Ex minister of Delhi who was released from jail. Kejriwal touched and invited

జైలు నుంచి విడుదలైన ఢిల్లీ మాజీ మంత్రి.. హత్తుకుని ఆహ్వానించిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన 18 నెలల సుదీర్ఘ కారాగారవాసాన్ని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉటంకిస్తూ, ఇంకా విచారణే ప్రారంభం కాలేదని పేర్కొంటూ జైన్‌కు బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆప్ నేత మనీశ్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. సత్వర విచారణ హక్కును ప్రాథమిక హక్కుగా పేర్కొంది.

మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రజైన్‌ను ఈడీ 2022 మే 30న అరెస్ట్ చేసింది. కోర్టు తీర్పును వెల్లడిస్తూ మనీలాండరింగ్ వంటి కఠిన చట్టాల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని ఎత్తి చూపింది. కాగా, ఈ కేసును విచారిస్తునన ఈడీ జైన్ బెయిలు దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే, కేసు విచారణ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదని, త్వరలోనే కేసును ముగించాలని ఆదేశించింది.

శనివారం తీహార్ జైలు నుంచి విడుదలైన సత్యేంద్రజైన్‌ను కేజ్రీవాల్ ఆహ్వానించారు. ‘వెల్కం బ్యాక్ సత్యేంద్ర’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. జైన్‌ను ఆలింగనం చేసుకున్న రెండు ఫొటోలను షేర్ చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం సత్యేంద్రజైన్ మాట్లాడుతూ.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రశ్నిస్తున్న వారిపై అణచివేతకు దిగుతోందని ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Related Posts
ఎన్సీపీ గూటికి బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్‌
Baba Siddiques son Zeeshan Siddique of NCP

ముంబయి : మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పవార్‌ వర్గంలో.. మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ కుమారుడు జీషన్‌ సిద్ధిక్‌ చేరారు. కాంగ్రెస్‌లో టికెట్ పొందకపోవడం Read more

పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం – విజయసాయి రెడ్డి
polavaram

వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పలు అంశాలను ప్రస్తావిస్తూ, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు Read more

MLCఎలక్షన్స్: ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?
Telangana MLC nomo

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది.MLCఎలక్షన్స్: ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే . ఈ మూడు స్థానాలకు మొత్తం 118 మంది అభ్యర్థులు Read more

పాస్‌పోర్టుల జాబితాలో దిగజారిన భారత్‌ ర్యాంక్‌
passport

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్‌ 85వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 80వ స్థానంలో ఉండగా.. ఈ సారి ఐదు స్థానాలు దిగజారింది. వీసా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *