📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rukmini Vasanth: విలన్‌ రోల్ పై రుక్మిణి వసంత్‌ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: December 18, 2025 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) సప్తసాగరాలు దాటి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. దీని తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో చాలా సినిమాలు చేసిందీ అందాల తార. బఘీరా, బైరతిరంగల్ (కన్నడ), అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, ఏస్ (తమిళ్), మదరాసి వంటి సినిమాల్లో కథానాయికగా యాక్ట్ చేసింది. అయితే ఈ సినిమాలన్నీ సో సోగానే ఆడాయి.

Read Also: Shivaji: అందుకే ప్రజలు ఓటీటీలకు వెళ్తున్నారు: నటుడు శివాజీ

అయితే లేటెస్ట్ గా ఆమె నటించిన కాంతార ఛాప్టర్ 1 మాత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇందులో రిషభ్ శెట్టి నటన అందరూ ఊహించినదే అయినా రుక్మిణీ (Rukmini Vasanth) పాత్ర మాత్రం సినిమాకు హైలెట్ గా నిలిచింది. నెగెటివ్ రోల్ లో మెయిన్ విలన్ గా ఆమె అభినయం అందరినీ కట్టిపడేసింది.చాలా మంది ఈ రోల్‌ చూసి షాకయ్యారు.

What does Rukmini Vasanth have to say about playing a villain?

విలన్‌ పాత్రల్లో నటిస్తానేమోనని అనుకున్నా

అయితే విలన్‌ పాత్ర గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం షేర్ చేసింది రుక్మిణి వసంత్‌. నా కెరీర్‌ తొలినాళ్లలోనే కాంతార చాప్టర్‌ 1లో నేను విలన్‌ పాత్రలో నటించడం చాలా ప్రమాదకర ప్రయోగం. దీంతో ఇక నేను జీవితంలో మిగిలిన టైం అంతా విలన్‌ పాత్రల్లో నటిస్తానేమోనని ఆశ్చర్యపోయా.

నేను నెగెటివ్‌ రోల్‌ పోషించడాన్ని జనాలు ప్రేమించారు.. వాళ్లు నన్ను అసహ్యించుకోలేదు. అందువల్లే సినిమా ఎలా ఆడుతుందో ఆలోచిస్తూ నేను భయపడాల్సిన అవసరం లేదంది. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు అది గొప్ప విషయమంటూ చెప్పుకొచ్చింది రుక్మిణి వసంత్‌. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Kantara Chapter 1 latest news Rishab Shetty Rukmini Vasanth Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.