CM Chandrababu will visit Nellore today

నేడు నెల్లూరులో పర్యటించనున్న చంద్రబాబు

స్వచ్చ ఆంధ్ర–స్వచ్చ దివస్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించబోతున్నారు. నేటి ఉదయం 11.45 గంటలకి టీఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం వద్ద దిగి.. అక్కడి నుంచి కోవూరు రోడ్డు మీదగా దూబగుంట సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్‌ఎఫ్‌ ఫెసిలిటీ సెంటర్‌ (వేస్ట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌)కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత దూబగుంట గ్రామంలోని స్థానికులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisements
నేడు నెల్లూరు పర్యటించనున్న చంద్రబాబు

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కాలనీలు, డ్రైనేజీలు శుభ్రం చేసే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఎంపిక చేసిన మూడు గృహాలలో ఇంకుడుగుంతలను సైతం ఆరంభించనున్నారు. అనంతరం పార్కు కమ్‌ పాండ్‌ను ఆయన సందర్శించనున్నారు. ఆ తర్వాత కందుకూరులోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో మాట్లాడటంతో పాటు మున్సిపాలిటీలోని ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం హెలిపాడ్‌ వద్దకు చేరుకుని ఉండవల్లికి తిరిగి పయనం అవుతారు. ఇక, సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.

షెడ్యూల్ ఇలా…

ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.05 దూబగుంట శివారులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. 12.20 గంటలకు దూబగుంట గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 1:30 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. 2:40 గంటలకు సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్‌లో ఉండవల్లి బయలు దేరి వెళ్లనున్నారు.

Related Posts
హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం..
Hindupuram Municipality won by TDP

అమరావతి: హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతుతో ఆరో వార్డు కౌన్సిలర్‌ రమేశ్‌ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. Read more

హైదరాబాద్​లో పెరుగుతున్న ఫుడ్​ పాయిజనింగ్ కేసులు
Food poisoning

హైదరాబాద్ మహానగరంలో చాలామంది ఇంట్లో తినడం మానేశారు. బిజీ లైఫ్ కు అలవాటు పడిపోయి..వంట చేసుకొని తినే బదులు , వంద పెట్టి బయట తింటే సరిపోతుందికదా Read more

Mosquitoes : దోమలు ఎక్కువగా ఎవరిని కుడతాయంటే?
mosquitoes bits

దోమలు ప్రతి ఒక్కరిని ఒకేలా దాడి చేయవు. కొన్ని వ్యక్తులను ఎక్కువగా, మరికొందరిని తక్కువగా కుడతాయి. దీని వెనుక కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రక్తపు గ్రూప్ Read more

జపాన్‌ ప్రధానిగా మరోసారి షిగేరు ఇషిబా ఎన్నిక
Shigeru Ishiba was elected as the Prime Minister of Japan once again

టోక్యో : మరోసారి జపాన్‌ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. పార్లమెంటు చరిత్రలో అరుదైన రీతిలో రనాఫ్‌ రౌండ్‌లో ఆయన ఎన్నికయ్యారు. దీంతో ఆయన నేతృత్వంలో Read more