చోటు అవిశ్రాంతంగా పరుగులు ఫెడ్యమి నేడు మానవ జీవితం ఇంతటి తీస్తోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించినట్లయితే మనసు అలౌకికానందం పొందుతుంది. యాంత్రికంగా మీ సాగే అనునిత్య కార్యక్రమాలతో విసిగిపోయి మనం నివసిస్తున్న ప్రాంతాల నుండి దూరంగా వెళ్లి ఇతర ప్రాంతాలను సందర్శించడమే పర్యాటకం అని చెప్పవచ్చు. ఇ తర ప్రాంతాలను మనం దర్శించేటప్పుడు అక్కడ చరిత్ర, సంస్కృతి, ప్రాచీన కట్టడాలు, కళలు, ఆహారపు అలవాట్లు, విందులు, వినోదాలు.. ఇత్యాది అనేక విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్లి కనీసం 24 గంటలైనా గడిపి అక్కడి కట్టడాలను తిలకించడం, ఆ ప్రాంతపు వింతలు, విశేషాలను తెలుసు కోవడాన్నే టూరిజం యాక్టివిటీ అనవచ్చు. రెండవ చంద్రగుప్తుని కాలంలో చైనా యాత్రికుడు పాహియాన్ కాలినడకన భారతదేశానికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇటువంటి సంఘటనల ఆధారంగా పర్యాటక రంగానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పవచ్చు. దేశీ దేశీ పర్యాటకులను డొమెస్టిక్ టూరిస్టులని, దేశం విడిచి ఇతర దేశాలను సందర్శించే వారిని ఇంటర్నేషనల్ టూరిస్టులని అంటారు. ఇలా పర్య టించే వారికి టూరిస్టు గైడ్లు, హోటళ్లు, రవాణా వాహనాలు, భోజన వసతి కల్పించే సంస్థలు ఇత్యాది వాటిని టూరిస్టు సర్వీసెస్ అని పిలుస్తారు. మోటారు వాహనాలు, రైలుబళ్లు, ఓడలు, విమానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల ప్రయోజనాల కోసం మనుషులు పర్యటనలు చేయడం పెరిగింది. క్రమంగా పర్యాటకం ఒక పరిశ్రమగా రూపు దిద్దుకుంది. చాలా దేశాలకు ప్రధాన ఆదాయ వనరు స్థాయికి ఎదిగింది. కొన్ని దేశాలయితే కేవలం పర్యాటక రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. పందొమ్మిదో శతాబ్ది తొలినాళ్లకు ఆవిరి ఇంజన్లతో నడిచే రైలుబళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి పర్యటనల్లో వేగం పుంజుకోవడం మొదలైంది.
ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, కొండకోనలతో చూడచక్కని ప్రకృతి పరిసరాలు, అద్భుతమైన సముద్ర తీరాలు వంటి ప్రదేశాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. కళలు, సంస్కృతులు, సాంస్కృతిక పునరుజ్జీవనం వంటి అంశాలపై అధ్యయనం కోసం చేపట్టే ఈ యాత్రను ‘గ్రాండ్ టూర్’ అనేవారు.అయితే కరోనా కారణంగా గత ఏడాదిన్నరకాలంలో టూరిజయంకు పెద్దగా ఆదాయం లేదు. 2020లో కొన్నిమాసాలు లాక్డౌన్, తర్వాత సెకండ్వేవ్తో పర్యాటకరంగం పూర్తిగా దెబ్బతిన్నదనే చెప్పాలి. దీనిపై ఆధారపడే లక్షలాదిప్రజలు ఉపాధిని కోల్పోయారుఆయాదేశాల ఆర్థికవనరులు కూడా తగ్గిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పర్యాటకరంగం మెల్లగా పుంజుకుంటున్నది. ఎంతో వ్యయ ప్రయాసలతో సుదూర ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను మనం ఎందుకు దర్శించాలనే ప్రశ్న ఉదయించక మానదు. అలసిన శరీరానికి విశ్రాంతి, ఉల్లాసం, ఆహ్లాదం, వినోదం.. ఇత్యాది వాటికోసం ప్రతి ఒక్కరూ పర్యాటక క్షేత్రాలను దర్శిస్తారు. వీటిలో చారిత్రక, ఆధ్యాత్మిక నిర్మాణాలు కూడా ఉన్నాయి. పుణ్యం, పురు షార్థం రెండూ దక్కేలా కొందరు ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు. అక్కడ భక్తిపారవశ్యంలో మునగడమేకాక ఆయా ఆలయాల శిల్పకళా సౌందర్యాన్ని తిలకించి ముగ్ధులవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం బంధువులను, స్నేహితులను కలుసుకొని కొత్త విషయా లను తెలుసుకొని ఎంతో సంబరపడిపోతాం. అదేవిధంగా కొత్త ప్రదేశాలకు వెళ్లి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, శిల్పకళ, ఆహార నియమాలు, ఉత్సవాలు, చరిత్ర, హస్తకళలు.. ఇత్యాది విషయాలు తెలుసుకొని అలౌకికానందంగారం ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రతి ఏదాడి సెప్టెంబరు 27న ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినో వాన్ని జరుపుకుంటారు. పర్యాటక ప్రాముఖ్యం, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువల గురించి అంతర్జాతీయంగా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీని “ది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్” జనరల్ అసెంబ్లీ 1979లో నిర్ణయం తీసుకోగా, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వా మొదటిసారిగా 1980లో ప్రపంచ పర్యాటక దినోత్స వాన్ని సెప్టెంబరు 27న నిర్వహించారు.
నాటి నుండి ఒక్కో సంవత్స ఒక్కో అంశంతో నిర్వహిస్తున్నారు.1980లో ‘టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్ స్టాండింగ్ అని పేరు పెట్టారు. ఇలా ప్రతి ఏడాది ఒక్కో అంశాన్ని తీసుకుని టూరిజం. పట్ల పర్యాటకుల్లో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఆయా చారిత్రక విషయాలను వదిలపరచుకోడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నారు.భివృద్ధి చెందుతున్న ఆర్యాటక రంగం ప్రతి ఖండంలోనూ, ప్రతి దేశంలోనూ చూడదగ్గ అందమైన ప్రదేశాలు,కట్టడాలు అనేకం ఉంటాయి. వాటిని అభివృద్ధిపరచి, పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయవనరులుగా తీర్చిదిద్దాలి. అంతర్జాతీయ వాణిజ్యంలో టూరిజం ప్రధాన భూమికను నిర్వహిస్తుంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి ‘ది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్’ అనే ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసింది. పర్యాటక విధాన సంబంధిత అంశాల్లో ఈ అంతర్జాతీయ టూరిజం సంస్థ ప్రపంచ వేదికగా పనిచేస్తుంది. పర్యాటక విభాగంలో ‘గ్లోబల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్’ అమలును ఈ సంస్థ ప్రోత్సహి స్తుంది. ఈ సంస్థలో 154 దేశాలు, 7 టెరిటరీలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ప్రైవేటు రంగం, విద్యాసంస్థలు, టూరిజం అసోసియేషన్లు, స్థానిక టూరిజం అథారిటీల నుండి 400 మంది అఫిలియేట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాన కార్యాలయం ‘మాడ్రిడ్’లో ఉంది. 1947లో ఇంటర్నేషనల్ యూని యన్ ఆఫ్ అఫీషియల్ ట్రావెల్ ఆర్గనైజేషన్ తొలి సమావేశం జరిగింది. ప్రభుత్వ సంస్థలు, అనేక ప్రయివేటు సంస్థలు ఉద్యోగుల రిక్రియేషన్కి ఎల్ టిసిల సదుపా యం కల్పించిన తర్వాత పర్యాటక రంగం ఎంతగానో పుంజుకుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక స్థలాలను మరింతగా అభివృద్ధి చేసి పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. భారత పర్యాటక శాఖతో పాటు ఏపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ పర్యాటక శాఖవారు పర్యాటక రంగంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రాచీన దేవాలయాలకు, శిల్పకళలకు, చారిత్రక కట్టడాలకు, ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలు, దర్శనీయ కేంద్రాలకు సంబంధించి ఛాయా చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు.
మన వారసత్వ సంపద, చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా పర్యాటకాభివృద్ధి మండలి, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించి, పర్యాటకాభి వృద్ధికి కృషి చేయడం జరుగుతోంది. కళలు, చిత్రలేఖనం, చేతితోతయారుచేసిన వస్తువులు తదితర అంశాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చర్చ నిర్వహించడం జరుగుతుంది. టెంపుల్ టూరిజం: మన దేశంలో ప్రజలు కాశీయాత్ర, తిరుపతి, షిర్డీ సాయిబాబా మొదలైన అనేక దేవాలయాలను భక్తిభావంతో సందర్శి స్తారు. ఆంధ్రప్రదేశ్ టెంపుల్ టూరిజం కూడా. ఆదాయాన్ని సముపార్జించి పెడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నేడు ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధి చెందుతోంది. సౌదీ అరేబియాలోని మక్కా మదీనా, ఇజ్రాయిల్, వాటికన్ సిటీ, అమృత్సర్, బౌద్ధ, జైన ఆలయాలు.. ఇలా చెప్పుకుంటూ ప్రజలు వారి వారి మత విశ్వాసాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తుంటారు. ఇటువంటి ప్రదేశాలకు ప్రజలు వెళ్లడానికి రవాణా సదుపాయాలకు, హోటళ్లకు, అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఈ విధంగా జనం ఒక దగ్గ చేరడంతో అనేక దుకాణాల వారికి ఉపాధి లభిస్తుంది. టూరిజం గైడ్లతో పాటు పలు వ్యాపార రంగాలలో వారికి జీవనోపాధి లభిస్తుంది. పర్యాటక రంగం దేశ ఆర్థిక రంగాన్ని పరి పుష్టం చేయడమే కాకుండా చాలామంది ఉపాధికి ఊతమిస్తోంది. మతపరమైన నమ్మకాలు ఉన్నవారు మత గ్రంథాలలో వర్ణించిన ప్రదేశాలకు వెళుతున్నారు. చైనా పురాణాల్లో వర్ణించిన ఐదు పవిత్ర పర్వతాలను చైనాకు చెందిన ప్రాచీన సంపన్నులు సందర్శించేవారు. కొత్త కొత్త భాషలు తెలుసుకోవడానికి, కొత్త ప్రదేశాల్లో కొత్త కొత్త రుచుల వంటకాలను ఆస్వాదించడానికి, కొత్త సంస్కృతులతో పరిచయం పెంచుకోవడానికి.. ఇలా వేర్వేరు కారణాలతో ప్రాచీనులు పర్యటనలపై ఆసక్తి చూపేవారు. సుదూర ప్రయాణాలు చేసే యాత్రికుల సౌకర్యం కోసం నాటి రాజులు రహదారులను, వాటికి చేరువలో పలు సౌకర్యాలు కల్పిస్తూ విడిది గృహాలను కూడా నిర్మించేవారు. ప్రపంచ వ్యాప్తంగా మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైతం అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: