CM Revanth Reddy key message to students writing exams.

పరీక్షలు రాసే విద్యార్థులు సీఎం కీలక సందేశం..!

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఒక సందేశంలో విషెస్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. బంగారు భవిష్యత్తుకు మరో అడుగు వేస్తున్న తరుణంలో లక్ష్యంపైనే గురిపెట్టాలని సందేశంలో సీఎం తెలిపారు.

Advertisements
పరీక్షలు రాసే విద్యార్థులు సీఎం

9 లక్షల 96 వేల 971 మంది విద్యార్థులు ఎగ్జామ్స్

రాష్ట్రంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థినీ విద్యార్థులు అందరికీ విజయోస్తు.. చెబుతూ సందేశంలో పేర్కొన్నారు. ఈ వివరాలను తెలంగాణ సీఎంవో తన ఎక్స్ ఖాతా ద్వారా సీఎం సందేశాన్ని పంచుకుంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 96 వేల 971 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.

ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి

కాగా, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రతి కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి చెందిన ఏఎన్‌ఎం/ఆశా కార్యకర్తలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.

Related Posts
Congress Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!
Another key decision by the Telangana government.

Congress Govt: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజాలో నెల‌కొల్పిన నీరా కేఫ్‌ ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌ కు Read more

పెంటగాన్ ఉద్యోగ కోతలు: 5,400 మంది తొలగింపు
పెంటగాన్ ఉద్యోగ కోతలు: 5,400 మంది తొలగింపు

భాగంగా, వచ్చే వారం నుండి 5,400 ప్రొబేషనరీ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగ కోతలు ఏందుకు?ప్రధాన కారణం: సామర్ధ్యాలను ఉత్పత్తి చేయడం & బడ్జెట్ పొదుపుకొనసాగే Read more

Telangana CM : సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తుంది – ఎంపీ అర్వింద్
We will not let BJP set foot in Telangana.. Revanth key comments

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించేలా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ Read more

Bhatti Vikramarka : ప్రభుత్వ ఉద్యోగం రాలేనివారికీ ఉపాధి కల్పించేది మా లక్ష్యం: భట్టివిక్రమార్క
Bhatti Vikramarka ప్రభుత్వ ఉద్యోగం రాలేనివారికీ ఉపాధి కల్పించేది మా లక్ష్యం భట్టివిక్రమార్క

తెలంగాణ ప్రభుత్వమే కాదు, ప్రతి నిరుద్యోగ యువకుడి భవిష్యత్తును నిర్మించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో Read more

Advertisements
×