట్టినట్లు ప్రియాంక గాంధీని ముందుకు రానివ్వడం లేదు. మొన్నటిదాకా జాతీయ పార్టీగా కొనసాగిన నేషనల్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) వ్యవస్థాపకుడు, మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా పేరున్న నాయకుడు, మరాఠా యోధుడు శరత్పవార్ గారికి కొడుకులు లేరు. ఉన్న ఒక్క బిడ్డ సుప్రియ సూలే కనుక ఆమె రాజకీయాల్లో రాణించింది. ఇలా చెప్పుకుంటూ పోతే, దేశవ్యాప్తంగా నాయకుల కొడుకులకే వారసత్వం వస్తుంది. కానీ కూతుళ్లకు రావడం లేదు. ఇది ఒక విషాదం.

చరిత్రలో ఏం జరిగింది? ఒకసారి మళ్లీ వెనక్కి వెళ్లి చూస్తే, 1969 జై తెలంగాణ తొలి దశ ఉద్యమంలో యువత బాగా రాజకీయాలలోకి రాగలిగింది. ఆనాడు ఉద్యమ నిర్మాతలుగా ఉన్న మదన్మోహన్, మల్లికార్జున్, జైపాల్రెడ్డి లాంటి ‘నాయకులతో పాటు సీనియర్ నాయకులైన మర్రి చెన్నారెడ్డి లాంటివారు కూడా తెలంగాణ జై ఉద్యమంలో ముందు ఉన్నారు. ఆ ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది యువత ఆ తర్వాత వారసత్వం లేకుండానే రాజకీయాలలో మనగలిగారు. అలాగే 1972లో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమం నుంచి ఎంతోమంది యువత రాజకీయాల్లోకి రాగలిగారు. అందులో ప్రధానంగా మొన్నటిదాకా ఉత్తమ పార్లమెంటేరియన్గా, కేంద్ర మంత్రిగా, ఉప రాష్ట్రపతిగా పనిచేసిన, భారత రాజకీయాలను ప్రభావితం చేసిన ఎం. వెంకయ్యనాయుడు పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.(Future Leadership)

అలా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతో మంది నాయకులు జై ఆంధ్ర ఉద్యమం నుంచి రాజకీయాల్లో ఎదిగారు. వీరెవరికీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నేపథ్యం లేదు. ఆ తర్వాత ఎమర్జెన్సీ నుండి కూడా కొత్త నాయకత్వం వచ్చింది. విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చిన కొత్త తరం రాజకీయ నాయకులు అలాగే అస్సాం రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా గణ సంగ్రామ పరిషత్ స్థాపించిన ప్రపుల్ల కుమార్ మొహంతా ఆధ్వర్యంలో అస్సాం ప్రజల హక్కుల కోసం పోరాడిన ఉద్యమంలో ఆ తర్వాత విద్యార్థి నాయకులు ఎంతోమంది రాజకీయాల్లో పదవులు పొందారు. అంతెందుకు! స్వయంగా ఉద్యమ నాయకుడైన ప్రపుల్లకుమార్ మహంతా ఆనాడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాటి జాతీయోద్యమం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు ఉద్యమ నాయకులు ఎంతో మంది రాజకీయాలలో వారసత్వం రాజకీయాలకు అతీతంగా మనగలిగారు.

ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టిపోయి పెద్ద ఎత్తున తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సందర్భంగా వరుసగా ముఖ్యమంత్రులను ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడులాగా మార్చి పదవులు కట్టబెట్టిన సందర్భంలో వారిని అవమానిస్తున్న సందర్భంలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన ఎన్టీ రామారావు రాజకీయ రంగంలో యువతకు మంచి స్థానం కల్పించారు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతోమంది నాయకులు తెలుగుదేశంలో చేరినా కూడా ఆయన తనను నమ్ముకున్న యువతకు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. అలా చాలామంది యువత ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన యువత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, స్పీకర్లుగా అనేక ఉన్నత పదవులు పొందగలిగారు.

అలా ఒక రాజకీయ ఉప్పెనలాగా ‘వేవ్’ వచ్చిన సందర్భంలో కూడా సామాన్య యువత రాజకీయాలకు రాగలిగింది. ఆనాడు రాజకీయాలలో డబ్బు, మద్యం ప్రమేయం అంతగా లేదు. కానీ ఈనాడు రాజకీయాలలో డబ్బు, మద్యం ప్రమేయం లేకుండా రాజకీయాలను నడిపే పరిస్థితి లేదు. అలాగే ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ముడిపడి ఎంతోమంది ఉద్యోగులు, తటస్తులు ఆనాడు రాజకీయాలలోకి రాగలిగారు. అలా వచ్చిన వారిలో అప్పటికప్పుడు ఎంపిక చేసి అసెంబ్లీలో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇవ్వడం వల్ల ఎన్టీఆర్ తలచుకుంటే ‘దీపపు స్తంభాన్ని’ కూడా గెలిపించగలుగుతారు అనే ఒక నానుడి రాజకీయాల్లో ఆనాడు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించగలిగారు.

ఆ తర్వాత రాజకీయ అనుభవ రాహిత్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కుట్రల వల్ల ఆగస్టులో అధికారం కోల్పోయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆ యువతనే నమ్ముకున్న ఎన్టీఆర్ 1985లో జరిగిన ఎన్నికల్లో మరొకసారి అప్రతిహతమైన విజయాన్ని సాధించడంలో ఆనాటి సామాన్య మధ్య తరగతి యువత పాత్ర మరువలేనిది. అలా తెలుగు రాష్ట్రాలలో బలహీన వర్గాలకు చెందిన యువత చాలామంది రాజకీయాలలోకి వచ్చి విజయవంతమైన రాజకీయవేత్తలుగా పేరు తెచ్చుకున్నారు.(Future Leadership)

ఎమర్జెన్సీ నేపథ్యం నీలినీడల నుండి.. ఇక దేశంలో 1975లో ఇందిరాగాంధీ అలహాబాద్ హైకోర్ట్ తీర్పు వల్ల పదవి కోల్పోయి తన ప్రధాని పదవి రక్షించుకోవడానికి ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్య హక్కులను హరించినప్పుడు మరొకసారి సామాన్య యువత రాజకీయాల్లోకి రాగలిగింది. పూర్ణ స్వరాజ్ అనే నినాదంతో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు ప్రారంభించిన ఉద్యమంలో అనేకమంది కార్మిక, కర్షక, విద్యారంగాల నుండి యువత రాజకీయాల పట్ల ఆకర్షితులై ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం ఏర్పడడం, అది కిచిడీ ఆ తర్వాత ప్రభుత్వంగా మారినా కూడా ఆనాటి స్ఫూర్తితో వచ్చిన యువతరం నాయకులు ఎంతోమంది యువత ఇప్పటికీ రాజకీయాలలో మనగలుగుతున్నారు.

అలా వచ్చినవారే ఉత్తర భారతదేశంలోని లాలూప్రసాద్ యాదవ్ నుంచి మొదలుకొని నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్, జార్జ్ ఫెర్నాన్టేజ్ లాంటివారు ఎంతో మంది యువత రాజకీయాల్లోకి వచ్చి వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేశారు. జనతా పార్టీ ప్రయోగం విఫలం తర్వాత వీరందరూ తమ తమ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు స్థాపించి అందులోకి యువతను ఆహ్వానించి ఆయా పార్టీలను ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి తేగలిగారు. అలా చూస్తే ఆ తర్వాత ఆ ప్రాంతీయ పార్టీల ప్రధాన నాయకులుగా వారు రాజకీయ కుటుంబాలుగా మారిపోయి వారి కొడుకులు, కూతుళ్లు, ఇతర బంధువులను రాజకీయాల్లో దింపి ప్రస్తుతం రాజకీయ వారసత్వ పోరాటంలో వారిదే పై చేయిగా మారిపోయిన విషాద పరిస్థితి కనపడుతుంది. ఒక తేజస్వి యాదవ్, మరొక అఖిలేష్ యాదవ్ ఇలా ఎంతోమంది అప్పటి యువ ముఖ్యమంత్రుల పిల్లలు రాజకీయ వారసులుగా ప్రస్తుతం రాజకీయాలను శాసిస్తూ కొనసాగిస్తున్నారు.

Future Leadership

ఇలా ఒరిస్సాలో బిజు పట్నాయక్ వారసుడు నవీన్ పట్నాయక్ సరాసరి విదేశాల నుంచి వచ్చి తన తండ్రి వారసత్వానికి ప్రతీకగా మారి వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఒరిస్సా రాష్ట్రానికి అద్భుతమైన పాలన అందిస్తున్నారు. అలాగే తన తండ్రి వైయస్ రాజశేశఖర్ రెడ్డి మరణం తర్వాత 9 ఏళ్ల పాటు రాజకీయ పోరాటం చేసి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ వారసత్వ కుటుంబం నుండి వచ్చినవారే కదా! అలా అని వారసత్వ రాజకీయాలు పనికిరావు అని నిరూపించడానికి కూడా ఎన్నో ఉదాహరణలు పనికి వస్తాయి. కానీ సామాన్య యువతర రాజకీయాల్లోకి రావడానికి ఇవన్నీ అవరోధాలుగా మారుతున్నాయనడానికి సందేహమే లేదు. అలా ఉత్తర భారతదేశంలోని అనేకమంది వారసత్వ రాజకీయాలు లేకుండా రాజకీయాలకు వచ్చినవారుతున్నారు. ఆ తర్వాత వారి కుటుంబాలలోని యువతను రాజకీయాలలోకి దించి కొత్త తరాన్ని రాకుండా చేసినవారు కూడా ఉన్నారు.

Future Leadership

Future Leadership : ఇక దక్షిణ భారతదేశానికి వస్తే దేశంలో మొట్టమొదటిసారి ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేసిన తమిళనాడు రాష్ట్రాన్ని ఉదాహరణకు చెప్పుకోవచ్చు. మొదట ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), ఆ తర్వాత అది విడిపోయి అన్నాడీఎంకే ఇలా ప్రస్తుతం డజనుకు పైగా ద్రవిడ పార్టీలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకెలలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ తన తండ్రి కరుణానిధి వారసుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ప్రైవేటు ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో ధన బలంతో రాజకీయాలను నడపగలుగుతున్నారు. అటు ఏడు, ఇటు ఏడు తరాలకు సరిపడా రాజకీయాలలో డబ్బు సంపాదించి వాటిని మళ్లీ మళ్లీ పెట్టుబడి పెడుతూ రాజకీయాలలో వారసత్వ యువత తిష్ట వేసుకుని కూర్చుంటున్నారు.

ఆకస్మిక మార్పే విప్లవం ఇది నేటి భారతంలో వారసత్వ రాజకీయాల చరిత్రగా మనం చెప్పొచ్చు. రాజకీయాలలో మార్పు ఒక్కసారిగా వస్తే అది విప్లవమంటారు. అలాంటి విప్లవం రాదు అని నిరాశపడడం కూడా సరైనది కాదు. అవకాశం వస్తే యువత ఏదైనా చేయగలుగుతారు అనడానికి ఒక మంచి ఉదాహరణ: తెలంగాణ మలిదశ ఉద్యమం ఒక ఉదాహరణ. 2001 తర్వాత తెలంగాణ ఉద్యమంలో అనేకమంది యువత పాల్గొని గమ్యాన్ని ముద్దాడేదాకా పోరాడారు. మరికొంతమంది మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకుని మొగ్గలోనే తుంచివేయబడ్డారు.

Future Leadership



కానీ ఈ ఉద్యమం తర్వాత కొందరు ఉద్యమ నాయకులు అధికారంలోకి వచ్చినా కూడా మళ్లీ ఇక్కడ కూడా అంతిమ రాజకీయ అధికారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, కూతురు, అల్లుడు, మరొక కజిన్ చేతుల్లో పూర్తి అధికారం కేంద్రీకృతమైంది. ఉద్యమ నాయకులు అసలే లేరని కాదు.. కానీ అంతిమ నిర్ణయాధికారం ఒక కుటుంబం చేతిలో ఉండిపోతుంది. ప్రస్తుతం తెలంగాణలో యువత స్వతంత్రంగా రాజకీయాల్లోకి రాగలుగుతుందా అంటే చెప్పడం కష్టమే. ఇలా నేడు యువత రాజకీయాలకు రాకపోవడానికి ప్రధానంగా రాజకీయాలలో డబ్బు, మద్యం ప్రభావం పెరగడం, ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగడం, సిద్ధాంత పరమైన రాజకీయాలు మాని అధికారం కోసం మాత్రమే వెంపర్లాడే రాజకీయాలు రావడం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. విజేత మాత్రమే భవిష్యత్తును నిర్ణయించే మొనగాడుగా మారడం, ఓడినవారు చరిత్రలో మిగలకపోవడం జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఓటు వేసేది మనం ప్రభుత్వాన్ని నడిపేది మనం అనే ప్రజాస్వామ్య సూత్రం ప్రజలకు వంట పట్టకపోవడం అనేది నేటి విషాదం. మన ఓటు మన గౌరవం-మన ఓటు మన భవిష్యత్తు! అవును.. మన ఓటు ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. మన పనుల డబ్బుల ద్వారా ప్రభుత్వాలు నడుస్తున్నాయి.(Future Leadership)

కానీ ఈ నగ్నసత్యాన్ని ప్రజలకు చూపించడానికి రాజకీయ పార్టీలు ఇష్టపడడం లేదు. సమాజాన్ని జాగృతం చేయాల్సిన మీడియా కూడా ఈ రాజకీయాల ఆటలో ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తుంది. లేక ఎటో ఒకవైపు మొగ్గు చూపిస్తుంది. ఎవరి స్వార్థం వారిదే! ఎవరి ఆలోచన వారిదే! కానీ కొత్త సిద్ధాంతాలతో సరికొత్త ఆలోచనలతో రాజకీయ పార్టీ స్థాపించి చేతులు కాల్చుకున్నవారు కూడా మనకు చరిత్రలో కనపడుతున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు మొదట లోకసత్తా ఉద్యమ సంస్థను ప్రారంభించి, ఆ తర్వాత లోక్సత్తా పార్టీ స్థాపించి 1999లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తాను ఒక్కడే గెలిచి నిలిచినా. కూడా ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలలో మనగలగలేకపోయారు. దానికి కారణం రాజకీయాలలో డబ్బు, మద్యం ప్రమేయం పెరగడంతో పాటు నైతిక విలువలు లోపించడం కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అనేక కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ అవి మనగలగలేకపోవడానికి కారణం కూడా డబ్బు, మద్యం ప్రమేయమే.

Future Leadership

చీకటిని తిడుతూ కూర్చుందామా? ఇలా చీకటిని తిడుతూ కూర్చోకుండా చిరు దీపం వెలిగించే ప్రక్రియను నేటి యువత ప్రారంభించాలి. రాజకీయాలలో మనం ఎవరికీ తీసిపోమని, యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని నమ్మి ముందుకు సాగితే తప్పక విజయం ముద్దాడుతుంది. కానీ పిల్లిమెడకు గంట కట్టేది ఎవరు అనేది నేటి ప్రశ్న. దేశవ్యాప్తంగా యువత రాజకీయాల్లోకి రావాలంటే ఏవైనా ఉద్యమాలు మాత్రమే రావాలా? లేక భావ సారూప్యం కలిగిన యువత ఏకమైన ఒక కొత్త నినాదంతో మార్పు కోసం, మంచి కోసం రాజకీయాల్లోకి వస్తే సాధించలేనిది ఏమీ ఉండదని మరికొందరు అంటున్నారు. అందుకే “యువతా మేలుకో.. దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో నేటి యువత రాజకీయాల్లో పునఃప్రవేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలను అసహ్యించుకోకుండా రాజకీయాలను ప్రేమించి ముందుకు వస్తే తప్పక విజయం వారిని వరిస్తుంది. కానీ ఆ మొదటి అడుగు వేసేవారే కావాలి.

గాంధీమార్గం అనుసరణీయమేనా? చివరగా మహాత్మాగాంధీ గారు చెప్పిన మాటలతో ముగిస్తాను. “ఏదైనా కొత్త పని మొదలు పెట్టినప్పుడు మొదట ఎవరూ పట్టించుకోరు. ఆ తర్వాత వారు చేసే పనులను బట్టి వారి ఉనికిని మొదట పట్టించుకోనివారే గుర్తిస్తారు. ఒకవేళ కొందరికి నష్టం కలిగితే ఆ నష్టం కలిగినవారు వీరికి వ్యతిరేకంగా విమర్శలు మొదలుపెడతారు. విమర్శలు తట్టుకొని నిలబడగలిగినప్పుడు మాత్రమే విజయం సాధ్యమవుతుంది. ఈ మూడవ దశ చాలా కీలకమైంది ఈ మూడవ దశ సంధి కాలంలో తాము ఏదైనా లక్ష్యం ఎంచుకున్నారో ఆ ప్రయత్నాన్ని, ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తారా లేక మడిమ తిప్పి వెనక్కి పోతారా అనేదాన్ని బట్టి విజయం ఆధారపడి ఉంటుంది. మూడవ దశలోని విమర్శనాస్త్రాలను తిప్పికొట్టి నాలుగవ దశలోకి వెళ్లి ప్రయత్నిస్తే అంతకుముందు విమర్శించిన నోళ్లే మూతపడతాయి. ఎవరైతే మార్పు కోసం ప్రయత్నిస్తున్నారో వారి వెంట విమర్శించినవాళ్లే వెంట నడుస్తారు. చివరికి కొత్త మార్గం తొక్కిన వారిదే విజయం అన్న గాంధీ మహాత్ముడు చెప్పిన ఈ సూత్రాన్ని నేటి యువత ఆదరిస్తే తప్పక విజయం సాధిస్తారు. అప్పుడు ఉందిలే మంచి కాలం ముందూ – ముందునా అని ప్రజలు కూడా స్వాగతిస్తారు.(Future Leadership)

Read This : https://vaartha.com/category/cover-stories/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870