యువ దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) (Kiran Kumar) కన్నుమూశారు. కెరీర్‌లో కొత్త మలుపులు తిరుగుతున్న సమయంలోనే ఆయన ఇలా ఆకస్మికంగా మరణించడం పట్ల సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన దర్శకత్వం వహించిన ‘కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి హీరోలుగా నటించిన ఈ సినిమాలో ‘కె ర్యాంప్’ బ్యూటీ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also: Nagarjuna: ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసారు
ఈ సినిమాకు పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు నెలలో విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘కేడీ’ సినిమాతో కిరణ్‌కుమార్ (Kiran Kumar) దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ సినిమా పరాజయం కావడంతో కొంతకాలం దర్శకత్వానికి విరామం తీసుకున్న ఆయన, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా పని చేస్తూ వచ్చారు. మణిరత్నం తెరకెక్కించిన పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో అసోసియేట్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు.
కథనం, విజువల్ ట్రీట్ విషయంలో మణిరత్నం స్కూల్‌లో శిక్షణ పొందిన దర్శకుల్లో కేకే ఒకరని ఆయనతో పని చేసినవారు చెబుతుంటారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఇటీవల నటుడిగానూ తన ప్రతిభను చూపించారు కేకే. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భద్రకాళి’లో ఆయన సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. నటుడిగా, దర్శకుడిగా మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్న తరుణంలోనే ఆయన మరణించడం బాధాకరం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: