📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Mirai Movie: ఓటీటీలోకి మిరాయ్‌ ఎప్పుడంటే?

Author Icon By Anusha
Updated: October 4, 2025 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన మిరాయ్ చిత్రం (Mirai Movie) రిలీజ్ అయినప్పటి నుండి ప్రేక్షకులను మంత్రముగ్ధులుగా చేసింది.. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ-అడ్వెంచర్ చిత్రం, థియేటర్లలో ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన పొందింది. సృజనాత్మక కథ, ఆకర్షణీయమైన విజువల్స్, చక్కటి మ్యూజిక్, నటీనటుల నైపుణ్యం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి.

Little Hearts: ఓటీటీలో దుమ్మురేపుతున్న లిటిల్ హార్ట్స్ మూవీ

ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం రూ.150 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ (OTT) లోకి రాబోతుంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar) లో ఈ చిత్రం అక్టోబర్‌ 10 నుంచి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

థియేట్రికల్‌ రన్‌లో ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం 2025లో టాలీవుడ్‌ టాప్ కలెక్షన్లు (Tollywood top collections) సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్ 12న రిలీజైన ఈ చిత్రం మూడు వారాల థియేట్రికల్ రన్ పూర్తయినా ఇప్పటికీ చాలా ఏరియాల్లో స్ట్రాంగ్‌గా నడుస్తోంది.

అయితే ఇంత మంచి హిట్ సాధించిన ఈ చిత్రం నెల రోజులు తిరగకముందే ఓటీటీలోకి వస్తుండటం నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఓటీటీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఓటీటీలో రిలీజ్ చేయకతప్పని పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదే మ్యాజిక్‌ రిపీట్ చేస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News fantasy adventure film Jio Hotstar streaming karthik ghattamaneni latest news Manchu Manoj Mirai Movie October 10 premiere OTT Release Teja Sajja Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.