Latest News: Jigris Movie: జిగ్రీస్ విడుద‌ల ఎప్పుడంటే?

Read Time:  1 min
 Jigris Movie
 Jigris Movie
FONT SIZE
GET APP

టాలీవుడ్‌ యువ నటుల కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్, నితిన్ (మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ ఫేమ్) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రీస్’ (Jigris Movie) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇది రోడ్ ట్రిప్, ఫ్రెండ్షిప్ జానర్లో రూపొందించబడిన చిత్రం.

Read Also: Chiranjeevi: చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ

హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తుండగా.. మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నాడు. వినయ్ కుమార్ చిటెం, కృష్ణ బురుగుల సహ-నిర్మాతలుగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా టీజ‌ర్‌ను టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

 Jigris Movie
 Jigris Movie

సందీప్ లాంటి స్టార్ ద‌ర్శ‌కుడు ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డంతో మూవీ టీజ‌ర్‌పై మంచి బ‌జ్ ఏర్పడింది. అనుకున్న‌ట్లుగానే ఈ సినిమా టీజ‌ర్ యూట్యూబ్‌ (YouTube) లో వ్యూస్‌తో అద‌ర‌గొడుతుంది. టీజ‌ర్ చూసిన ప్రేక్ష‌కులు బాగుంద‌ని.. ఈ న‌గ‌రానికి ఏమైంది, హుషార్ మ్యాడ్ వంటి సినిమాల వైబ్‌ని తీసుకువ‌స్తుంద‌ని కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలావుంటే తాజాగా ఈసినిమా విడుద‌ల (Jigris Movie) తేదీని చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది. ఈ సినిమాను న‌వంబ‌ర్ 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.