కలర్ ఫోటో సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్. షార్ట్ ఫిల్స్మ్ తెరకెక్కిస్తూ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన సందీప్.. కలర్ ఫోటో మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మోగ్లీ సినిమా (Mowgli Movie) ను తెరకెక్కించారు.
Read Also: Movies: ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఇవే?
డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ (ETV Win) సంస్థ దక్కించుకుంది
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ (Mowgli Movie) లో యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించారు.. ఇందులో సాక్షి మడోల్కర్ హీరోయిన్ గా నటించగా.. బండి సరోజ్ కుమార్ విలన్ పాత్ర పోషించారు. ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతోంది. తాజాగా డిజిటల్ ప్రీమియర్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.‘మోగ్లీ 2025’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ (ETV Win) సంస్థ దక్కించుకుంది. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1వ తేదీ నుంచి ఓటీటీలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అంటే థియేటర్లలో రిలీజైన 20 రోజులకు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: