యశ్(Yash) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’ టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, టీజర్‌లో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)కి చెందిన నాయకులు కర్ణాటక మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సన్నివేశాలు ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read also: Rukmini Vasanth: ‘టాక్సిక్’ నుంచి రుక్కు ఫస్ట్ లుక్ రిలీజ్
యేటర్లకే సెన్సార్ నిబంధనలంటున్న CBFC
ఈ ఫిర్యాదుపై స్పందించిన కర్ణాటక మహిళా కమిషన్, టీజర్ విషయాన్ని పరిశీలించాలని కోరుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు అధికారిక లేఖ పంపింది. ప్రజల్లో ప్రతికూల ప్రభావం చూపే అంశాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది.
అయితే, ఈ అంశంపై క్లారిటీ ఇస్తూ సీబీఎఫ్‌సీ కీలక విషయాన్ని వెల్లడించింది. యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికల్లో విడుదలయ్యే టీజర్లు, ట్రైలర్లకు సెన్సార్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని, థియేటర్లలో ప్రదర్శించాల్సిన టీజర్లు లేదా ట్రైలర్లకు మాత్రమే తమ అనుమతి అవసరమని స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: