ఇటీవల కాలంలో ప్రేమకథా సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో ప్రేమకథ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అతి త్వరలోనే మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. టూరిస్ట్ ఫ్యామిలీతో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అభిషన్ (Abishan Jeevinth) హీరోగా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.తాజాగా ఆయన ‘విత్ లవ్’ (With Love) అనే క్యూట్ లవ్ స్టోరీతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
Read Also: Anirudh Ravichander: టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది
కీలక పాత్రల్లో
మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్ స్టోరీలో అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) హీరోగా నటిస్తుండగా, మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది.ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 06న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథగా కనిపిస్తోంది.
ట్రైలర్‌లో విజువల్స్, మ్యూజిక్ ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తుండగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కావ్య అనిల్, సచిన్ నాచిప్పన్, తేని మురుగన్, శరవణన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: