📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest news: Rashmika Mandanna: మ‌గాళ్ల‌కి పీరియ‌డ్స్ వ‌స్తే అమ్మాయిల భాధ అర్దమవుతుంది: ర‌ష్మిక

Author Icon By Anusha
Updated: November 5, 2025 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది సినీ రంగంలో అత్యంత బిజీగా ఉన్న నటీమణుల్లో ఒకరు రష్మిక మందన్నా (Rashmika Mandanna). ప్రతి రెండు నెలలకు ఒక సినిమా విడుదల చేస్తూ ప్రేక్షకులను తన నటనతో, అందంతో, ఆకర్షణీయమైన పాత్రలతో అలరిస్తోంది. రష్మిక సినీ కెరీర్ ఇప్పటివరకు దూసుకుపోతూ, తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో ఆదరణ పొందుతోంది.

Read Also: Bigg Boss: బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం హడావిడి!

గత ఏడాది చివర్లో విడుదలైన ‘పుష్ప 2: ది రూల్’ ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రష్మిక (Rashmika Mandanna) పేరు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. దాని తర్వాత ఆమె నటించిన వరుస సినిమాలు కూడా హిట్టయ్యాయి. ఈ ఏడాది ఆమె నటించిన ‘ఛావా’, ‘సికందర్’, ‘కుబేర’, ‘థామా’ చిత్రాలు థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు సాధించాయి.

ఇప్పుడు రష్మిక నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend movie) ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రష్మిక పలు ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. షోలు, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తోంది.తాజాగా ఆమె జగపతిబాబు హోస్ట్‌గా రన్ అవుతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్‌ షో (‘Jayammu Nischayammu Ra’ talk show) లో పాల్గొని సందడి చేసింది.

Rashmika Mandanna

రష్మిక తన చిన్ననాటి అనుభవాలను పంచుకుంటూ

ఈ సందర్భంగా రష్మిక తన చిన్ననాటి అనుభవాలను పంచుకుంటూ, స్కూల్‌ రోజుల్లో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసింది. జగపతిబాబు (Jagapathi Babu) అడిగిన ప్రశ్నలకు రష్మిక ఇచ్చిన సరదా సమాధానాలు ప్రేక్షకులను అలరించాయి. అంతేకాకుండా, షోలో రష్మిక మహిళలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడింది. “మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని అనిపించింది.

ఆ సమయంలో మహిళలు ఎదుర్కొనే నొప్పి, బాధ ఎలా ఉంటుందో అబ్బాయిలు కూడా అనుభవిస్తే వారికి అర్ధం అవుతుంద‌ని చెప్పి అందర్నీ ఆకట్టుకుంది. ఆమె మాటలకు జగపతిబాబు, ఆడియెన్స్‌, చప్పట్లు కొట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

latest news Rashmika Mandanna Telugu News The Girlfriend Movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.