Vishwak Sen: ‘ఫంకీ’ ట్రైలర్ ఎలా ఉందంటే?

Read Time:  1 min
Vishwak Sen: ‘ఫంకీ’ ట్రైలర్ ఎలా ఉందంటే?
FONT SIZE
GET APP
Vishwak Sen: How is the ‘Funky’ trailer?
Vishwak Sen: How is the ‘Funky’ trailer?

విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్‌టైనర్‌ ‘ఫంకీ’పై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ‘జాతిరత్నాలు’ వంటి సూపర్ హిట్ కామెడీ మూవీతో ప్రేక్షకులను నవ్వించిన, డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, పూర్తి స్థాయి వినోదంతో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది.ప్రేమికుల దినోత్సవం కానుకగాఈ నెల 13న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Read Also: Arjun Sarja: నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు: అర్జున్

అలరించడం ఖాయం

ట్రైలర్ ప్రారంభం నుంచే తనదైన మార్క్ కామెడీ చూపించాడు అనుదీప్. పంచులతో, కామెడీతో ట్రైలర్ మొత్తం అదిరిపోయింది. మీ అమ్మకు ఆపరేషన చేయాలంటే నాకు రాదు డాక్టర్ అనే డైలాగ్ నుంచి మొదలుకుని.. ఓనర్ కు రెంటు కట్డుడు వంటివన్నీ నాకు గలీజ్ అనిపిస్తాయ్ అంటాడు హీరో. మీ అమ్మ కోడలు అనడం..

మా నాన్న అల్లుడు అనడం కూడా గలీజ్ అనిపిస్తాయ్ అని హీరోయిన్ చెప్పడం సైతం హైలెట్ అయ్యింది. మొత్తానికి ఈసారి ఫంకీ మూవీ సైతం అనుదీప్ మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తోంది.ఫంకీ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అనుదీప్ సైతం అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.