CM Chandrababu restarted AP capital works

ఏపీ రాజధాని పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ మొదలైంది. తుళ్లూరు మండలం.. రాయపూడి దగ్గర రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. అక్కడి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) భవనానికి పూజలు చేశారు. ఆ తర్వాత భవనంలో కలియ తిరిగారు. అక్కడి అధికారులను రాజధాని నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి నారాయణ కూడా చంద్రబాబుతో ఉన్నారు.

CRDA ఆఫీసు పనుల ద్వారా ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైనట్లైంది. ఇక ఈరోజు నుంచి రాజధాని నిర్మాణం సాగుతుంది. CRDA భవనాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకూ నిధులు కేటాయించారు. ఏడు అంతస్థుల ఈ భవనంలో ఇదివరకు రాజధాని పనులు సాగేవి. 2017 నుంచి ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. ఐతే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఈ భవనంలో పనులకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఇందులో కొన్ని మరమ్మతుల వంటివి చేపట్టాల్సి ఉంది. అలాగే సరికొత్త మార్పులు చెయ్యాల్సి ఉంది. అవి పూర్తయ్యాక.. రాజధానిలో చేపట్టాల్సిన నిర్మాణాల పనులు మొదలవుతాయి.

సీఆర్డీయే ప్రధాన కార్యాలయం జీ ప్లస్ 7గా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.160 కోట్లు కేటాయించారు. సీఆర్డీయే, ఏడీసీ, మున్సిపల్ శాఖలోని అన్ని హెచ్ఓడీ కార్యాలయాలు ఈ భవనంలోనే ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఇక వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం చేపట్టేలా ప్లాన్ ఉంది. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాలకు సంబంధించిన పనులు 2025 జనవరి కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

Related Posts
గుకేశ్ గెలిచిన క్షణం.. తండ్రి భావోద్వేగం
gukesh dommaraju won world

భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ అతి చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ (18)గా అవతరించిన సంగతి తెలిసిందే. కొడుకు విజయం కోసం పరితపించిన అతడి Read more

నేడు సూర్యాపేటలో పర్యటించనున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
Governor Jishnu Dev Varma will visit Suryapet today

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడురోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయం సూర్యాపేట జిల్లాలో సందర్శనకు వెళ్లనున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశానికి Read more

సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో మహిళ అరెస్ట్‌
సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మహిళ అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే ఆయన నివాసంలో కత్తితో దాడి చేసిన కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను ముంబై Read more

సోనూసూద్ మంచి మనసు.. చిన్నారికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్
sonuhelps

సినీ నటుడు సోనూసూద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఖమ్మం (D) చెన్నూరుకి చెందిన నిరుపేదలు కృష్ణ, బిందుప్రియల మూడేళ్ల కూతురికి ఉచితంగా ముంబైలో హార్ట్ ఆపరేషన్ Read more