📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Yami Gautam: ‘హక్’ మూవీ పై సమంత ఏమన్నారంటే?

Author Icon By Aanusha
Updated: January 13, 2026 • 6:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నటి యామీ గౌతమ్ (Yami Gautam) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం హిందీ చిత్రసీమలో విభిన్నమైన కథలతో ముందుకెళ్తోంది. యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) జంటగా నటించిన సినిమా ‘హక్’ (Haqq) గత ఏడాది విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read also: OTT: ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!

Yami Gautam: What did Samantha say about the movie ‘Huck’?

యమీ గౌతమ్ఈ కథకు ప్రాణం పోశారు

ఈ సినిమా పై సమంత స్పందిస్తూ ప్రశంసలు కురిపించింది. “హక్ సినిమా అయిపోయిన వెంటనే ఈ మాటలు రాయాలనిపించింది. ఎందుకంటే ఆ సినిమా నాలో కలిగించిన భావోద్వేగాలను కొంచెం కూడా కోల్పోకూడదని అనుకున్నాను. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ కథ ఎంతో సహజంగా, లోతైన మానవీయ కోణంలో సాగింది.ఎక్కడా ఎవరినీ తక్కువ చేసి చూపించలేదు. ముఖ్యంగా యమీ గౌతమ్ లాంటి అద్భుతమైన నటి ఈ కథకు ప్రాణం పోశారు. యామీ.. నీ నటన నన్ను మాటల్లో చెప్పలేనంతగా కదిలించింది.

ఒకేసారి ప్రేమ, ఆగ్రహం, బలం, నిస్సహాయత, ఆశ.. ఇలా అన్ని భావాలను నేను అనుభవించాను. సినిమా అంటే ఇది. ఎన్నో ఆటుపోటుల మధ్య మనం ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నామో, ఎందుకు కష్టపడతామో చెప్పడానికి ఇలాంటి సినిమాలే నిదర్శనం. చాలా ఏళ్ల తర్వాత ఒక నటన నన్ను ఇంతలా కదిలించింది. యమీ గౌతమ్ నటనను వర్ణించడానికి పదాలు సరిపోవు. ఆమె మౌనం, చూపులు, క్లైమాక్స్ మోనోలాగ్.. నటన నేర్చుకునే వారికి ఇదొక పాఠం. ఆమెకు సెల్యూట్ చేస్తున్నాను” అని రాసుకొచ్చిం

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Emraan Hashmi Haqq movie Netflix Streaming SamanthaLatest News Telugu News Yami Gautam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.