New law in AP soon: CM Chandrababu

శ్వేతపత్రాలపై ఏం చేశారు…? అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్

అధికారంలోకి వచ్చి రాగానే చంద్రబాబు ..గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పత్రాల్లో అనేక అంశాలను ప్రస్తావించి వీటిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. అయితే రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అధికారులనుండి ఎలాంటి సమాచారం లేకపోవడం తో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్వేతపత్రాలపై తీసుకున్న చర్యలు, జరుగుతున్న విచారణలు వంటి అంశాలపై సమగ్ర నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.

ఇదే క్రమంలో రాష్ట్రంలోని రోడ్ల విషయంలో గుడ్ న్యూస్ తెలిపారు. ప్రస్తుతం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకంపై ఫోకస్ పెట్టామన్న ఆయన.. రోడ్లను బాగు చేసే అంశాన్ని కూడా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి రోడ్ల మరమ్మతులు ప్రారంభం అవుతాయనీ, యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు జరుగుతాయని తెలిపారు.

సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైనా గుంతలు కనిపించడానికి వీల్లేదని అధికారులకు తెలిపారు చంద్రబాబు. ఆర్‌అండ్‌బీ (R&B) పరిధిలోని రహదారుల్లో గుంతలు పూడ్చడానికి రూ.600 కోట్లు ఇచ్చామన్న ఆయన.. అవసరమైతే మరో రూ.300 కోట్లు ఇస్తామన్నారు. అందువల్ల సంక్రాంతి నాటికి ఏపీ రోడ్లుబాగుపడనున్నాయి.

Related Posts
శ్రీకాళహస్తిపై భక్తుల ఫిర్యాదు: ఘాటుగా స్పందించిన నారా లోకేష్
శ్రీకాళహస్తిపై భక్తుల ఫిర్యాదు: ఘాటుగా స్పందించిన నారా లోకేష్

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగిన ఒక సంఘటనపై ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, ఆంధ్రప్రదేశ్ సమాచార, సాంకేతిక మరియు కమ్యూనికేషన్ల Read more

మాధవీలతపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
madavilatha JC

బీజేపీ నేత, నటి మాధవీలతపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ Read more

కుల గణన చిచ్చు..రేవంత్ సర్కార్ పై.. బీసీ సంఘాల ఫైర్!
కుల గణన చిచ్చు రేవంత్ సర్కార్ పై.. బీసీ సంఘాల ఫైర్!

2014లో జరిగిన సమగ్ర సర్వేలో OC (ఆప్తి కేటగిరీ) జనాభా 11% ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఆ సంఖ్య 15.79%కి పెరిగింది.ఇదే సమయంలో Read more

చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై నేడు తీర్పు
Chennamaneni Ramesh

బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై ఈరోజు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *