📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: Kantara Chapter 1: ఓటీటీలోకి కాంతార చాప్ట‌ర్ 1 ఎప్పుడంటే?

Author Icon By Aanusha
Updated: October 27, 2025 • 7:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కాంతార: చాప్టర్-1’ (Kanthara Chapter 1) రికార్డుల పరంపరను సృష్టిస్తోంది. విడుదలైన మూడు వారాల వ్యవధిలోనే ఈ సినిమా 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచి సంచలనం రేపింది. రిషబ్‌ శెట్టి (Rishab Shetty) మళ్లీ ఒకసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ ఏమిటో రుజువు చేశారు.

Read Also: Karthi: చిరంజీవి సినిమాలో కార్తీ

ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ఛావా’ రూ.807 కోట్లు వసూలు చేసి టాప్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘సైయారా’ రూ.600 కోట్ల వద్ద ఆగిపోయింది. భారీ హైప్ ఉన్న ‘కూలీ’ కూడా ఆ రికార్డును దాటలేకపోయింది. అయితే రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్-1’ (Kanthara Chapter 1) మాత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేసి, ఈ రికార్డును చెరిపేసింది.

Kantara Chapter 1

ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా కాంతార: చాప్టర్-1

లెక్కల ప్రకారం, ఈ చిత్రం 22వ రోజుకే రూ.818 కోట్ల వరల్డ్‌వైడ్ కలెక్షన్‌ సాధించింది. దీంతో ‘కాంతార: చాప్టర్-1’ ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అయితే వసూళ్లు ఇక్కడితోనే ఆగిపోయే అవకాశం ఉందని ట్రేడ్‌ సర్కిల్స్‌ చెబుతున్నాయి. మొదట వెయ్యి కోట్ల మార్క్ చేరుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యం సాధ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమా ఓటీటీలో (OTT) స్ట్రీమింగ్‌కు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని అక్టోబర్ 31 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు కొద్ది సేప‌టి క్రితం అధికారికంగా ప్రకటించారు.

థియేట‌ర్స్‌లో ర‌చ్చ లేపిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని ప్రతి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ (Rukmini Vasant) హీరోయిన్‌గా నటించగా జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, హొంబలే ఫిల్మ్స్ (Hombale Films) ప్రొడ్యూస్ చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Amazon Prime Video Breaking News Kantara Chapter 1 collections latest news Rishab Shetty Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.