📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Rajinikanth: ‘నరసింహ’ సీక్వెల్‌పై రజినీకాంత్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: December 9, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పుట్టినరోజు (డిసెంబర్ 12) సందర్భంగా ఆయన అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు. రజని కెరీర్‌లో సంచలనం సృష్టించిన బ్లాక్‌బస్టర్ ‘పడయప్పా’ (తెలుగులో ‘నరసింహ’) ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ అవుతోంది.ఈసారి 4K డిజిటల్ ప్రింట్‌, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో సినిమాను విడుదల చేయనుండటం విశేషం. దీంతో విజువల్‌, సౌండ్ అనుభూతి పూర్తిగా కొత్త లెవల్‌లో ఉండనుందని అభిమానులు భావిస్తున్నారు.

Read Also: Bandi Saroj: ‘అఖండ 2’ నిర్మాతలపై బండి సరోజ్ ఫైర్

What did Rajinikanth say about the sequel to ‘Narasimha’?

రజని కెరీర్‌లో ‘నరసింహ’ బ్లాక్‌బస్టర్

ఇంటర్వ్యూలో రజనీకాంత్ (Rajinikanth) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు సీక్వెల్ తీసే అవకాశం ఉందని, అయితే అది తనకంటే ఎక్కువగా రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర చుట్టూనే కేంద్రీకృతమై ఉంటుందని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. నీలాంబరి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రమ్యకృష్ణ చేసిన ఆ నెగటివ్ షేడ్ పాత్ర తమిళ–తెలుగు సినీ చరిత్రలోనే ఓ ఐకానిక్ విలన్ పాత్రగా నిలిచిపోయింది.ఆమె నటన, హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే మొదటి భాగంలో నీలాంబరి పాత్ర చనిపోతుంది. అలాంటప్పుడు సీక్వెల్‌లో ఆ పాత్ర ఎలా తిరిగి వస్తుంది? ఇది ఫ్లాష్‌బ్యాక్ ఆధారిత కథనా? లేక కొత్త కోణంలో కథను మలుస్తారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Narasimha sequel Neelambari title Rajinikanth Ramya Krishna Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.