📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Patang Movie: ఓటీటీలోకి ‘ప‌తంగ్’ ఎప్పుడంటే?

Author Icon By Anusha
Updated: January 25, 2026 • 1:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పతంగ్‌ల నేపథ్యంలో తెలుగులో ఇప్పటి వరకు సినిమాలు రాలేదు. స్నేహానికి, ప్రేమకి, పతంగ్‌కి ముడిపెడుతూ రూపొందించిన ‘పతంగ్‌’ మూవీ (Patang Movie) ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు ముస్తాబవుతోంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక స‌న్‌నెక్స్‌ట్ ఈ సినిమా డిజిటల్ హ‌క్కుల‌ను ద‌క్కించుకోగా.. జ‌న‌వ‌రి 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.

Read Also: Nayanthara: ‘పేట్రియాట్’ మూవీ నుంచి నయన్ ఫస్ట్ లుక్ విడుదల

When will ‘Patang’ hit OTT?

ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముక్కోణపు ప్రేమకథను వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించగా, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్.పి. చరణ్ కీలక పాత్రలు పోషించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

పతంగ్ మూవీ కథ ఇదే

ఈ సినిమా (Patang Movie) క‌థ విష‌యానికి వ‌స్తే.. విస్కీ (వంశీ పూజిత్), అరుణ్ (ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. దాదాపు 12 ఏళ్ల వీరి స్నేహంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. ఐశ్వర్య పట్ల ఇద్దరికీ ఇష్టం ఏర్పడడంతో వీరి స్నేహంలో చిన్నపాటి గ్యాప్ వస్తుంది. ఈ ముక్కోణపు ప్రేమకథకు ఒక స్పష్టమైన ముగింపుని ఇవ్వడం కోసం, హీరోలు ఇద్దరూ పతంగుల పోటీని ఎంచుకుంటారు. మ‌రి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరికి ఐశ్వర్య ఎవరిని వరించింది? అనేదే ఈ సినిమా క‌థ‌.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Patang Movie Sun NXT Telugu News Telugu OTT Release Youth Entertainer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.