CM Revanth Reddy : ఈనెల 15న జపాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి

Read Time:  1 min
CM Revanth Reddy to visit Japan on 15th of this month
CM Revanth Reddy to visit Japan on 15th of this month
FONT SIZE
GET APP

CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి జపాన్ టూర్ షెడ్యూల్ దాదాపు ఖరారు అయ్యింది. ఏప్రిల్ 15 నుంచి అక్కడ పర్యటించనున్నారు. పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి జపాన్‌ టూర్ ఓకే అయ్యింది. ఏప్రిల్‌ 15 నుంచి 23 వరకు ఒకాసా ఎక్స్‌పో-2025 హాజరుకానున్నారు.

ఈనెల 15న జపాన్‌కు సీఎం

సీఎం బృందం ఏయే కంపెనీల ప్రతినిధులతో భేటీ

సీఎం రేవంత్ రెడ్డితోపాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ ఇతర అధికారులు వెళ్తున్నారు. జపాన్‌ పర్యటన విజయవంతం చేయడంపై దృష్టి పెట్టారు అధికారులు. సీఎం బృందం ఏయే కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యే ప్రణాళికను పరిశ్రమల శాఖ రెడీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జపాన్‌ లోని ఫేమస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

దాదాపు ఎనిమిది రోజులు జపాన్ పర్యటన

ఒప్పందాలపై చర్చించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జపాన్‌ పర్యటన తర్వాత జూన్‌ లేదా జులై‌లో అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి పెట్టుబడులను ఆహ్వానించడానికి అధికారుల కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. దాదాపు ఎనిమిది రోజులు జపాన్ పర్యటనలో ఉండనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధితో పాటు పెట్టుబడులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటులో సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతోపాటు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే అవకాశం ఉంది.

Read Also: పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు..అధికారులు వెల్లడి

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.