📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Sandeep Vanga: ‘స్పిరిట్’లో చిరంజీవి నటిస్తున్నారన్న వార్తలపై సందీప్ వంగా ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: November 12, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’ సినిమా (‘Spirit’ movie) పై, ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన సందీప్ వంగా, ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి మరొక పాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నారు.

Read Also: TG: నటుడు నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ

ఇప్పటికే ఈ సినిమా టైటిల్, అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లు చూసిన అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రభాస్ కొత్త లుక్, యాక్షన్ డోస్, కథాంశం పట్ల ఆసక్తి పెరిగిపోతోంది. అయితే, కొంతకాలంగా సోషల్ మీడియాలో “మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా స్పిరిట్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారట” అనే వార్తలు వైరల్‌గా మారాయి.

ఈ రూమర్స్ ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా మెగా అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఈ కాంబినేషన్ నిజం కావాలని ఆశపడ్డారు.అయితే, ఈ వార్తలపై స్వయంగా దర్శకుడు సందీప్ వంగా (Sandeep Vanga) స్పందిస్తూ అన్ని సందేహాలకు తెరదించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఈ పుకార్లపై స్పష్టత ఇచ్చారు.

Sandeep Vanga

ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు

“‘స్పిరిట్’ సినిమాలో చిరంజీవి గారు నటిస్తున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. అయితే, నేను ఆయనకు పెద్ద అభిమానిని. భవిష్యత్తులో మెగాస్టార్‌తో తప్పకుండా ఓ సినిమా చేస్తాను.

కానీ అది ‘స్పిరిట్’ మాత్రం కాదు” అని ఆయన తేల్చిచెప్పారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపై చూడాలనుకున్న మెగా అభిమానుల్లో కొంత నిరాశ వ్యక్తమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Chiranjeevi latest news Prabhas Sandeep Reddy Vanga Spirit Movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.